Title | Price | |
Yajusha smartha Grandham (part- 5) | Rs.200 | In Stock |
“తాదిట్టకు వాదులేదు కడుధీరత వైరుల సంగరంబులో ముట్టక భూమిలేదు" కీ.శే. చోడవరపు శ్రీచంద్రశేఖరరావు, చోడవరపు శ్రీమతి సీతామహాలక్ష్మి పుణ్యదంపతులకు 9మంది కుమారులు, ఇద్దరు కుమార్తెలు వారికి 3వ కుమారుడుగా, మా తండ్రిగారైన కీ. శే. చోడవరపు పార్థివేశ్వరరావుగారు 21-4-1929న ఉయ్యూరు గ్రామం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో జన్మించిరి. మా తాతగారైన చోడవరపు చంద్రశేఖరరావుగారిది ప్రధానంగా కర్షక, మధ్యమ కుటుంబం, ఆయన తన పుత్రులకు, భగవత్ చింతన, కర్రసాము వ్యవసాయం మొదలగునవి నేర్పితిరి. పెరుగుతున్న కుటుంబము కేవలము వ్యవసాయము మీద సాకలేనని గ్రహించి వారు తన కుమారులను ఉన్నత విద్యాబుద్ధులు చేపట్టురీతిగా వారికి విద్యాబుద్ధులు నేర్పితిరి.
ఆ క్రమమున ఉన్న ఊరులోనే మా నాన్నగారు తన అన్నతమ్ముళ్లతో వారి తండ్రికి పొలము పనులలో సహాయపడుతూనే విద్యాభ్యాసము పూర్తి చేసిరి. అనంతరము వారు తండ్రి సలహామేరకు, హైదరాబాదులో ప్రాగా టూ లో మొదట ఏమీ వేతనము లేక, తదుపరి నిత్యవేతనంతో ఆ పిమ్మట పర్మినెంట్ ఉద్యోగము సంపాదించిరి. ఇంజనీరింగ్ కిటుకులలో నిష్ణాతులై వారు 1956వ సంవత్సరములో భారతసర్కారు స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా రంగప్రవేశము చేసిరి. అదిలగాయతు వారు అలహాబాద్, జైపూర్, పాట్నా, ఢిల్లీ, రాంచి, ముజఫర్పూర్లలో విధి నిర్వహణ చేసిరి. భారతదేశ పురోగమనమునకు లఘు ఉద్యోగ పరిశ్రమలే హేతువు, నాందీ అని గ్రహించి, ఉద్యోగరీత్యా వేలకొలది SSI ల నిర్మాణమునకు దోహదపడిన శ్రమజీవి వారు. వారి పనులకు మెచ్చి, భారతసర్కారు వారిని రెండు పర్యాయములు ప్రత్యేక సలహాదారుగా (U.N. Foundation ద్వారా) Europe, మరియు Afghanistan పంపినది. అక్కడ వారు తమ పనుల వలన ఆయా దేశ ప్రభుత్వముల మన్ననలను పొంది, దేశమునకు, తనకు కీర్తి తెచ్చుకొనిరి. మా కుటుంబములో విదేశీ పర్యటన చేసిన మొట్టమొదటి వ్యక్తి మా నాన్నగారు. ఉద్యోగ నిర్వహణలో వారు కొన్ని ప్రదేశములలో పని చేయవలసి వచ్చినపుడు అవి హింసాత్మక స్థలములు మీకేమయిన అయినను మాకు ఏమి గతి అని మా అమ్మగారు మధన పడినప్పుడు, వారి సహోద్యోగులు అమ్మా ! మీరు చింతించకండి, మానవతదృక్పధం ఉన్న రావుగారికి ఎట్టి ప్రమాదము లేదు, నిర్భయంగా ఉండండి, ప్రజలే వారికి కవచము.
“తాదిట్టకు వాదులేదు కడుధీరత వైరుల సంగరంబులో ముట్టక భూమిలేదు" కీ.శే. చోడవరపు శ్రీచంద్రశేఖరరావు, చోడవరపు శ్రీమతి సీతామహాలక్ష్మి పుణ్యదంపతులకు 9మంది కుమారులు, ఇద్దరు కుమార్తెలు వారికి 3వ కుమారుడుగా, మా తండ్రిగారైన కీ. శే. చోడవరపు పార్థివేశ్వరరావుగారు 21-4-1929న ఉయ్యూరు గ్రామం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో జన్మించిరి. మా తాతగారైన చోడవరపు చంద్రశేఖరరావుగారిది ప్రధానంగా కర్షక, మధ్యమ కుటుంబం, ఆయన తన పుత్రులకు, భగవత్ చింతన, కర్రసాము వ్యవసాయం మొదలగునవి నేర్పితిరి. పెరుగుతున్న కుటుంబము కేవలము వ్యవసాయము మీద సాకలేనని గ్రహించి వారు తన కుమారులను ఉన్నత విద్యాబుద్ధులు చేపట్టురీతిగా వారికి విద్యాబుద్ధులు నేర్పితిరి. ఆ క్రమమున ఉన్న ఊరులోనే మా నాన్నగారు తన అన్నతమ్ముళ్లతో వారి తండ్రికి పొలము పనులలో సహాయపడుతూనే విద్యాభ్యాసము పూర్తి చేసిరి. అనంతరము వారు తండ్రి సలహామేరకు, హైదరాబాదులో ప్రాగా టూ లో మొదట ఏమీ వేతనము లేక, తదుపరి నిత్యవేతనంతో ఆ పిమ్మట పర్మినెంట్ ఉద్యోగము సంపాదించిరి. ఇంజనీరింగ్ కిటుకులలో నిష్ణాతులై వారు 1956వ సంవత్సరములో భారతసర్కారు స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా రంగప్రవేశము చేసిరి. అదిలగాయతు వారు అలహాబాద్, జైపూర్, పాట్నా, ఢిల్లీ, రాంచి, ముజఫర్పూర్లలో విధి నిర్వహణ చేసిరి. భారతదేశ పురోగమనమునకు లఘు ఉద్యోగ పరిశ్రమలే హేతువు, నాందీ అని గ్రహించి, ఉద్యోగరీత్యా వేలకొలది SSI ల నిర్మాణమునకు దోహదపడిన శ్రమజీవి వారు. వారి పనులకు మెచ్చి, భారతసర్కారు వారిని రెండు పర్యాయములు ప్రత్యేక సలహాదారుగా (U.N. Foundation ద్వారా) Europe, మరియు Afghanistan పంపినది. అక్కడ వారు తమ పనుల వలన ఆయా దేశ ప్రభుత్వముల మన్ననలను పొంది, దేశమునకు, తనకు కీర్తి తెచ్చుకొనిరి. మా కుటుంబములో విదేశీ పర్యటన చేసిన మొట్టమొదటి వ్యక్తి మా నాన్నగారు. ఉద్యోగ నిర్వహణలో వారు కొన్ని ప్రదేశములలో పని చేయవలసి వచ్చినపుడు అవి హింసాత్మక స్థలములు మీకేమయిన అయినను మాకు ఏమి గతి అని మా అమ్మగారు మధన పడినప్పుడు, వారి సహోద్యోగులు అమ్మా ! మీరు చింతించకండి, మానవతదృక్పధం ఉన్న రావుగారికి ఎట్టి ప్రమాదము లేదు, నిర్భయంగా ఉండండి, ప్రజలే వారికి కవచము.© 2017,www.logili.com All Rights Reserved.