భారతదేశంలో కుల వ్యవస్థ వేళ్ళూనికుని ఉన్నది. ముఖ్యంగా కొన్ని కులాలు, ఆర్ధికంగా, రాజకీయంగా బలపడి "అగ్రకులాలు" గా పరిగణింపబడుతూ ఉన్నాయి. అగ్రకులాల లాగానే కొన్ని అణగారిన కులాలు ఉన్నాయి. ఈ కులాలవారిని దళితులనీ, నిమ్నజాతుల వారనీ, వెనుకబడిన కులాల వారనీ పిలవటం కద్దు. ఈ కులాల యుగయుగాలుగా పేదరికంలో మ్రగ్గుతూ, జీవనం కోసం నిత్యం పోరాటం చేస్తూ వస్తూ ఉన్నాయి. అగ్రకులాల కుల అహంకారానికి ఎన్నో కష్టనష్టాలు పడుతూ వస్తూ ఉన్నాయి.
అటువంటి దళిత కుటుంబంలో జన్మించి, అంచెలంచెలుగా అత్యున్నత స్థానానికి చేరుకున్న వారు చరిత్రలో బహు కొద్దిమంది మాత్రమే కనిపిస్తారు. అటువంటి వారిలో పేరు పొందినవారు "బాబూ జగజ్జీవన్ రాం" గారు. భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొని, దేశస్వాతంత్రం కోసం పాటు పడ్డారు. ప్రజానాయకుడిగా పేరు పొందారు. సుదీర్ఘ కాలం పార్లమెంటు సభ్యులుగా ఉన్నవారు ఎన్నో పదవులు అధిష్టించినారు. పీడిత, తాడిత ప్రజలకు ఆశాజ్యోతిగా పేరు పొందారు. రాజనీతిజ్ఞుడు, పరిపాలనాదక్షుడు. ప్రజలచేత ఆప్యాయంగా "బాబూజీ" అని పిలిపించుకున్నవారు. ఆ మహనీయుని గురించి బాలలూ, యువకులు తెలుసుకోవటం ఎంతో ముఖ్యం.
భారతదేశంలో కుల వ్యవస్థ వేళ్ళూనికుని ఉన్నది. ముఖ్యంగా కొన్ని కులాలు, ఆర్ధికంగా, రాజకీయంగా బలపడి "అగ్రకులాలు" గా పరిగణింపబడుతూ ఉన్నాయి. అగ్రకులాల లాగానే కొన్ని అణగారిన కులాలు ఉన్నాయి. ఈ కులాలవారిని దళితులనీ, నిమ్నజాతుల వారనీ, వెనుకబడిన కులాల వారనీ పిలవటం కద్దు. ఈ కులాల యుగయుగాలుగా పేదరికంలో మ్రగ్గుతూ, జీవనం కోసం నిత్యం పోరాటం చేస్తూ వస్తూ ఉన్నాయి. అగ్రకులాల కుల అహంకారానికి ఎన్నో కష్టనష్టాలు పడుతూ వస్తూ ఉన్నాయి. అటువంటి దళిత కుటుంబంలో జన్మించి, అంచెలంచెలుగా అత్యున్నత స్థానానికి చేరుకున్న వారు చరిత్రలో బహు కొద్దిమంది మాత్రమే కనిపిస్తారు. అటువంటి వారిలో పేరు పొందినవారు "బాబూ జగజ్జీవన్ రాం" గారు. భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొని, దేశస్వాతంత్రం కోసం పాటు పడ్డారు. ప్రజానాయకుడిగా పేరు పొందారు. సుదీర్ఘ కాలం పార్లమెంటు సభ్యులుగా ఉన్నవారు ఎన్నో పదవులు అధిష్టించినారు. పీడిత, తాడిత ప్రజలకు ఆశాజ్యోతిగా పేరు పొందారు. రాజనీతిజ్ఞుడు, పరిపాలనాదక్షుడు. ప్రజలచేత ఆప్యాయంగా "బాబూజీ" అని పిలిపించుకున్నవారు. ఆ మహనీయుని గురించి బాలలూ, యువకులు తెలుసుకోవటం ఎంతో ముఖ్యం.© 2017,www.logili.com All Rights Reserved.