మార్పుకి ఒక ఐకాన్ గా నిలిచాడు బరాక్ హుస్సేన్ ఒబామా. రాజకీయాల్లో, పరిపాలనలో, సకల రంగాల కార్యనిర్వాహణలో మార్పును కోరేవారికి స్పూర్తి అయ్యాడు. ఒబామా అమెరికా 44వ అధ్యక్షునిగా ఎన్నికవటం చారిత్రిక పరిణామం. అమెరికా చరిత్రలో ఒక నల్లజాతీయుడు అధ్యక్ష పదవికి పోటీపడటం, గెలవడం ఇదే తొలిసారి. ఇరవై ఒకటో శతాబ్దానికే గొప్ప మేలిమలుపు ఒబామా గెలుపు. ఘనమైన వారసత్వం ఏమీ లేని ఒబామాకి ఈ మహత్తర విజయం ఎలా సాధ్యమైంది? ఏ నేపథ్యం ఇందుకు తోడ్పడింది? దీనికి మూలాలు ఎక్కడ? ఈ ప్రశ్నలకి ఒబామా జీవితమే సమాధానం. ఆయన జీవితాన్ని పరిశేలిస్తే బహుళ పార్శ్వాలు కనిపిస్తాయి. అనేక మలుపులతో, అనుబంధాలతో కూడిన ఒబామా జీవితం అత్యంత స్పూర్తిదాయక విజయగాథ. ప్రజాస్వామ్య ప్రస్థానంలో నిలిచి గెలిచిన ఒక సామాన్యుడి సహసగాథ. ప్రజాస్వామ్యం అక్షరాలా అమలయ్యే చోట ప్రజలే చరిత్ర నిర్మాతలవుతారని చెప్పడానికి ఒబామా జీవిత కథనే పెద్ద దాఖలా.
మార్పుకి ఒక ఐకాన్ గా నిలిచాడు బరాక్ హుస్సేన్ ఒబామా. రాజకీయాల్లో, పరిపాలనలో, సకల రంగాల కార్యనిర్వాహణలో మార్పును కోరేవారికి స్పూర్తి అయ్యాడు. ఒబామా అమెరికా 44వ అధ్యక్షునిగా ఎన్నికవటం చారిత్రిక పరిణామం. అమెరికా చరిత్రలో ఒక నల్లజాతీయుడు అధ్యక్ష పదవికి పోటీపడటం, గెలవడం ఇదే తొలిసారి. ఇరవై ఒకటో శతాబ్దానికే గొప్ప మేలిమలుపు ఒబామా గెలుపు. ఘనమైన వారసత్వం ఏమీ లేని ఒబామాకి ఈ మహత్తర విజయం ఎలా సాధ్యమైంది? ఏ నేపథ్యం ఇందుకు తోడ్పడింది? దీనికి మూలాలు ఎక్కడ? ఈ ప్రశ్నలకి ఒబామా జీవితమే సమాధానం. ఆయన జీవితాన్ని పరిశేలిస్తే బహుళ పార్శ్వాలు కనిపిస్తాయి. అనేక మలుపులతో, అనుబంధాలతో కూడిన ఒబామా జీవితం అత్యంత స్పూర్తిదాయక విజయగాథ. ప్రజాస్వామ్య ప్రస్థానంలో నిలిచి గెలిచిన ఒక సామాన్యుడి సహసగాథ. ప్రజాస్వామ్యం అక్షరాలా అమలయ్యే చోట ప్రజలే చరిత్ర నిర్మాతలవుతారని చెప్పడానికి ఒబామా జీవిత కథనే పెద్ద దాఖలా.© 2017,www.logili.com All Rights Reserved.