జాతిపిత పూజ్య బాపూజీ మన భారతదేశానికే కాక, యావత్ప్రపంచానికీ శాంతి, అహింసల వెలుగుబాట చూపిన యుగపురుషుడు. స్వాతంత్య్ర సంగ్రామంలో రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యాన్ని అహింసాత్మకమైన పోరాటంతో కదిలించివేసి, దీక్షగా భారతీయులందరినీ ఒక త్రాటిపైన నడిపి విదేశీయుల కబంధహస్తాలనుండి మాతృదేశాన్ని విడిపించిన మహానాయకుడు, మహామనీషి. ఆ మహనీయుని జీవితానికి సంబంధించిన గుజరాతీ నవల ‘ప్రకాశనో పర్ఛాయో’ ను తెలుగు అనువాదమే ఈ మహాత్మునికి గాంధీకి మధ్య.
చరిత్రలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మహాపురుషులు ప్రజానీకానికీ, విశ్వమానవాళికీ తమ జీవితాన్ని ధారపోసినా, ఇతరులపై వారు చూపిన ఆర్తి, కరుణ తమ కుటుంబసభ్యుల పట్ల చూపించలేక పోవచ్చు. బాపూజీకి తన సిద్ధాంతాలపైన, ఆదర్శాలపట్ల కల పట్టుదల కారణంగా ఆయన పెద్దకుమారుడు హరిలాల్ జీవితం ఆయన ప్రబోధించిన మార్గానికి భిన్నంగా మరో దిశగా పయనించింది. లోకకల్యాణ ధ్యాసలో బయటి ప్రపంచంతో లీనమై గాంధీజీ పూర్తిగా దేశసేవకు అంకితమైపోయి వుండగా, ఆయన తన విషయంలో నిర్లక్ష్యం చేసినట్లుగా హరిలాల్ తపన చెందాడు. ఇందులో తప్పెవరిదన్న ప్రశ్నకు సమాధానం అన్వేషించడం కష్టం. మహాత్ముడికీ, ఆయన జ్యేష్ఠపుత్రుడు హరిలాల్ గాంధీకి మధ్య ఏర్పడిన దృక్పథవిభేదం దృష్ట్యా న్యాయనిర్ణయాన్ని విజ్ఞులైన పాఠకుల సదసద్వివేకానికే విడిచిపెట్టడం సముచితం.
ప్రసిద్ధ గుజరాతీ రచయిత శ్రీ దినకర్ జోషీగారు గాంధీజీ జీవితానికీ, ఆయన కుటుంబానికీ సంబంధించిన ఎన్నో వాస్తవిక అంశాలను కష్టపడి సేకరించి హరిలాల్ ముఖ్యపాత్రగా ఈ నవలను రూపొందించారు. ఈ నవల ‘గాంధీ విరుద్ధ్ గాంధీ’ పేరుతో నాటకరూపం ఇవ్వబడి గుజరాతీ లోనూ, మరాఠీలోనూ, హిందీలోనూ కొన్ని వందలసార్లు ప్రదర్శించబడి ప్రజాదరణ పొందింది. ఈ నాటకరూపం కన్నడంలోకి కూడా అనువదింపబడింది. ఇదే నాటకాన్ని ఆంగ్లంలో ‘మహాత్మా వెర్సస్ గాంధీ’ అనే పేరుతో అమెరికా మొదలైన దేశాలలో ప్రదర్శించిన తరువాత ఇది అంతర్జాతీయస్థాయిలో కూడా పలువురి మన్ననలను చూరగొంది.
జాతిపిత పూజ్య బాపూజీ మన భారతదేశానికే కాక, యావత్ప్రపంచానికీ శాంతి, అహింసల వెలుగుబాట చూపిన యుగపురుషుడు. స్వాతంత్య్ర సంగ్రామంలో రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యాన్ని అహింసాత్మకమైన పోరాటంతో కదిలించివేసి, దీక్షగా భారతీయులందరినీ ఒక త్రాటిపైన నడిపి విదేశీయుల కబంధహస్తాలనుండి మాతృదేశాన్ని విడిపించిన మహానాయకుడు, మహామనీషి. ఆ మహనీయుని జీవితానికి సంబంధించిన గుజరాతీ నవల ‘ప్రకాశనో పర్ఛాయో’ ను తెలుగు అనువాదమే ఈ మహాత్మునికి గాంధీకి మధ్య. చరిత్రలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన మహాపురుషులు ప్రజానీకానికీ, విశ్వమానవాళికీ తమ జీవితాన్ని ధారపోసినా, ఇతరులపై వారు చూపిన ఆర్తి, కరుణ తమ కుటుంబసభ్యుల పట్ల చూపించలేక పోవచ్చు. బాపూజీకి తన సిద్ధాంతాలపైన, ఆదర్శాలపట్ల కల పట్టుదల కారణంగా ఆయన పెద్దకుమారుడు హరిలాల్ జీవితం ఆయన ప్రబోధించిన మార్గానికి భిన్నంగా మరో దిశగా పయనించింది. లోకకల్యాణ ధ్యాసలో బయటి ప్రపంచంతో లీనమై గాంధీజీ పూర్తిగా దేశసేవకు అంకితమైపోయి వుండగా, ఆయన తన విషయంలో నిర్లక్ష్యం చేసినట్లుగా హరిలాల్ తపన చెందాడు. ఇందులో తప్పెవరిదన్న ప్రశ్నకు సమాధానం అన్వేషించడం కష్టం. మహాత్ముడికీ, ఆయన జ్యేష్ఠపుత్రుడు హరిలాల్ గాంధీకి మధ్య ఏర్పడిన దృక్పథవిభేదం దృష్ట్యా న్యాయనిర్ణయాన్ని విజ్ఞులైన పాఠకుల సదసద్వివేకానికే విడిచిపెట్టడం సముచితం. ప్రసిద్ధ గుజరాతీ రచయిత శ్రీ దినకర్ జోషీగారు గాంధీజీ జీవితానికీ, ఆయన కుటుంబానికీ సంబంధించిన ఎన్నో వాస్తవిక అంశాలను కష్టపడి సేకరించి హరిలాల్ ముఖ్యపాత్రగా ఈ నవలను రూపొందించారు. ఈ నవల ‘గాంధీ విరుద్ధ్ గాంధీ’ పేరుతో నాటకరూపం ఇవ్వబడి గుజరాతీ లోనూ, మరాఠీలోనూ, హిందీలోనూ కొన్ని వందలసార్లు ప్రదర్శించబడి ప్రజాదరణ పొందింది. ఈ నాటకరూపం కన్నడంలోకి కూడా అనువదింపబడింది. ఇదే నాటకాన్ని ఆంగ్లంలో ‘మహాత్మా వెర్సస్ గాంధీ’ అనే పేరుతో అమెరికా మొదలైన దేశాలలో ప్రదర్శించిన తరువాత ఇది అంతర్జాతీయస్థాయిలో కూడా పలువురి మన్ననలను చూరగొంది.© 2017,www.logili.com All Rights Reserved.