జ్ఞాపకాలనేవి కేవలం వ్యక్తిగతమైనవే అయితే వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అలా కాకుండా సుబ్బలక్ష్మి గారి జ్ఞాపకాలు ఆనాటి సాహిత్యానికి సంబంధించిన అనేక విషయాలే కావడం వల్ల పందొమ్మిదివందల యాభైలోనూ, అరవైలోనూ తెలుగు సాహితీ ప్రపంచానికి చెందిన ఎందరో ప్రముఖుల ప్రస్తావన ఆమె జ్ఞాపకాల్లో పదే పదే వస్తుంటుంది. ఆమె మన ముందుంచిన ఈ జ్ఞాపకాలను చదువుతుంటే ఆమె మన పక్కన కూర్చొని మనతో ముచ్చటిస్తున్నట్టుగానే ఉంటుంది. 50 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నో ఉదాంతాలను నిన్నమొన్ననే జరిగినట్టుగా చెప్పిన సుబ్బలక్ష్మి గారి జ్ఞాపకశక్తికి జోహార్లు... సాహిత్యాభిమానులందరికీ ఎంతో ప్రయోజనకరమైన ఈ జ్ఞాపకాల్ని రచించిన సుబ్బలక్ష్మి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
- అంపశయ్య నవీన్
జ్ఞాపకాలనేవి కేవలం వ్యక్తిగతమైనవే అయితే వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అలా కాకుండా సుబ్బలక్ష్మి గారి జ్ఞాపకాలు ఆనాటి సాహిత్యానికి సంబంధించిన అనేక విషయాలే కావడం వల్ల పందొమ్మిదివందల యాభైలోనూ, అరవైలోనూ తెలుగు సాహితీ ప్రపంచానికి చెందిన ఎందరో ప్రముఖుల ప్రస్తావన ఆమె జ్ఞాపకాల్లో పదే పదే వస్తుంటుంది. ఆమె మన ముందుంచిన ఈ జ్ఞాపకాలను చదువుతుంటే ఆమె మన పక్కన కూర్చొని మనతో ముచ్చటిస్తున్నట్టుగానే ఉంటుంది. 50 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నో ఉదాంతాలను నిన్నమొన్ననే జరిగినట్టుగా చెప్పిన సుబ్బలక్ష్మి గారి జ్ఞాపకశక్తికి జోహార్లు... సాహిత్యాభిమానులందరికీ ఎంతో ప్రయోజనకరమైన ఈ జ్ఞాపకాల్ని రచించిన సుబ్బలక్ష్మి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. - అంపశయ్య నవీన్© 2017,www.logili.com All Rights Reserved.