శ్రీ వై. ఎస్. జగన్ మోహనరెడ్డి... ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఓ సంచలనం. ఉవ్వెత్తున ఎగసిన యువకెరటం. కష్టాలు, కన్నీళ్ళను విజయ సోపానాలుగా మార్చుకున్న సంకల్ప దీక్షకు నిలువెత్తు రూపం. తెలుగు ప్రజలందరి హృదయాల్లో 'నాయకుడంటే జగనన్నలా ఉండాల'న్నంతగా స్ఫూర్తినింపిన యువకిశోరం.
అతి పిన్నవయస్సులోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరుదైన ఘనత సాధించటం, ఆ వెంటనే పేద ప్రజల కోసం మద్యం విక్రయాల మీద దశలవారీగా నియంత్రణ తీసుకురావటం, ఆరోగ్యశ్రీ పథకం పరిధిని మరింతగా పెంచటం, రివర్స్ టెండరింగ్ ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఆదా చెయ్యటం, దేశ చరిత్రలోనే తొలిగా గ్రామసచివాలయం వ్యవస్థకు శ్రీకారం చుట్టటం, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించటం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదర్శంగా తీసుకునేలా మహిళల సంరక్షణ కోసం 'దిశ' చట్టం అమలుతో పాటు దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, పేద ప్రజల విద్యావసరాల కోసం అమ్మబడి పథకం, విద్యదివేన పథకాలు , పేదల ఆకలి తీర్చటానికి గోరుముద్ద పథకం అమలు.... ఇలా చెప్పుకుంటే ఎన్నో... ఎన్నెన్నో సంక్షేమ పథకాలు, మరెంతో అభివృద్ధి.
- డా. కుప్పగంతు రామకృష్ణ