నాయకరాజులు - కాపయనాయకుడు
కాకతీయసామ్రాజ్యము తురుష్కుల వశముకాగా అంతకుపూర్వము కాకతి భూపతులకడ సేనానులుగ నుండినవారు స్వతంత్రులై తురుష్కులను ఆయాప్రాంతములనుండి తరుమగొట్టి, ఆంధ్రదేశమున తురుష్క పరిపాలనము నంతమొందించి మఱల హిందూపరిపాలనమునకు పునాదులు వైచిరి. ఇట్టివారిలో ప్రోలయనాయకుడొకడు. అనితల్లి కలువచేరు శాసనమున' ఈతనిని గురించియిట్లు
తెలుపబడినది.
“ఆ ప్రతాపరుద్రుడు స్వేచ్ఛచేతనే స్వర్గస్థుడుకాగా భూమి తురుషాక్రాంతమయ్యెను. సముద్రజల మగ్నమయినప్పుడాది వరాహమూర్తి యుద్ధరించిన విధమున, యవనులపాలయినప్పుడు ప్రోలయనాయకుడు భూమిని పునరుద్ధారము చేసెను. ప్రోలయనాయకుడు స్వర్గస్థుడుకాగా విశ్వేశ్వరానుజ్ఞచేఁ గాపయనాయకుఁడు డెబ్బదియేగురు నాయకులు తన్ను సేవింప నేల్బడి నెఱపుచుఁ దురుష్కలాక్రమించుకొనిన రాజ్యమెల్ల స్వవశము చేసికొని యనేకాగ్రహారములను బ్రాహ్మణులకు దానములొసఁగి పేర్వెలసెను. ఆతఁడును స్వర్గస్థుడయిన తర్వాత నా డెబ్బదియేగురు నాయకులుఁ దమ తమ భాగములందు రాజ్యమేలఁ జొచ్చిరి. అందు వేమనరేశ్వరుడొకడు"
కాకతీయసామ్రాజ్యము భగ్నమైన యనంతరము ఆంధ్రదేశమున నాయకరాజ్యమేర్పడినవిధమిది. ప్రోలయనాయకునికిని, కాపయనాయకునికిని గల సంబంధము అనితల్లి కలువచేరు శాసనమున దెలుపబడి యుండలేదు. వారిరువురును తండ్రి కొడుకులై యుందురేమో. ఈ నాయక రాజ్యమును సంస్థాపించిన ప్రోలయ నాయకుని గురించికాని, అతనితరువాత పరిపాలనము నెరపిన కాపయనాయకుని గురించి కాని మనకు విశేషమేమియు దెలియదు. వీరి రాజధాని యేదోకూడ తెలియదు; కాని అద్దంకి నగరము రాజధానిగా రెడ్డి రాజ్యమును సంస్థాపించిన వేమనరేశ్వరుడు కూడా కాపయనాయకుని సామంతులలో నొక్కడగుట చేత కాపయనాయకుని రాజ్యము కొంచెమించుగ ఉదయగిరివఱకు వ్యాపించియుండెనని నిశ్చయింపవచ్చును.
నాయకరాజులు - కాపయనాయకుడు కాకతీయసామ్రాజ్యము తురుష్కుల వశముకాగా అంతకుపూర్వము కాకతి భూపతులకడ సేనానులుగ నుండినవారు స్వతంత్రులై తురుష్కులను ఆయాప్రాంతములనుండి తరుమగొట్టి, ఆంధ్రదేశమున తురుష్క పరిపాలనము నంతమొందించి మఱల హిందూపరిపాలనమునకు పునాదులు వైచిరి. ఇట్టివారిలో ప్రోలయనాయకుడొకడు. అనితల్లి కలువచేరు శాసనమున' ఈతనిని గురించియిట్లు తెలుపబడినది. “ఆ ప్రతాపరుద్రుడు స్వేచ్ఛచేతనే స్వర్గస్థుడుకాగా భూమి తురుషాక్రాంతమయ్యెను. సముద్రజల మగ్నమయినప్పుడాది వరాహమూర్తి యుద్ధరించిన విధమున, యవనులపాలయినప్పుడు ప్రోలయనాయకుడు భూమిని పునరుద్ధారము చేసెను. ప్రోలయనాయకుడు స్వర్గస్థుడుకాగా విశ్వేశ్వరానుజ్ఞచేఁ గాపయనాయకుఁడు డెబ్బదియేగురు నాయకులు తన్ను సేవింప నేల్బడి నెఱపుచుఁ దురుష్కలాక్రమించుకొనిన రాజ్యమెల్ల స్వవశము చేసికొని యనేకాగ్రహారములను బ్రాహ్మణులకు దానములొసఁగి పేర్వెలసెను. ఆతఁడును స్వర్గస్థుడయిన తర్వాత నా డెబ్బదియేగురు నాయకులుఁ దమ తమ భాగములందు రాజ్యమేలఁ జొచ్చిరి. అందు వేమనరేశ్వరుడొకడు" కాకతీయసామ్రాజ్యము భగ్నమైన యనంతరము ఆంధ్రదేశమున నాయకరాజ్యమేర్పడినవిధమిది. ప్రోలయనాయకునికిని, కాపయనాయకునికిని గల సంబంధము అనితల్లి కలువచేరు శాసనమున దెలుపబడి యుండలేదు. వారిరువురును తండ్రి కొడుకులై యుందురేమో. ఈ నాయక రాజ్యమును సంస్థాపించిన ప్రోలయ నాయకుని గురించికాని, అతనితరువాత పరిపాలనము నెరపిన కాపయనాయకుని గురించి కాని మనకు విశేషమేమియు దెలియదు. వీరి రాజధాని యేదోకూడ తెలియదు; కాని అద్దంకి నగరము రాజధానిగా రెడ్డి రాజ్యమును సంస్థాపించిన వేమనరేశ్వరుడు కూడా కాపయనాయకుని సామంతులలో నొక్కడగుట చేత కాపయనాయకుని రాజ్యము కొంచెమించుగ ఉదయగిరివఱకు వ్యాపించియుండెనని నిశ్చయింపవచ్చును.© 2017,www.logili.com All Rights Reserved.