ప్రపంచ చరిత్రలో మహానీయ్లుగా ప్రసిద్ధికెక్కిన వారి జీవితాలను పరిశీలిస్తే భర్తలకు తోడుగా నిలబడి వారి ఆశయసాధన కోసం తమ సర్వస్వాన్ని సమర్పించి త్యాగం చేసిన మహిళలు ఎందరో కనిపిస్తారు. అందులో భారత జాతిపిత మహాత్మాగాంధీ సహదర్మచారిణి అయిన కస్తూరిబా ఒకరు. కస్తూరిబా, గాంధీగారి జీవితంలోకి ప్రవేసించే నాటికి ఇరువురూ సాధారణ వ్యక్తులే. కానీ వారి అసాధారణ వ్యక్తిత్వంతో భారతదేశానికి స్వాతంత్ర్యాని సంపాదించి పెట్టడమే గాకుండా ప్రజల మనస్సులో మహనీయులుగా నిలిచిపోయారు.
మహానాయకుని భార్యగా జీవించడం అంటే సాధారణమైన విషయమేం కాదు. యావత్ప్రపంచం తమ చూపుల్ని వారిపై నిలిపి, నిశితంగా గమనిస్తుంది. భారతదేశం రామరాజ్యం కావాలనీ, సత్యం అహింసలే ప్రజల మనస్సులో నాటుకుపోవాలనీ, స్వార్థం, పరపీడన వంటివి మనుష్యుల నుండి తొలగిపోవాలనీ గాంధీజీ తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేశారు. కస్తూరిబా తన సర్వస్వాన్నీ గాంధీజీ కోసం సమర్పించింది. ఆమె, తోడ్పాటు, సహకారం లేకపోతే గాంధీజీ మహాత్ముడు అయ్యేవాడు కాదు. ఈ విషయాన్ని గాంధీజీ స్వయంగా తన ఆత్మకథలో తెలియజేశారు.
ప్రపంచ చరిత్రలో మహానీయ్లుగా ప్రసిద్ధికెక్కిన వారి జీవితాలను పరిశీలిస్తే భర్తలకు తోడుగా నిలబడి వారి ఆశయసాధన కోసం తమ సర్వస్వాన్ని సమర్పించి త్యాగం చేసిన మహిళలు ఎందరో కనిపిస్తారు. అందులో భారత జాతిపిత మహాత్మాగాంధీ సహదర్మచారిణి అయిన కస్తూరిబా ఒకరు. కస్తూరిబా, గాంధీగారి జీవితంలోకి ప్రవేసించే నాటికి ఇరువురూ సాధారణ వ్యక్తులే. కానీ వారి అసాధారణ వ్యక్తిత్వంతో భారతదేశానికి స్వాతంత్ర్యాని సంపాదించి పెట్టడమే గాకుండా ప్రజల మనస్సులో మహనీయులుగా నిలిచిపోయారు. మహానాయకుని భార్యగా జీవించడం అంటే సాధారణమైన విషయమేం కాదు. యావత్ప్రపంచం తమ చూపుల్ని వారిపై నిలిపి, నిశితంగా గమనిస్తుంది. భారతదేశం రామరాజ్యం కావాలనీ, సత్యం అహింసలే ప్రజల మనస్సులో నాటుకుపోవాలనీ, స్వార్థం, పరపీడన వంటివి మనుష్యుల నుండి తొలగిపోవాలనీ గాంధీజీ తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేశారు. కస్తూరిబా తన సర్వస్వాన్నీ గాంధీజీ కోసం సమర్పించింది. ఆమె, తోడ్పాటు, సహకారం లేకపోతే గాంధీజీ మహాత్ముడు అయ్యేవాడు కాదు. ఈ విషయాన్ని గాంధీజీ స్వయంగా తన ఆత్మకథలో తెలియజేశారు.© 2017,www.logili.com All Rights Reserved.