సామల సదాశివది తెలుగు సాహిత్యంలో శిఖరసన్నిభమైన వ్యక్తిత్వం. తమ బహుముఖీన పరిజ్ఞానంతో పాతతరాన్ని, కొత్తతరాన్ని ప్రభావితం చేసిన సదాశివ, ఆత్మ గౌరవ ప్రతీకగా రూపొందినారు. తెలుగులో పద్యకవిత్వంతో వారి సాహిత్య జీవితం ప్రారంభమైంది. తర్వాత వారు ఉర్దూ, ఫారసీ సాహిత్యాల మీద దృష్టిని కేంద్రీకరించి ముఖ్యమైన గ్రంథాలను అనువదించారు. 'మీర్జాగాలిబ్ జీవితం - సాహిత్యం , 'ఉర్దూకవుల కవితా సామగ్రి', 'ఫారసీ కవుల ప్రసక్తి' - వంటి మౌలిక గ్రంథాలను రచించి సాహిత్య పరిధిని విస్తృతపరిచారు.
హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం గూర్చి, అగ్రశ్రేణి గాయికా - గాయకులను గూర్చి, వాద్య నిపుణులను గూర్చి సదాశివ 'మలయ మారుతాలు', 'సంగీత శిఖరాలు', 'స్వరలయలు' అనే గ్రంథాలను రచించి తెలుగు సాహిత్య చరిత్రకు ఒక అమూల్యమైన అధ్యాయాన్ని జోడించారు. వీటిలో 'స్వరలయలు గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2011) లభించింది. వీరి 'యాది' అనే గ్రంథం భాషా, సాహిత్య, సాంస్కృతిక, సంగీత అంశాలతో కూడిన వారి జీవిత చరిత్ర, “సామల సదాశివ' అనే ఈ గ్రంథంలో ఒక గొప్ప రచయిత జాతీయ వ్యక్తిత్వం ప్రతిఫలించింది.
ప్రొఫెసర్ జి. చెన్నకేశవరెడ్డి
ఈ గ్రంథ రచయిత ఆచార్య జి. చెన్నకేశవరెడ్డి తెలుగు అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్ గాను, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్-కం-డైరెక్టర్ గాను పనిచేశారు. నిఘంటువులకు, విజ్ఞాన సర్వస్వాలకు సంపాదకుడిగా వ్యవహరించారు. 'తెలుగు' అనే మాసపత్రికకు సంపాదకత్వం వహించారు. తెలుగు విజ్ఞాన సర్వస్వ కేంద్రం డైరెక్టర్‌గా కూడా విధులు నిర్వహించారు. చెన్నకేశవరెడ్డి రచించిన 'పరంపర' అన్న గ్రంథం ఎందరో సాహితీమూర్తుల జీవిత చిత్రణల సంపుటి. ఈ అనుభవంతో సాహిత్య వ్యక్తిత్వాల రచనలో వారు సాధికారతను సాధించారు. 'ఆధునికాంధ్రగేయకవిత్వం' అన్న అంశం మీద మౌలిక పరిశోధన చేసి 1979లో డాక్టరేట్ పొందారు. కవులుగాను, సాహిత్య విమర్శకులుగాను, పరిశోధకులుగాను పేరెన్నికగన్న రచయిత. అన్నిటికీ మించి సామల సదాశివ అభిమానులు, సంగీత ప్రియులు.
డా॥ సామల సదాశివ సామల సదాశివది తెలుగు సాహిత్యంలో శిఖరసన్నిభమైన వ్యక్తిత్వం. తమ బహుముఖీన పరిజ్ఞానంతో పాతతరాన్ని, కొత్తతరాన్ని ప్రభావితం చేసిన సదాశివ, ఆత్మ గౌరవ ప్రతీకగా రూపొందినారు. తెలుగులో పద్యకవిత్వంతో వారి సాహిత్య జీవితం ప్రారంభమైంది. తర్వాత వారు ఉర్దూ, ఫారసీ సాహిత్యాల మీద దృష్టిని కేంద్రీకరించి ముఖ్యమైన గ్రంథాలను అనువదించారు. 'మీర్జాగాలిబ్ జీవితం - సాహిత్యం , 'ఉర్దూకవుల కవితా సామగ్రి', 'ఫారసీ కవుల ప్రసక్తి' - వంటి మౌలిక గ్రంథాలను రచించి సాహిత్య పరిధిని విస్తృతపరిచారు.
హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం గూర్చి, అగ్రశ్రేణి గాయికా - గాయకులను గూర్చి, వాద్య నిపుణులను గూర్చి సదాశివ 'మలయ మారుతాలు', 'సంగీత శిఖరాలు', 'స్వరలయలు' అనే గ్రంథాలను రచించి తెలుగు సాహిత్య చరిత్రకు ఒక అమూల్యమైన అధ్యాయాన్ని జోడించారు. వీటిలో 'స్వరలయలు గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం (2011) లభించింది. వీరి 'యాది' అనే గ్రంథం భాషా, సాహిత్య, సాంస్కృతిక, సంగీత అంశాలతో కూడిన వారి జీవిత చరిత్ర, “సామల సదాశివ' అనే ఈ గ్రంథంలో ఒక గొప్ప రచయిత జాతీయ వ్యక్తిత్వం ప్రతిఫలించింది.
ప్రొఫెసర్ జి. చెన్నకేశవరెడ్డి ఈ గ్రంథ రచయిత ఆచార్య జి. చెన్నకేశవరెడ్డి తెలుగు అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్ గాను, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్-కం-డైరెక్టర్ గాను పనిచేశారు. నిఘంటువులకు, విజ్ఞాన సర్వస్వాలకు సంపాదకుడిగా వ్యవహరించారు. 'తెలుగు' అనే మాసపత్రికకు సంపాదకత్వం వహించారు. తెలుగు విజ్ఞాన సర్వస్వ కేంద్రం డైరెక్టర్‌గా కూడా విధులు నిర్వహించారు. చెన్నకేశవరెడ్డి రచించిన 'పరంపర' అన్న గ్రంథం ఎందరో సాహితీమూర్తుల జీవిత చిత్రణల సంపుటి. ఈ అనుభవంతో సాహిత్య వ్యక్తిత్వాల రచనలో వారు సాధికారతను సాధించారు. 'ఆధునికాంధ్రగేయకవిత్వం' అన్న అంశం మీద మౌలిక పరిశోధన చేసి 1979లో డాక్టరేట్ పొందారు. కవులుగాను, సాహిత్య విమర్శకులుగాను, పరిశోధకులుగాను పేరెన్నికగన్న రచయిత. అన్నిటికీ మించి సామల సదాశివ అభిమానులు, సంగీత ప్రియులు.