"...తన ఆత్మ కథను మూడు భాగాలుగా గ్రంధస్తం చేసిన రమణగారు చాలా సంగతులు చెప్పలేదు. సినిమాలు తగ్గినా స్థితిలో సాహితి సర్వస్వం మార్కెట్లోకి వచ్చి అదరగోట్టింది. "భాగవతం" టివి సీరియల్ వచ్చి బాపు-రమణలు ఏ మాత్రం పట్టు కోల్పోలేదని నిరూపించింది. ఆఖరి శ్వాస విడిచేదాకా అయన క్రియేటివిటి తగ్గలేదని "శ్రీరామరాజ్యం" నిరూపించింది. ఇవన్ని చెప్తేనే చరిత్రకు న్యాయం జరుగుతుందనిపించి "కోతికొమ్మచ్చి"లో అయన వదిలేసిన విషయాలతో "కొసరు కొమ్మచ్చి" తయారు చేశాం.
ఆయన కుటుంబ విషయాల గురించి వారి శ్రీమతి శ్రీదేవి, కుమారుడు శ్రీ వరా ముళ్ళపూడి, కుమార్తె శ్రీమతి అనురాధ ముళ్ళపూడి రాయగా......సాహిత్యం గురించి "సాహితి సర్వస్వం" సంకలనకర్త శ్రీ ఏమ్బియస్ రాయగా....
సినిమాల గురించి, టీవీ సీరియల్స్ గురించి శ్రీ బివియస్ రామారావు (సీతారాముడు) రాశారు. అయన రమణగారికి హైస్కూల్ నుండి స్నేహితుడు. దాదాపు వారి సినిమాలన్నిటిలోనూ పాలుపంచుకున్నారు. మంచి రచయిత; సినిమా కళపై అవగాహనా కలిగినవారు. ఆయన బాపు-రమణల సొంత సినిమాల గురించే కాకా రమణ చేసిన సినిమాలన్నిటిని చూసి, వాటి కథాసంగ్రహాలు, ఎంపిక చేసిన సంభాషణలు, తెరవెనుక విశేషాలు-తన జ్ఞాపకాలతో, అనుభవాలతో రంగరించి మరీ అందించారు.
అనేక అరుదైన ఫోటోలతో అచ్చమైన 'బాపురమణీయంగా' రూపొందింది......ఈ "కోసరు కోమ్మచ్చి".
-వరప్రసాద్.
"...తన ఆత్మ కథను మూడు భాగాలుగా గ్రంధస్తం చేసిన రమణగారు చాలా సంగతులు చెప్పలేదు. సినిమాలు తగ్గినా స్థితిలో సాహితి సర్వస్వం మార్కెట్లోకి వచ్చి అదరగోట్టింది. "భాగవతం" టివి సీరియల్ వచ్చి బాపు-రమణలు ఏ మాత్రం పట్టు కోల్పోలేదని నిరూపించింది. ఆఖరి శ్వాస విడిచేదాకా అయన క్రియేటివిటి తగ్గలేదని "శ్రీరామరాజ్యం" నిరూపించింది. ఇవన్ని చెప్తేనే చరిత్రకు న్యాయం జరుగుతుందనిపించి "కోతికొమ్మచ్చి"లో అయన వదిలేసిన విషయాలతో "కొసరు కొమ్మచ్చి" తయారు చేశాం. ఆయన కుటుంబ విషయాల గురించి వారి శ్రీమతి శ్రీదేవి, కుమారుడు శ్రీ వరా ముళ్ళపూడి, కుమార్తె శ్రీమతి అనురాధ ముళ్ళపూడి రాయగా......సాహిత్యం గురించి "సాహితి సర్వస్వం" సంకలనకర్త శ్రీ ఏమ్బియస్ రాయగా.... సినిమాల గురించి, టీవీ సీరియల్స్ గురించి శ్రీ బివియస్ రామారావు (సీతారాముడు) రాశారు. అయన రమణగారికి హైస్కూల్ నుండి స్నేహితుడు. దాదాపు వారి సినిమాలన్నిటిలోనూ పాలుపంచుకున్నారు. మంచి రచయిత; సినిమా కళపై అవగాహనా కలిగినవారు. ఆయన బాపు-రమణల సొంత సినిమాల గురించే కాకా రమణ చేసిన సినిమాలన్నిటిని చూసి, వాటి కథాసంగ్రహాలు, ఎంపిక చేసిన సంభాషణలు, తెరవెనుక విశేషాలు-తన జ్ఞాపకాలతో, అనుభవాలతో రంగరించి మరీ అందించారు. అనేక అరుదైన ఫోటోలతో అచ్చమైన 'బాపురమణీయంగా' రూపొందింది......ఈ "కోసరు కోమ్మచ్చి". -వరప్రసాద్.
© 2017,www.logili.com All Rights Reserved.