మహాత్ముడి పెద్ద కొడుకు జీవిత కధ
హరిలాల్ గాంధీ మహాత్మాగాంధీ, కస్తుర్బా గాంధీల పెద్ద కొడుకు. అతడి జీవితం గురించి మనకు తెలిసింది చాలా స్వల్పం. నిఘూడంగాను, ఆకర్షణీయంగాను ఉండే ఆ వ్యక్తిత్వం ఈ మధ్యకాలంలో ఎన్నో ఉహగానాలకు కేంద్రబిందువయింది. ఈ పరిస్థితుల్లో హరిలాల్ గాంధీ జీవితం పైన చందూలాల్ భాగుభాయి దలాల్ రాసిన ఈ జీవిత కధ ఒక్కటే మనకు లభ్యంగా ఉన్న పూర్తి స్థాయి జీవితచిత్రణ. గాంధేయ వాజ్మయంలో ఒక మైలురాయిగా చెప్పదగ్గ రచన. చుట్టూ అల్లుకున్న అనేక అపోహలనుంచి, ఉహాగానాల నుంచీ, నీడలనుంచి తప్పించి ఒక జీవిత వాస్తవాన్ని ఉన్నదున్నట్టుగా ప్రతిపాదించడానికి పూనుకున్న ప్రయత్నం.
గుజరాతీలో రాసిన ఈ రచనను త్రిదీప్ సుహృద్ ఇంగ్లీషు లోకి అనువదించడం కేవలం అనువాదానికే పరిమితమైన విషయం కాదు. హరిలాల్ గాంధీ జీవితాన్ని చందూలాల్ దలాల్ గుదిగుచ్చిన క్రమంతో పాటు, త్రిదీప్ సుహృద్ కూడా ఇంతదాకా ముద్రితంకాని ఉత్తరాలనుంచీ, వివిధ రచనలనుంచి ఎంతో సమాచారం సేకరించి మనకందించారు. త్రిదీప్ సుహృద్ సేకరించిన సమాచారం, చందూలాల్ రాసిన జీవితకధ - ఇవి రెండు కలిపి ఇంతదాకా మనకు హరిలాల్ గాంధీ మీద లభ్యమైన అత్యంత సమగ్ర సమాచారం.
ప్రముఖ రచయిత, అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత వాడ్రేవు చినవీరభద్రుడు ఈ రచనను ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనువదించారు.
ఈ రచన ఆమూలాగ్రం చదివినవారికి ఇది కేవలం తండ్రికొడుకుల మధ్య సంభవించిన సంఘర్షణగా మాత్రమేకాక, దాన్ని దాటి ఆ రెండు వ్యక్తిత్వాల్ని గాడంగా కలిపి ఉంచిన నిగూడ రహస్యంగా కూడా అర్ధమవుతుంది.
మహాత్ముడి పెద్ద కొడుకు జీవిత కధ హరిలాల్ గాంధీ మహాత్మాగాంధీ, కస్తుర్బా గాంధీల పెద్ద కొడుకు. అతడి జీవితం గురించి మనకు తెలిసింది చాలా స్వల్పం. నిఘూడంగాను, ఆకర్షణీయంగాను ఉండే ఆ వ్యక్తిత్వం ఈ మధ్యకాలంలో ఎన్నో ఉహగానాలకు కేంద్రబిందువయింది. ఈ పరిస్థితుల్లో హరిలాల్ గాంధీ జీవితం పైన చందూలాల్ భాగుభాయి దలాల్ రాసిన ఈ జీవిత కధ ఒక్కటే మనకు లభ్యంగా ఉన్న పూర్తి స్థాయి జీవితచిత్రణ. గాంధేయ వాజ్మయంలో ఒక మైలురాయిగా చెప్పదగ్గ రచన. చుట్టూ అల్లుకున్న అనేక అపోహలనుంచి, ఉహాగానాల నుంచీ, నీడలనుంచి తప్పించి ఒక జీవిత వాస్తవాన్ని ఉన్నదున్నట్టుగా ప్రతిపాదించడానికి పూనుకున్న ప్రయత్నం. గుజరాతీలో రాసిన ఈ రచనను త్రిదీప్ సుహృద్ ఇంగ్లీషు లోకి అనువదించడం కేవలం అనువాదానికే పరిమితమైన విషయం కాదు. హరిలాల్ గాంధీ జీవితాన్ని చందూలాల్ దలాల్ గుదిగుచ్చిన క్రమంతో పాటు, త్రిదీప్ సుహృద్ కూడా ఇంతదాకా ముద్రితంకాని ఉత్తరాలనుంచీ, వివిధ రచనలనుంచి ఎంతో సమాచారం సేకరించి మనకందించారు. త్రిదీప్ సుహృద్ సేకరించిన సమాచారం, చందూలాల్ రాసిన జీవితకధ - ఇవి రెండు కలిపి ఇంతదాకా మనకు హరిలాల్ గాంధీ మీద లభ్యమైన అత్యంత సమగ్ర సమాచారం. ప్రముఖ రచయిత, అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత వాడ్రేవు చినవీరభద్రుడు ఈ రచనను ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనువదించారు. ఈ రచన ఆమూలాగ్రం చదివినవారికి ఇది కేవలం తండ్రికొడుకుల మధ్య సంభవించిన సంఘర్షణగా మాత్రమేకాక, దాన్ని దాటి ఆ రెండు వ్యక్తిత్వాల్ని గాడంగా కలిపి ఉంచిన నిగూడ రహస్యంగా కూడా అర్ధమవుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.