సమాజంలో అమానుషమైన జీవితాన్ని గడుపుతున్న నిమ్నజాతుల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు. నిమ్నకులాలైన మహర్, మాంగ్ కు చెందిన బాలబాలికల కోసం పాఠశాలలు ప్రారంభించినవాడు. అనాధ శిశువుల ఉద్ధరణ కోసం వారికి సేవాసదనం ప్రారంభించిన సేవామూర్తి. బుద్ధభగవానుని మార్గంలో నడిచి బ్రాహ్మణ భావజాలంపై పోరాడిన ధీరుడు. తాను ఎంచుకున్న మార్గంలో ఎన్ని కష్టాలు ఎదురైనా నడిచి అట్టడుగువర్గాలలో చైతన్యాన్ని తీసుకువచ్చిన చైతన్య మూర్తి. మహాత్మా పూలేగా మన్ననలను అందుకున్నాడు. మహాత్మా పూలే మంచి మాటలు చెప్పాడు. రాతల ద్వారా ప్రబోధించాడు. చేతల ద్వారా చేసి చూపించాడు. దళిత జన సమాజంలో ఒక నూతనోత్సాహాన్ని నింపాడు.
సమాజంలో అమానుషమైన జీవితాన్ని గడుపుతున్న నిమ్నజాతుల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు. నిమ్నకులాలైన మహర్, మాంగ్ కు చెందిన బాలబాలికల కోసం పాఠశాలలు ప్రారంభించినవాడు. అనాధ శిశువుల ఉద్ధరణ కోసం వారికి సేవాసదనం ప్రారంభించిన సేవామూర్తి. బుద్ధభగవానుని మార్గంలో నడిచి బ్రాహ్మణ భావజాలంపై పోరాడిన ధీరుడు. తాను ఎంచుకున్న మార్గంలో ఎన్ని కష్టాలు ఎదురైనా నడిచి అట్టడుగువర్గాలలో చైతన్యాన్ని తీసుకువచ్చిన చైతన్య మూర్తి. మహాత్మా పూలేగా మన్ననలను అందుకున్నాడు. మహాత్మా పూలే మంచి మాటలు చెప్పాడు. రాతల ద్వారా ప్రబోధించాడు. చేతల ద్వారా చేసి చూపించాడు. దళిత జన సమాజంలో ఒక నూతనోత్సాహాన్ని నింపాడు.© 2017,www.logili.com All Rights Reserved.