ఎరుక
ఒకరి ప్రశ్న: ఎరుకకు మీరు చెప్పే అర్థం ఏమిటి? తరచు మీరు అంటూ ఉంటారు. మీ బోధన అంతా కూడా నిజంగా ఈ ఎరుకను గురించే అని. మీ
ప్రసంగాలను వినీ, మీ పుస్తకాలను చదివీ ఈ ఎరుకను అర్థం చేసుకోవాలని ప్రయత్నించాను కానీ అంత బాగా తెలిసింది అని చెప్పలేను. ఈ ఎరుక సాధన వల్ల వచ్చేది కాదు. ఏ రకమైన సాధనను కాని, పరిశ్రమను, పద్ధతిని, క్రమశిక్షణను కాని, దైనిక సూత్రాలను కాని ఎందుకు మీరు సుతరామూ ఆమోదించరో నేను అర్థం చేసుకున్నాను. దీని ప్రాధాన్యతను నేను చూడగలుగుతున్నాను. లేకపోతే ఇదంతా యాంత్రికంగా తయారవుతుంది. చివరకు మనసు మందకొడిగా, మూర్ఖంగా అయిపోతుంది. మీరు అనుమతిస్తే మీతో పాటుగ నేను ఈ ఎరుకగా ఉండటం అంటే ఏమిటి అనే ప్రశ్నను చివరంటా శోధించి చూడాలను కుంటున్నాను. ఈ మాటకు మీరు ఒక లోతైన విశాలమైన అర్థాన్ని ఇస్తున్నట్లుగా కనబడుతున్నది. అయితే మనమందరమూ కూడా జరుగుతున్న విషయాల ఎడల ఎప్పుడూ ఎరుకగా ఉన్నట్లే నాకు కనబడుతున్నది. నేను కోపంగా ఉన్నప్పుడు అది నాకు తెలుస్తుంది. విచారంగా ఉన్నప్పుడు తెలుస్తుంది. సంతోషంగా ఉన్నప్పుడూ నాకు తెలుస్తుంది.
కృష్ణమూర్తి : కోపము, విచారము, సంతోషము గురించి నిజంగా మనకు ఎరుక ఉన్నదా అని నా సందేహం. అవి అన్నీ జరిగిపోయాకే వాటి గురించిన ఎరుక, స్పృహ మనలో కలుగుతున్నాయా? వాటన్నింటిని...................
ఎరుక ఒకరి ప్రశ్న: ఎరుకకు మీరు చెప్పే అర్థం ఏమిటి? తరచు మీరు అంటూ ఉంటారు. మీ బోధన అంతా కూడా నిజంగా ఈ ఎరుకను గురించే అని. మీ ప్రసంగాలను వినీ, మీ పుస్తకాలను చదివీ ఈ ఎరుకను అర్థం చేసుకోవాలని ప్రయత్నించాను కానీ అంత బాగా తెలిసింది అని చెప్పలేను. ఈ ఎరుక సాధన వల్ల వచ్చేది కాదు. ఏ రకమైన సాధనను కాని, పరిశ్రమను, పద్ధతిని, క్రమశిక్షణను కాని, దైనిక సూత్రాలను కాని ఎందుకు మీరు సుతరామూ ఆమోదించరో నేను అర్థం చేసుకున్నాను. దీని ప్రాధాన్యతను నేను చూడగలుగుతున్నాను. లేకపోతే ఇదంతా యాంత్రికంగా తయారవుతుంది. చివరకు మనసు మందకొడిగా, మూర్ఖంగా అయిపోతుంది. మీరు అనుమతిస్తే మీతో పాటుగ నేను ఈ ఎరుకగా ఉండటం అంటే ఏమిటి అనే ప్రశ్నను చివరంటా శోధించి చూడాలను కుంటున్నాను. ఈ మాటకు మీరు ఒక లోతైన విశాలమైన అర్థాన్ని ఇస్తున్నట్లుగా కనబడుతున్నది. అయితే మనమందరమూ కూడా జరుగుతున్న విషయాల ఎడల ఎప్పుడూ ఎరుకగా ఉన్నట్లే నాకు కనబడుతున్నది. నేను కోపంగా ఉన్నప్పుడు అది నాకు తెలుస్తుంది. విచారంగా ఉన్నప్పుడు తెలుస్తుంది. సంతోషంగా ఉన్నప్పుడూ నాకు తెలుస్తుంది. కృష్ణమూర్తి : కోపము, విచారము, సంతోషము గురించి నిజంగా మనకు ఎరుక ఉన్నదా అని నా సందేహం. అవి అన్నీ జరిగిపోయాకే వాటి గురించిన ఎరుక, స్పృహ మనలో కలుగుతున్నాయా? వాటన్నింటిని...................© 2017,www.logili.com All Rights Reserved.