ఇప్పటికి సరిగ్గా 120 ఏళ్ల క్రితం పుట్టిన ఒక తమిళ బ్రాహ్మణ మహిళ జీవిత కథ ఇది. ఆ కాలానికి, ఆ సామాజిక స్థాయికి చెందిన సగటు మహిళలందరూ గడిపిన జీవితమే కదా! ఇందులో మనం తెలుసుకోవాల్సిందేముంది అనిపించొచ్చు. అవును ఆమె ఒక సామాన్య మహిళే. కాకపొతే కాస్త భిన్నం. బడి ముఖమే ఎరగని సుబ్బలక్ష్మి గ్రంథాలయాల నుంచి తెప్పించుకుని, కుదిరితే కొనుక్కుని వందల పుస్తకాలు చదివింది. వాటి నుంచి నోట్సు రాసుకుంది.
తమిళం, ఆంగ్ల భాషలలోని కాల్పనిక సాహిత్యంతో పాటు ఖగోళశాస్త్రం, మానసిక శాస్త్రం, చరిత్ర, యాత్రా సాహిత్యం వంటి వైవిధ్యం ఉన్న రంగాలకు సంబంధించిన పుస్తకాలను చదివింది. ప్రకృతంటే ప్రాణం ఆమెకు. చిత్రకళా పై మక్కువ. దైవంపై విశ్వాసం ఉంది. కాని పూజలు, పునస్కారాలు చేయలేదు. మూఢ విశ్వాసాలూ లేవు. కూతురిని భర్త బడికి పంపనంటే మద్రాసుకు తీసుకొచ్చి అన్న ఇంట్లో ఉండి చదివించుకుంది. ఇలాంటి ఓ సాధారణ అసాధారణ మహిళ కథ ఇది.
ఇప్పటికి సరిగ్గా 120 ఏళ్ల క్రితం పుట్టిన ఒక తమిళ బ్రాహ్మణ మహిళ జీవిత కథ ఇది. ఆ కాలానికి, ఆ సామాజిక స్థాయికి చెందిన సగటు మహిళలందరూ గడిపిన జీవితమే కదా! ఇందులో మనం తెలుసుకోవాల్సిందేముంది అనిపించొచ్చు. అవును ఆమె ఒక సామాన్య మహిళే. కాకపొతే కాస్త భిన్నం. బడి ముఖమే ఎరగని సుబ్బలక్ష్మి గ్రంథాలయాల నుంచి తెప్పించుకుని, కుదిరితే కొనుక్కుని వందల పుస్తకాలు చదివింది. వాటి నుంచి నోట్సు రాసుకుంది. తమిళం, ఆంగ్ల భాషలలోని కాల్పనిక సాహిత్యంతో పాటు ఖగోళశాస్త్రం, మానసిక శాస్త్రం, చరిత్ర, యాత్రా సాహిత్యం వంటి వైవిధ్యం ఉన్న రంగాలకు సంబంధించిన పుస్తకాలను చదివింది. ప్రకృతంటే ప్రాణం ఆమెకు. చిత్రకళా పై మక్కువ. దైవంపై విశ్వాసం ఉంది. కాని పూజలు, పునస్కారాలు చేయలేదు. మూఢ విశ్వాసాలూ లేవు. కూతురిని భర్త బడికి పంపనంటే మద్రాసుకు తీసుకొచ్చి అన్న ఇంట్లో ఉండి చదివించుకుంది. ఇలాంటి ఓ సాధారణ అసాధారణ మహిళ కథ ఇది.© 2017,www.logili.com All Rights Reserved.