"మనుషులు మారాలి....... ప్రవర్తనా మారాలి.......కానీ మనుషులు, వారి ప్రవర్తన మారకపోతే అణచివేతకు గురవుతున్న వారి ఆశయాలు అలల్లా లేస్తాయ్....... వెక్కిరింతలు తుఫానులై కూర్చుంటాయ్." మనిషి చుట్టూ అలుముకున్నసమస్త మానవీయ నేపథ్య చిత్రం కథ. నేనెవరి కోసం రాస్తున్నాను. అన్న విషయంలోకి వస్తే నిత్యం దోపిడీకి గురయ్యే వారి కోసం, మూడనమ్మకాల వలలో చిక్కుకుని సర్వస్వాన్ని కోల్పోతున్న జనుల కోసం రాస్తూ ఉన్నాను. పీడిత జనాల కష్టాల కారకులెవరు అన్న విషయాల నేపథ్యాన్ని తెలిపి, తద్వారా వారిలో చైతన్యాన్ని పెంచేందుకే నేను కలం పట్టాను.
-బోయ జంగయ్య.
ఆర్థిక వ్యవస్థను అర్థవంతంగా అర్థం చేసుకున్నవాడు. వర్గ సమాజాన్ని ఎన్నో రాత్రులు పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు చదివినవాడు. మార్క్సిజాన్ని ఆచరణ పెట్టని అగ్రకుల రచయితలు, రచయితలు అనుకున్న వారిని ఆట కట్టించినవాడు. అంబేద్కర్ అడుగుజాడలు రుచి చూపిస్తూ కథన శిల్పాన్ని చేక్కినవాడు. ఇంకేమి కావాలి! భారత రాజ్యాంగాన్ని చదవని అజ్ఞానులున్న ఈ సమాజంలో జగడమై నవలికరించాడు. "రాజ్యాంగం ఒక రాచపుండు............స్వాతంత్ర్యమొక మేడి పండు" అన్న ఆనాటి విద్యార్థి నాయకులు ఇప్పుడిప్పుడు జంగయ్య లాంటి రచయితలను చదువుతూ చర్చ చేస్తున్నారు. దేశ ప్రజలకు హక్కులు పొందు పరిచిన రాజ్యంగ నిర్మాత నిత్య మానవుడవుతున్న వేళ 'జాతర, జగడం, పుట్టుమచ్చ, సొంత లాభం కొంత మానితే ఈ నవలల సారాంశం కుల స్పృహతో చూసారు కానీ కుల నిర్మూలన దృష్టి తో చూడని కవి, రచయితలు ఇతని సాహితీ సర్వస్వాన్ని చదివి మేల్కొనండి'.
-వేముల ఎల్లయ్య
"మనుషులు మారాలి....... ప్రవర్తనా మారాలి.......కానీ మనుషులు, వారి ప్రవర్తన మారకపోతే అణచివేతకు గురవుతున్న వారి ఆశయాలు అలల్లా లేస్తాయ్....... వెక్కిరింతలు తుఫానులై కూర్చుంటాయ్." మనిషి చుట్టూ అలుముకున్నసమస్త మానవీయ నేపథ్య చిత్రం కథ. నేనెవరి కోసం రాస్తున్నాను. అన్న విషయంలోకి వస్తే నిత్యం దోపిడీకి గురయ్యే వారి కోసం, మూడనమ్మకాల వలలో చిక్కుకుని సర్వస్వాన్ని కోల్పోతున్న జనుల కోసం రాస్తూ ఉన్నాను. పీడిత జనాల కష్టాల కారకులెవరు అన్న విషయాల నేపథ్యాన్ని తెలిపి, తద్వారా వారిలో చైతన్యాన్ని పెంచేందుకే నేను కలం పట్టాను. -బోయ జంగయ్య. ఆర్థిక వ్యవస్థను అర్థవంతంగా అర్థం చేసుకున్నవాడు. వర్గ సమాజాన్ని ఎన్నో రాత్రులు పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు చదివినవాడు. మార్క్సిజాన్ని ఆచరణ పెట్టని అగ్రకుల రచయితలు, రచయితలు అనుకున్న వారిని ఆట కట్టించినవాడు. అంబేద్కర్ అడుగుజాడలు రుచి చూపిస్తూ కథన శిల్పాన్ని చేక్కినవాడు. ఇంకేమి కావాలి! భారత రాజ్యాంగాన్ని చదవని అజ్ఞానులున్న ఈ సమాజంలో జగడమై నవలికరించాడు. "రాజ్యాంగం ఒక రాచపుండు............స్వాతంత్ర్యమొక మేడి పండు" అన్న ఆనాటి విద్యార్థి నాయకులు ఇప్పుడిప్పుడు జంగయ్య లాంటి రచయితలను చదువుతూ చర్చ చేస్తున్నారు. దేశ ప్రజలకు హక్కులు పొందు పరిచిన రాజ్యంగ నిర్మాత నిత్య మానవుడవుతున్న వేళ 'జాతర, జగడం, పుట్టుమచ్చ, సొంత లాభం కొంత మానితే ఈ నవలల సారాంశం కుల స్పృహతో చూసారు కానీ కుల నిర్మూలన దృష్టి తో చూడని కవి, రచయితలు ఇతని సాహితీ సర్వస్వాన్ని చదివి మేల్కొనండి'. -వేముల ఎల్లయ్య© 2017,www.logili.com All Rights Reserved.