"దాశరథి అన్నిటికన్నా ముందు - మనిషి, ఏ కొద్దిపాటి వానచినుకులకైనా తబ్బిబ్బుకాగల రావిఆకు హృదయమున్నవాడు. అతనొక సంక్షుభిక తెలంగాణా ఉద్యమకాలంలో కాక, మరొక కాలంలో జన్మించినట్లయితే, ఏమి చేస్తుండేవాడో ఊహించడం కష్టం కాదనుకుంటాను.
ఇప్పుడు మన చేతుల్లో ఉన్న 'యాత్రాస్మృతి' అనడం కన్నా, కవిపరంపరతో కలిసి చేసిన యాత్రాస్మృతి అనడం సముచితంగా ఉంటుంది. ఒకప్పుడు మహా రాష్ట్రదేశంలో సంత్ జ్ఞానేశ్వర్, నామదేవ్ వంటివారు ప్రోదిచేసి పోషించిన వర్కారీ సంప్రదాయంలో లాగా, పండరియాత్ర చేసే భక్త గాయకులు తమ యాత్రనొక కావ్యయాత్రగా మార్చుకున్నాడు. అతిసున్నితమైన, మసృణకోమలమైన ఆయన హృదయం ఏ పాటలు పాడుకున్నదో అన్న పాటలూ మనం వినలేకపోయాo. క్లుప్తంగా కనిపిస్తున్న ఈ పుస్తకం పుటల్లో రాసిన వ్యాక్యాలను సంభావించుకునే యోగ్యత ఒక్కటే మనకు మిగిలింది.
"మహారచయిత టాల్ స్టాయి 'యుద్ధము శాంతి'గా పర్యవసించడానికి ఒక నవలగా రాసాడు. కాని దాశరథి విషయంలో 'యుద్ధము - శాంతి' ఆయన జీవితంగానే పెనవైచుకు పోయాయి".
- చినవీరభద్రుడు
© 2017,www.logili.com All Rights Reserved.