నేను ఒక పాలేరు కుటుంబం నుండి వచ్చినవాణ్ణి. మట్టి మనుషుల నుండి మరమనుషుల వరకు ఎరిగినవాణ్ని. దొర, భూస్వాముల, పెట్టుబడిదారుల పథఘట్టాల క్రింద పడిలేసినవాణ్ని. లాఠీలు, తూటాలు, జైలుగోడలు చవిచూచినవాణ్ని. ఆరోగ్యం, అనారోగ్యం చావు అంచులవరకు వెళ్లి వచ్చినవాణ్ణి. బుద్ధ, పూలే, అంబేద్కర్, సావిత్రిభా జీవితాలను, మనకాలపు పిల్లలకు పాటై వినిపిస్తున్న వాణ్ని. పుడమితల్లి లేలేత సుగంధాలని పూసుకొని విత్తనమై మొలకెత్తుతున్న రేపటి వసంతాన్ని. మీ అందరి హృదయాల్లో నిలిచిపోయే ఓ జ్ఞాపకాన్ని...
- జయరాజు
ఒక చరిత్రకి, ఒక జీవిత గమనానికి, వెన్నెల లోకాలలో వింజామరల గాలికి, మీ గొంతులో కదిలే అమృతానురాగాల బురగాలకి, దాంట్లోంచి ప్రాణం పోసుకొనే రాగాన్ని అలుమక తిరిగే గిరికీల లోకాలకు, ఎక్కడా ఆది లేదు, అంతం లేదు. కులం, మతంలో, ప్రాంతంలో, దేశంలో ఈ పొలిమేరలను జయించిన అమృత గాయకులారా! నీళ్ళలో చేపల్లా ప్రజల్లోని లోకాల వెలుగులు మీరు. ఆ వెలుగుల్లో నిండా మునిగి స్నానం చేసి తరించడమే తరువాయి అది తప్పించి మరో ఆలోచన మెదడుకు రాదు. ఈ జీవితం ధన్యం.
- నరసింగరావు
నేను ఒక పాలేరు కుటుంబం నుండి వచ్చినవాణ్ణి. మట్టి మనుషుల నుండి మరమనుషుల వరకు ఎరిగినవాణ్ని. దొర, భూస్వాముల, పెట్టుబడిదారుల పథఘట్టాల క్రింద పడిలేసినవాణ్ని. లాఠీలు, తూటాలు, జైలుగోడలు చవిచూచినవాణ్ని. ఆరోగ్యం, అనారోగ్యం చావు అంచులవరకు వెళ్లి వచ్చినవాణ్ణి. బుద్ధ, పూలే, అంబేద్కర్, సావిత్రిభా జీవితాలను, మనకాలపు పిల్లలకు పాటై వినిపిస్తున్న వాణ్ని. పుడమితల్లి లేలేత సుగంధాలని పూసుకొని విత్తనమై మొలకెత్తుతున్న రేపటి వసంతాన్ని. మీ అందరి హృదయాల్లో నిలిచిపోయే ఓ జ్ఞాపకాన్ని... - జయరాజు ఒక చరిత్రకి, ఒక జీవిత గమనానికి, వెన్నెల లోకాలలో వింజామరల గాలికి, మీ గొంతులో కదిలే అమృతానురాగాల బురగాలకి, దాంట్లోంచి ప్రాణం పోసుకొనే రాగాన్ని అలుమక తిరిగే గిరికీల లోకాలకు, ఎక్కడా ఆది లేదు, అంతం లేదు. కులం, మతంలో, ప్రాంతంలో, దేశంలో ఈ పొలిమేరలను జయించిన అమృత గాయకులారా! నీళ్ళలో చేపల్లా ప్రజల్లోని లోకాల వెలుగులు మీరు. ఆ వెలుగుల్లో నిండా మునిగి స్నానం చేసి తరించడమే తరువాయి అది తప్పించి మరో ఆలోచన మెదడుకు రాదు. ఈ జీవితం ధన్యం. - నరసింగరావు© 2017,www.logili.com All Rights Reserved.