ప్రాక్ - పశ్చిమముల నడుమ వారధిగా రూపొందిన మహావ్యక్తి హెలీనా పెట్రోవ్నా బ్లావెట్ స్కీ, పశ్చిమాంధకారమును ప్రార్దిశా ప్రభాత కాంతులతో నామె వెలిగించినది. ఆమె గ్రంథముల ద్వారముననే నేడు తెల్లజాతులవారు ప్రాచ్య విద్యలను సమగ్రముగా నర్థము చేసుకొనగలిగిరి. ఆమె వెలువరించిన మహా గ్రంథము "సీక్రెట్
డాన్" పాశ్చాత్యుల నద్భుతముగా ప్రభావితము చేసినది. నేటి విజ్ఞానశాస్త్రము సాధించిన అద్భుతములకు మూల ప్రేరక మామె గ్రంథమే! సర్వవైజ్ఞానిక, వేదాంత, మత రహస్యముల నర్థము చేసుకొనుట కవసరమగు కీలక గ్రంథముగా సీక్రెట్ డాక్టినను నేటికిని పరిగణించు చున్నారు. ప్రపంచమునందలి సర్వమతముల జీవనాడిని పట్టి యిచ్చినవి యామె గ్రంథములు. మానవ జాతి పరిణామక్రమము యొక్క లక్ష్య మొకటి, ఆ లక్ష్యమును చేరగలుగు
మార్గము సుగమము చేసుకొనుటకు మానవుడు నిర్వహింపవలసిన కర్తవ్య మొకటి - ఈ రెండు మహావిషయములను వెలిగించిన 20వ శతాబ్దపు మహాజ్యోతి బ్లావెట్ స్కీ. తాము నమ్మిన మార్గమున మరింత దీక్షతో పయనింపగోరు కర్మయోగుల కామె వాక్కు ఆశీస్సుగా పరిణ మించును. ఆమె సందేశము నిత్య నూతన జ్యోతియై, మానవాళి తనకు తాను సృజించుకొనుచున్న సమస్యలకు పరిష్కారముగా వెలుగొందు చున్నది. అది, ఆశీర్వాదరూపమైన బ్లావెట్ స్కీ వాక్కు ననుసరించి సాధింపబడును గాక!
- ఎక్కిరాల కృష్ణమాచార్య
ప్రాక్ - పశ్చిమముల నడుమ వారధిగా రూపొందిన మహావ్యక్తి హెలీనా పెట్రోవ్నా బ్లావెట్ స్కీ, పశ్చిమాంధకారమును ప్రార్దిశా ప్రభాత కాంతులతో నామె వెలిగించినది. ఆమె గ్రంథముల ద్వారముననే నేడు తెల్లజాతులవారు ప్రాచ్య విద్యలను సమగ్రముగా నర్థము చేసుకొనగలిగిరి. ఆమె వెలువరించిన మహా గ్రంథము "సీక్రెట్ డాన్" పాశ్చాత్యుల నద్భుతముగా ప్రభావితము చేసినది. నేటి విజ్ఞానశాస్త్రము సాధించిన అద్భుతములకు మూల ప్రేరక మామె గ్రంథమే! సర్వవైజ్ఞానిక, వేదాంత, మత రహస్యముల నర్థము చేసుకొనుట కవసరమగు కీలక గ్రంథముగా సీక్రెట్ డాక్టినను నేటికిని పరిగణించు చున్నారు. ప్రపంచమునందలి సర్వమతముల జీవనాడిని పట్టి యిచ్చినవి యామె గ్రంథములు. మానవ జాతి పరిణామక్రమము యొక్క లక్ష్య మొకటి, ఆ లక్ష్యమును చేరగలుగు మార్గము సుగమము చేసుకొనుటకు మానవుడు నిర్వహింపవలసిన కర్తవ్య మొకటి - ఈ రెండు మహావిషయములను వెలిగించిన 20వ శతాబ్దపు మహాజ్యోతి బ్లావెట్ స్కీ. తాము నమ్మిన మార్గమున మరింత దీక్షతో పయనింపగోరు కర్మయోగుల కామె వాక్కు ఆశీస్సుగా పరిణ మించును. ఆమె సందేశము నిత్య నూతన జ్యోతియై, మానవాళి తనకు తాను సృజించుకొనుచున్న సమస్యలకు పరిష్కారముగా వెలుగొందు చున్నది. అది, ఆశీర్వాదరూపమైన బ్లావెట్ స్కీ వాక్కు ననుసరించి సాధింపబడును గాక! - ఎక్కిరాల కృష్ణమాచార్య
© 2017,www.logili.com All Rights Reserved.