రాజమహేంద్రిలో ప్రముఖ కవి నాళం కృష్ణారావు గారి కుమార్తెగా జన్మించి బాపట్లలో శ్రీ ఊటుకూరి హయగ్రీక గుప్తగారి అర్ధాంగియై ఆంధ్రసరస్వతి, అపర వాగ్దేవి, కళాప్రపూర్ణగా కీర్తిగాంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వాతంత్ర్య సమరయోధురాలు, సామజిక సేవ తత్పరురాలు , సంగీతజ్ఞారాలు, అనేక విశిష్ట ప్రతిభా పురస్కారాల గ్రహీత. "అఖిల భారత కవయిత్రులు", "ఆంధ్ర కవయిత్రులు" గ్రంథ రచనతో ఎనలేని కీర్తి గడించారు. సంస్కృతంలో ఛందోబద్ధమైన మూడు కావ్యాలతో బాటు తెలుగులో పద్యం, గద్యం, గేయం, వ్యంగ్యం, కథ, అనువాదం, రూపకం ప్రక్రియల్లో దాదాపు 36 రచనలు వెలయించారు . ఆధునిక సాహిత్య చరిత్రలో కనకాభిషేకం పొందిన ఏకైక రచయిత్రి, అహింసావాదిగా, వాజ్మిగా, "సాహితిరుద్రమ" గా చిరస్మరణీయురాలు.