ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారిని భారతీయులంతా 'సీమాంత్ గాంధీ' అని 'సరిహద్దు గాంధీ' అని గౌరవంగా పిలుస్తారు. వీరి జన్మస్థలం ఫఖ్తునిస్థాన్ కనుక అక్కడి పఠానులు ప్రేమతో 'బాబాఖాన్' అంటారు. ప్రపంచంలో మాత్రం వీరు 'బాద్ షా ఖాన్' గా పేరొందారు. బాదుషాలకే బాదుషా వంటి గఫార్ ఖాన్ గారు ఒక వ్యక్తి కాదు గొప్పశక్తి. సత్యము, ప్రేమ, సేవ మరియు త్యాగంతో నిండిన గొప్ప చరిత్ర ఆయనది. ఆరడుగుల మూడు అంగుళాల ఎత్తైన భారీ శరీరం. పొడగాటి ముక్కు, విలక్షణమైన చూపు, అనారోగ్యంతో ఉన్నా అలా కనిపించని ఉత్సాహం నిండిన శరీరం. తేజోవంతమైన ముఖంతో చెరగని చిరునవ్వు. మన స్వాతంత్ర పోరాటంలో గాంధీజీతో బాటే మరచిపోలేని మహావ్యక్తి గఫార్ ఖాన్ గారు. ఆయన గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకం చదవాల్సిందే.
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారిని భారతీయులంతా 'సీమాంత్ గాంధీ' అని 'సరిహద్దు గాంధీ' అని గౌరవంగా పిలుస్తారు. వీరి జన్మస్థలం ఫఖ్తునిస్థాన్ కనుక అక్కడి పఠానులు ప్రేమతో 'బాబాఖాన్' అంటారు. ప్రపంచంలో మాత్రం వీరు 'బాద్ షా ఖాన్' గా పేరొందారు. బాదుషాలకే బాదుషా వంటి గఫార్ ఖాన్ గారు ఒక వ్యక్తి కాదు గొప్పశక్తి. సత్యము, ప్రేమ, సేవ మరియు త్యాగంతో నిండిన గొప్ప చరిత్ర ఆయనది. ఆరడుగుల మూడు అంగుళాల ఎత్తైన భారీ శరీరం. పొడగాటి ముక్కు, విలక్షణమైన చూపు, అనారోగ్యంతో ఉన్నా అలా కనిపించని ఉత్సాహం నిండిన శరీరం. తేజోవంతమైన ముఖంతో చెరగని చిరునవ్వు. మన స్వాతంత్ర పోరాటంలో గాంధీజీతో బాటే మరచిపోలేని మహావ్యక్తి గఫార్ ఖాన్ గారు. ఆయన గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకం చదవాల్సిందే.© 2017,www.logili.com All Rights Reserved.