బిరుదురాజు రామరాజు (1925-2012) : దాక్షిణాత్య భారతీయ విశ్వవిద్యాలయాలలో జానపద సాహిత్యాన్ని అధ్యయనాంశంగానూ, పరిశోధన సమర్థంగానూ తొలిసారి సుప్రతిష్ఠితం చేసిన పథ ప్రవర్తకుడు శ్రీ బిరుదురాజు రామరాజు. ఒక జాతి, ఒక భాష, ఒక సంస్కృతి, ఒక పురావారసత్వం, జానపద సాహిత్య అధ్యయన, అధ్యాపనలు లేకుండా సమగ్రంగా తెలుసుకోలేమని ఒక సంప్రదాయాన్ని నెలకొల్పినవాడాయన. దక్షిణ భారతదేశంలో జానపద సాహిత్య పరిశోధన, ముఖ్యంగా తెలుగులో వారి కృషితోనే రహదారి రూపం సంతరించుకోవటమేకాక, రాజమార్గమూ అయింది అది. సంస్కృత విద్యల్లోకం ఇదివరలో విని ఉండని చాలా కావ్యాలను, నాటకాలను శ్రీరామరాజు వెలుగులోకి తెచ్చారు. వీరు. వెలువరించిన 'ఆంధ్రయోగులు' అనే 7 సంపుటాల బృహదంథం అపురూపమైనది భారత ప్రభుత్వ అత్యున్నత విద్యారంగ పురస్కారమైన 'నేషనల్ ప్రొఫెసర్' గుర్తింపు వీరు పొందారు.
అక్కిరాజు రమాపతిరావు : కథా, నవలా, జీవితచరిత్ర రచయితగా, అనువాదకుడిగా, పరిశోధకుడిగా సమకాలీన తెలుగు సాహిత్యలోకానికి చిరపరిచితులు. తన 20వ ఏట తెలుగు సాహిత్యంలో ప్రవేశించిన రమాపతిరావు, ఈ 60 ఏళ్లలో 10 నవలలు, 6 కథాసంకలనాలు, 30 జీవితచరిత్రలు, సమాజ, సాహిత్య రీతుల అధ్యయనాలకు సంబంధించి 10 గ్రంథాలు ఇప్పటికి వెలువరించారు. కందుకూరి వీరేశలింగం గూర్చి పిహెచ్.డి. చేసినందుకు, ఆయా గ్రంథాలు వ్యాఖ్యాసహితంగా ప్రకటింపచేసినందుకూ, వీరేశలింగం డైరీలు - లేఖలు పుస్తకంగా వెలువరించినందుకు, వీరు ఇప్పటి తెలుగు సాహిత్యంలో సముచితమైన గుర్తింపు పొందారు.