సాహిత్య విమర్శా రంగంలో నా కృషి అటు ప్రాచీన సాహిత్యం మీదా, ఇటూ ఆధునిక కవిత్వం, కథానిక, తెలుగు సాహిత్య విమర్శల మీద జరిగింది. నవల మీద నా కృషి చాలా పరిమితమని ఈ గ్రంథమే రుజువు చేస్తున్నది. తెలుగు నవలల మీద నేను రాసిన ఈ పదమూడు వ్యాసాలే నేనింకా చెయ్యవలసిన కృషిని గురించి హెచ్చరిస్తున్నాయి. వీటిలో కొన్నింటిని అఫ్సర్ రాయించగా, తక్కినవి ఇతర సందర్భాల కోసం రాసినవి. 'జగడం' నవలకు ముందు మాట రాయమని బోయ జంగయ్య గారు నన్ను కోరడం నాకు పరమానందమైంది. ఏ ప్రక్రియ మీద విమర్శ రాసినా వస్తు చర్చ మనకు బాగా ఇష్టమైనది. అలవాటైంది. నందిని సిధారెడ్డి 'ప్రజల మనిషి' నవలా శిల్పం మీద వ్యాసం రాయమని కోరినప్పుడు ఆనందంగా ప్రయత్నించాను. నవలా శిల్ప శాస్త్రాన్ని ముందు బెట్టుకొని కాక, నవలలో శిల్ప విశేషాలుగా నాకు కనిపించిన వాటిని చెప్పడానికి ప్రయత్నించాను.
- రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
సాహిత్య విమర్శా రంగంలో నా కృషి అటు ప్రాచీన సాహిత్యం మీదా, ఇటూ ఆధునిక కవిత్వం, కథానిక, తెలుగు సాహిత్య విమర్శల మీద జరిగింది. నవల మీద నా కృషి చాలా పరిమితమని ఈ గ్రంథమే రుజువు చేస్తున్నది. తెలుగు నవలల మీద నేను రాసిన ఈ పదమూడు వ్యాసాలే నేనింకా చెయ్యవలసిన కృషిని గురించి హెచ్చరిస్తున్నాయి. వీటిలో కొన్నింటిని అఫ్సర్ రాయించగా, తక్కినవి ఇతర సందర్భాల కోసం రాసినవి. 'జగడం' నవలకు ముందు మాట రాయమని బోయ జంగయ్య గారు నన్ను కోరడం నాకు పరమానందమైంది. ఏ ప్రక్రియ మీద విమర్శ రాసినా వస్తు చర్చ మనకు బాగా ఇష్టమైనది. అలవాటైంది. నందిని సిధారెడ్డి 'ప్రజల మనిషి' నవలా శిల్పం మీద వ్యాసం రాయమని కోరినప్పుడు ఆనందంగా ప్రయత్నించాను. నవలా శిల్ప శాస్త్రాన్ని ముందు బెట్టుకొని కాక, నవలలో శిల్ప విశేషాలుగా నాకు కనిపించిన వాటిని చెప్పడానికి ప్రయత్నించాను. - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.