ప్రవేశిక
"ఎన్నో కలల్ని పద్యాల నౌకల్లో తెచ్చి
మీ తీరాలకు చేర్చాను
నా వాక్యాలు
తీగెలుగా బిగించి
నన్ను వాద్యాన్ని చేసుకున్నాను
నన్నొక రేవు చేరనీండి
నా స్వర్గాలన్నీ ఇక్కడే కుమ్మరిస్తా”(శేషేంద్ర చమత్కారికలు, 121).
సృజనశక్తి, విమర్శనశక్తి, పరిశోధనశక్తి ఒకే వ్యక్తిలో ఉండడం చాలా అరుదు. లోకంలో రంగులన్నీ మింగి పక్షిలా ఎగిరిపోయిన విశిష్ట కవి శేషేంద్రశర్మ. ప్రతిభ, పాండిత్యం, అభ్యాసం కావ్యసృష్టికి అవసరమన్న ఆలోచనని అక్షరాలా నిజం చేసిన అసాధారణ సాహితీవేత్త గుంటూరు శేషేంద్ర శర్మ.
బహుముఖ ప్రజ్ఞావంతులు కొందరుంటారు. వారి జ్ఞానార్జనకి ఎల్లలుండవు. 'అష్టాధ్యాయి'ని రచించిన పాణిని ప్రఖ్యాత వ్యాకరణవేత్త మాత్రమే కాదు, గొప్ప గణితశాస్త్రజ్ఞుడు కూడా. నన్నయ మహాకవి మాత్రమే కాదు, విపులశబ్దశాసనుడు, నానా పురాణ విజ్ఞాననిరతుడు, లోకజ్ఞుడు. కేతన ఒక కథాకావ్యాన్ని 'దశకుమార చరిత్రము') ఒక ధర్మశాస్త్రగంథాన్ని ('విజ్ఞానేశ్వరము'), ఒక వ్యాకరణాన్ని ('ఆంధ్రభాషాభూషణము') రచించిన బహుముఖ ప్రజ్ఞావంతుడు. భట్టుమూర్తి, రంగాజమ్మ మొదలైనవారంతా తమ వ్యక్తిత్వాన్ని బహుముఖాలుగా విస్తరింపజేసుకున్నారు..............
ప్రవేశిక "ఎన్నో కలల్ని పద్యాల నౌకల్లో తెచ్చి మీ తీరాలకు చేర్చాను నా వాక్యాలు తీగెలుగా బిగించి నన్ను వాద్యాన్ని చేసుకున్నాను నన్నొక రేవు చేరనీండి నా స్వర్గాలన్నీ ఇక్కడే కుమ్మరిస్తా”(శేషేంద్ర చమత్కారికలు, 121). సృజనశక్తి, విమర్శనశక్తి, పరిశోధనశక్తి ఒకే వ్యక్తిలో ఉండడం చాలా అరుదు. లోకంలో రంగులన్నీ మింగి పక్షిలా ఎగిరిపోయిన విశిష్ట కవి శేషేంద్రశర్మ. ప్రతిభ, పాండిత్యం, అభ్యాసం కావ్యసృష్టికి అవసరమన్న ఆలోచనని అక్షరాలా నిజం చేసిన అసాధారణ సాహితీవేత్త గుంటూరు శేషేంద్ర శర్మ. బహుముఖ ప్రజ్ఞావంతులు కొందరుంటారు. వారి జ్ఞానార్జనకి ఎల్లలుండవు. 'అష్టాధ్యాయి'ని రచించిన పాణిని ప్రఖ్యాత వ్యాకరణవేత్త మాత్రమే కాదు, గొప్ప గణితశాస్త్రజ్ఞుడు కూడా. నన్నయ మహాకవి మాత్రమే కాదు, విపులశబ్దశాసనుడు, నానా పురాణ విజ్ఞాననిరతుడు, లోకజ్ఞుడు. కేతన ఒక కథాకావ్యాన్ని 'దశకుమార చరిత్రము') ఒక ధర్మశాస్త్రగంథాన్ని ('విజ్ఞానేశ్వరము'), ఒక వ్యాకరణాన్ని ('ఆంధ్రభాషాభూషణము') రచించిన బహుముఖ ప్రజ్ఞావంతుడు. భట్టుమూర్తి, రంగాజమ్మ మొదలైనవారంతా తమ వ్యక్తిత్వాన్ని బహుముఖాలుగా విస్తరింపజేసుకున్నారు..............© 2017,www.logili.com All Rights Reserved.