భారత మహిళా లోకంలో ధైర్య సాహసాలకు దేశభక్తికి ప్రతీకగా నిలిచింది వీరనారీమణి ఝాన్సీ లక్ష్మీబాయి. 'నస్త్రీ స్వాతంత్ర్యమనర్హసి' అనే మనస్మ్రుతిలోని ఒకే ఒక మాటను పట్టుకొని స్త్రీకి ఎటువంటి హక్కులు లేకుండా ఆమెను ఒక మరబొమ్మగా భావించే కాలంలో జన్మించిన లక్ష్మీబాయి మహిళ అంటే అబలకాదు సబల అని నిరూపించింది. ఆశ్రితులకు కరుణామూర్తిగా శత్రువులకు కాళికలా, తన రాజ్యంలోని ప్రజలకు కన్నతల్లిగా, సమర్థురాలైన పాలకురాలిగా, సమయోచితంగా వ్యవహరించే వ్యవహారదక్షరాలిగా లక్ష్మీబాయి విరాడ్రూపంతో మనసులను ఇట్టే ఆకట్టుకుంటుంది.
ఆమె వ్యక్తిత్వం అలాంటిది మరి. పరపీడనతో అలమటిస్తున్న దేశ వాసులతో స్వాతంత్రకాంక్ష రగుల్కొలిపి దేశమాతను దాస్యశృంఖలాల నుండి విముక్తం చేసే ధ్యేయంతో తన ప్రాణాలను తరుణప్రాయంగా భావించి సమర్పించడానికి సిద్ధపడిన త్యాగమూర్తి. ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంలో తన వీర పరాక్రమాలతో బ్రిటిషు వారిని గడగడలాడించిన ఆ మహనీయ స్వాతంత్ర సమర యోదాగ్రేసరి జీవితాన్ని పరికిద్దాం.
భారత మహిళా లోకంలో ధైర్య సాహసాలకు దేశభక్తికి ప్రతీకగా నిలిచింది వీరనారీమణి ఝాన్సీ లక్ష్మీబాయి. 'నస్త్రీ స్వాతంత్ర్యమనర్హసి' అనే మనస్మ్రుతిలోని ఒకే ఒక మాటను పట్టుకొని స్త్రీకి ఎటువంటి హక్కులు లేకుండా ఆమెను ఒక మరబొమ్మగా భావించే కాలంలో జన్మించిన లక్ష్మీబాయి మహిళ అంటే అబలకాదు సబల అని నిరూపించింది. ఆశ్రితులకు కరుణామూర్తిగా శత్రువులకు కాళికలా, తన రాజ్యంలోని ప్రజలకు కన్నతల్లిగా, సమర్థురాలైన పాలకురాలిగా, సమయోచితంగా వ్యవహరించే వ్యవహారదక్షరాలిగా లక్ష్మీబాయి విరాడ్రూపంతో మనసులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆమె వ్యక్తిత్వం అలాంటిది మరి. పరపీడనతో అలమటిస్తున్న దేశ వాసులతో స్వాతంత్రకాంక్ష రగుల్కొలిపి దేశమాతను దాస్యశృంఖలాల నుండి విముక్తం చేసే ధ్యేయంతో తన ప్రాణాలను తరుణప్రాయంగా భావించి సమర్పించడానికి సిద్ధపడిన త్యాగమూర్తి. ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంలో తన వీర పరాక్రమాలతో బ్రిటిషు వారిని గడగడలాడించిన ఆ మహనీయ స్వాతంత్ర సమర యోదాగ్రేసరి జీవితాన్ని పరికిద్దాం.© 2017,www.logili.com All Rights Reserved.