మున్నుడి
శ్లో॥ కాండ ద్వయోప పాద్యాయ కర్మబ్రహ్మ స్వరూపిణే |
స్వర్గాప వర్గ రూపాయ యజ్ఞేశాయ నమోనమః ॥
భక్త మహాశయులారా! మనది కర్మభూమి. ఈ కర్మ భూమిలో అనేక మంది సత్కర్మాచరణచే భగవదను గ్రహమును పొందిరి. అట్టి కర్మలు మూడు విధములుగా ఉన్నవి. 1.నిత్య, 2. నైమిత్తిక, 3. కామ్య కర్మలు. ఇందు నిత్య కర్మలనగా సంధ్యావందన, అగ్నిహోత్ర, వైశ్వదేవ, బ్రహ్మయజ్ఞ, అతిథి పూజాదులు. నైమిత్తికములు అనగా ఒక నిమిత్తమును గూర్చి చేయునవి. దర్శశ్రాద్ధాదులు, ప్రత్యాబ్దికములు, సంక్రాంతులు, వ్రతాదులు మున్నగునవి. ఇక కామ్య కర్మలనగా అనిష్ట పరిహారముగా ఇష్ట ప్రాప్తికై ఆచరించెడి శాంతి, పౌష్టిక కర్మలు.
ఈ కర్మలలో పితృదేవతల నారాధించెడి కర్మలను శ్రాద్ధములు అందురు. "శ్రద్ధయా అనేనేతి శ్రాద్ధమ్" - అనగా అత్యంత శ్రద్ధాభక్తులచే చేయ తగిన కర్మ అని అర్థము. దేవతా పూజలకంటే ఎక్కువ శ్రద్ధగాశుచిగా, మడిగా ఆచరించ దగినవి పితృకర్మలు. కారణమేమనగా దేవతా పూజలు భక్తులందరూ చేయుదురు - కానీ, మన పితరుల నుద్దేశించి చేయదగు కర్మలు మనమే చేయవలెను - ఇతరులు చేయరు.
కావున శ్రద్ధ అనెడిది శ్రాద్ధములందు అత్యావశ్యకము అయి ఉన్నది. ఈ శ్రాద్ధ కర్మలు బహువిధములుగా ఉన్నవి. ఉదా:- -నిత్యశ్రాద్ధము, షణ్ణవతి శ్రాద్ధములు, ప్రత్యాబ్దిక శ్రాద్ధములు, కామ్య శ్రాద్ధములు - నాందీ శ్రాద్ధములు - గ్రహణ శ్రాద్ధము నిత్యశ్రాద్ధమనగా నిత్యము ఒక బ్రాహ్మణునికి పితృదేవతారూపమున అర్చించి భోజనము పెట్టి తర్పణ చేయుట దీనిలో తిలలు, ప్రాచీనావీతము అపేక్షితములు గావు. బ్రహ్మచర్య అధశ్శయ్యాది నియమరహితమైనది...............
మున్నుడి శ్లో॥ కాండ ద్వయోప పాద్యాయ కర్మబ్రహ్మ స్వరూపిణే | స్వర్గాప వర్గ రూపాయ యజ్ఞేశాయ నమోనమః ॥ భక్త మహాశయులారా! మనది కర్మభూమి. ఈ కర్మ భూమిలో అనేక మంది సత్కర్మాచరణచే భగవదను గ్రహమును పొందిరి. అట్టి కర్మలు మూడు విధములుగా ఉన్నవి. 1.నిత్య, 2. నైమిత్తిక, 3. కామ్య కర్మలు. ఇందు నిత్య కర్మలనగా సంధ్యావందన, అగ్నిహోత్ర, వైశ్వదేవ, బ్రహ్మయజ్ఞ, అతిథి పూజాదులు. నైమిత్తికములు అనగా ఒక నిమిత్తమును గూర్చి చేయునవి. దర్శశ్రాద్ధాదులు, ప్రత్యాబ్దికములు, సంక్రాంతులు, వ్రతాదులు మున్నగునవి. ఇక కామ్య కర్మలనగా అనిష్ట పరిహారముగా ఇష్ట ప్రాప్తికై ఆచరించెడి శాంతి, పౌష్టిక కర్మలు. ఈ కర్మలలో పితృదేవతల నారాధించెడి కర్మలను శ్రాద్ధములు అందురు. "శ్రద్ధయా అనేనేతి శ్రాద్ధమ్" - అనగా అత్యంత శ్రద్ధాభక్తులచే చేయ తగిన కర్మ అని అర్థము. దేవతా పూజలకంటే ఎక్కువ శ్రద్ధగాశుచిగా, మడిగా ఆచరించ దగినవి పితృకర్మలు. కారణమేమనగా దేవతా పూజలు భక్తులందరూ చేయుదురు - కానీ, మన పితరుల నుద్దేశించి చేయదగు కర్మలు మనమే చేయవలెను - ఇతరులు చేయరు. కావున శ్రద్ధ అనెడిది శ్రాద్ధములందు అత్యావశ్యకము అయి ఉన్నది. ఈ శ్రాద్ధ కర్మలు బహువిధములుగా ఉన్నవి. ఉదా:- -నిత్యశ్రాద్ధము, షణ్ణవతి శ్రాద్ధములు, ప్రత్యాబ్దిక శ్రాద్ధములు, కామ్య శ్రాద్ధములు - నాందీ శ్రాద్ధములు - గ్రహణ శ్రాద్ధము నిత్యశ్రాద్ధమనగా నిత్యము ఒక బ్రాహ్మణునికి పితృదేవతారూపమున అర్చించి భోజనము పెట్టి తర్పణ చేయుట దీనిలో తిలలు, ప్రాచీనావీతము అపేక్షితములు గావు. బ్రహ్మచర్య అధశ్శయ్యాది నియమరహితమైనది...............© 2017,www.logili.com All Rights Reserved.