Gandhi Kathavali

By Koduri Srirama Murty (Author)
Rs.130
Rs.130

Gandhi Kathavali
INR
MANIMN5623
In Stock
130.0
Rs.130


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

గాంధీజీ కథావళి

గాంధీజీ - దేశవాళీ రోమియోలు, జూలియట్లు

ఒకసారి ఒక అమ్మాయి రాసిన ఉత్తరానికి సమాధానమిస్తూ గాంధీజీ "ఈ కాలం అమ్మాయిలు అరడజనుమంది రోమియోలకు జూలియట్లు అవుతున్నారు. ఈ అమ్మాయిలు బట్టల్ని అవసరం గడుపుకునేందుకు కాక ఆకర్షణీయంగా కనబడేందుకు వేసుకుంటున్నారు. ఇలాంటి ఆడపిల్లలకు నేను చెప్పిన అహింసా సిద్ధాంతం పనికిరాదు." అని రాశారు తన 'హరిజన్' పత్రికలో.

అది చదివి పదకొండుమంది ఆడపిల్లలు గాంధీజీకి ఉత్తరం రాశారు -

"ఈనాడు ఆడపిల్లలు గడపదాటి బయటకు వస్తున్నది మొగవాళ్ళతో సమానంగా బాధ్యతలు మోయడానికి. అయినా, మొగవాళ్ళు స్త్రీని గౌరవంగా చూడటం లేదు. అరడజనుమంది రోమియోలున్న జూలియట్లు ఎక్కడో కొద్దిమంది వుండవచ్చు. కాని జూలియట్లను వెదికేందుకు రోడ్డమీద పడిన రోమియోలు బోలెడుమంది వున్నారు.

ఈ కాలం ఆడపిల్లలకి మీ మీద గౌరవంలేదని ఎప్పుడు అనుకోవద్దు. మా తప్పు ఏదయినావుంటే అది సహేతుకంగా నిరూపించబడాలి. మాది నిజంగా తప్పే అయితే, మా పద్ధతుల్ని మార్చుకోడానికి మేం ఎప్పుడూ సంసిద్ధులమే” అని.

అప్పుడు గాంధీజీ 4-2 -1939 'హరిజన్' పత్రికలో యిలా సమాధానం రాశారు.

"ఇంగ్లీషు చదువు చదువుకుంటున్న అందరు అమ్మాయిలనీ నేను 'మోడరన్ గర్ల్స్' అనడం లేదు. కొందరిని వుద్దేశించి మాత్రమే అన్నాను. నేటి కాలేజి అమ్మాయిలు విదేశీయులను అనుసరించకూడదనే వుద్దేశంతో అలా రాశాను. నాకిప్పుడే ఆంధ్ర దేశం నుంచి ఒక అమ్మాయి రాసిన ఉత్తరం అందింది. తనని విద్యార్థులు ఎలా బాధపెడుతున్నారో హృదయవిదారకంగా రాసిందా అమ్మాయి. నేనీ ఫిర్యాదును ఆంధ్ర విశ్వవిద్యాలయ అధికారులకు పంపుతున్నాను. విద్యార్థినులు ఇలాంటి విద్యార్థుల చెడ్డ ప్రవర్తనను అణచేందుకు కంకణం కట్టుకోవాలి. అహింసా సిద్ధాంతం ఇందుకు అడ్డం రాదు. తమని...........................

గాంధీజీ కథావళి గాంధీజీ - దేశవాళీ రోమియోలు, జూలియట్లు ఒకసారి ఒక అమ్మాయి రాసిన ఉత్తరానికి సమాధానమిస్తూ గాంధీజీ "ఈ కాలం అమ్మాయిలు అరడజనుమంది రోమియోలకు జూలియట్లు అవుతున్నారు. ఈ అమ్మాయిలు బట్టల్ని అవసరం గడుపుకునేందుకు కాక ఆకర్షణీయంగా కనబడేందుకు వేసుకుంటున్నారు. ఇలాంటి ఆడపిల్లలకు నేను చెప్పిన అహింసా సిద్ధాంతం పనికిరాదు." అని రాశారు తన 'హరిజన్' పత్రికలో. అది చదివి పదకొండుమంది ఆడపిల్లలు గాంధీజీకి ఉత్తరం రాశారు - "ఈనాడు ఆడపిల్లలు గడపదాటి బయటకు వస్తున్నది మొగవాళ్ళతో సమానంగా బాధ్యతలు మోయడానికి. అయినా, మొగవాళ్ళు స్త్రీని గౌరవంగా చూడటం లేదు. అరడజనుమంది రోమియోలున్న జూలియట్లు ఎక్కడో కొద్దిమంది వుండవచ్చు. కాని జూలియట్లను వెదికేందుకు రోడ్డమీద పడిన రోమియోలు బోలెడుమంది వున్నారు. ఈ కాలం ఆడపిల్లలకి మీ మీద గౌరవంలేదని ఎప్పుడు అనుకోవద్దు. మా తప్పు ఏదయినావుంటే అది సహేతుకంగా నిరూపించబడాలి. మాది నిజంగా తప్పే అయితే, మా పద్ధతుల్ని మార్చుకోడానికి మేం ఎప్పుడూ సంసిద్ధులమే” అని. అప్పుడు గాంధీజీ 4-2 -1939 'హరిజన్' పత్రికలో యిలా సమాధానం రాశారు. "ఇంగ్లీషు చదువు చదువుకుంటున్న అందరు అమ్మాయిలనీ నేను 'మోడరన్ గర్ల్స్' అనడం లేదు. కొందరిని వుద్దేశించి మాత్రమే అన్నాను. నేటి కాలేజి అమ్మాయిలు విదేశీయులను అనుసరించకూడదనే వుద్దేశంతో అలా రాశాను. నాకిప్పుడే ఆంధ్ర దేశం నుంచి ఒక అమ్మాయి రాసిన ఉత్తరం అందింది. తనని విద్యార్థులు ఎలా బాధపెడుతున్నారో హృదయవిదారకంగా రాసిందా అమ్మాయి. నేనీ ఫిర్యాదును ఆంధ్ర విశ్వవిద్యాలయ అధికారులకు పంపుతున్నాను. విద్యార్థినులు ఇలాంటి విద్యార్థుల చెడ్డ ప్రవర్తనను అణచేందుకు కంకణం కట్టుకోవాలి. అహింసా సిద్ధాంతం ఇందుకు అడ్డం రాదు. తమని...........................

Features

  • : Gandhi Kathavali
  • : Koduri Srirama Murty
  • : Nava Chetan Publishing House
  • : MANIMN5623
  • : paparback
  • : Nov, 2023 2nd print
  • : 158
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gandhi Kathavali

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam