రామాయణంలో మారుతి పాత్రని మీరు విశ్లేషించిన తీరు ఇంతవరకూ చూడనిది. ఈ పుస్తకం చదువుతుంటే వాల్మీకి మహర్షి మనని ఎంత ఆలోచింపచేసారు! అనిపించింది. ప్రస్తుత భారత యువతకి ఒక ఆదర్శపురుషుడు కావాలి. ఒక హనుమంతుడు, ఒక వివేకానంద స్వామి మాత్రమే అటువంటి ఆదర్శమూర్తి కాగలరు. ఆదర్శవంతుడైన హనుమంతుడి పాత్రద్వారా మానవుడి నిత్యజీవితానికి కావలసిన కౌన్సిలింగ్ వాల్మీకి ఎలా చేసారో ఈ రచనలో ప్రతి పేజీలోనూ ఉంది. భగవంతుడిచ్చిన జీవితాన్ని ఆనందంగా గడపడానికి శారీరకంగా ఆరోగ్యం, బలం కావాలి. అంతకంటే ఎక్కువగా మానసికమైన ఆరోగ్యం, ఆటుపోట్లకు ప్రభావితం కాని చిత్త స్థైర్యం, ప్రలోభాలు ఎదురవగానే చలించిపోకుండా ఉండే మనోనిగ్రహం కావాలి. ఇదీ వాల్మీకి సందేశం.
ఈ సందేశం ఆ తరానికి ఎంత అవసరమయిందో అంతకంటే ఎక్కువగా ఈ తరానికి అవసరం అని అందరికీ అర్థమయ్యేలా, చదివి పాటించాలనిపించేలా రాశారు. సీత పాత్రని మీరు చూపించిన తీరు గురించి ఒక్కటే మాట - అద్భుతం. సీత పాత్రని విశ్లేషిస్తూ ఇటువంటి మరొక పుస్తకం మీరు రచించాలని నా అభిలాష.
- ఆదిలక్ష్మి
రామాయణంలో మారుతి పాత్రని మీరు విశ్లేషించిన తీరు ఇంతవరకూ చూడనిది. ఈ పుస్తకం చదువుతుంటే వాల్మీకి మహర్షి మనని ఎంత ఆలోచింపచేసారు! అనిపించింది. ప్రస్తుత భారత యువతకి ఒక ఆదర్శపురుషుడు కావాలి. ఒక హనుమంతుడు, ఒక వివేకానంద స్వామి మాత్రమే అటువంటి ఆదర్శమూర్తి కాగలరు. ఆదర్శవంతుడైన హనుమంతుడి పాత్రద్వారా మానవుడి నిత్యజీవితానికి కావలసిన కౌన్సిలింగ్ వాల్మీకి ఎలా చేసారో ఈ రచనలో ప్రతి పేజీలోనూ ఉంది. భగవంతుడిచ్చిన జీవితాన్ని ఆనందంగా గడపడానికి శారీరకంగా ఆరోగ్యం, బలం కావాలి. అంతకంటే ఎక్కువగా మానసికమైన ఆరోగ్యం, ఆటుపోట్లకు ప్రభావితం కాని చిత్త స్థైర్యం, ప్రలోభాలు ఎదురవగానే చలించిపోకుండా ఉండే మనోనిగ్రహం కావాలి. ఇదీ వాల్మీకి సందేశం. ఈ సందేశం ఆ తరానికి ఎంత అవసరమయిందో అంతకంటే ఎక్కువగా ఈ తరానికి అవసరం అని అందరికీ అర్థమయ్యేలా, చదివి పాటించాలనిపించేలా రాశారు. సీత పాత్రని మీరు చూపించిన తీరు గురించి ఒక్కటే మాట - అద్భుతం. సీత పాత్రని విశ్లేషిస్తూ ఇటువంటి మరొక పుస్తకం మీరు రచించాలని నా అభిలాష. - ఆదిలక్ష్మి© 2017,www.logili.com All Rights Reserved.