వాగ్గేయకారుల కీర్తనా వాజ్మయంతో తెలుగు భాషకు ప్రపంచ వ్యాప్తి లభించింది. వీరి సాహిత్యంలోని గొప్పతనం వల్లనే ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతమైన కర్నాటక సంగీతానికి తెలుగు ప్రధాన భాష కాగలిగింది. తాళ్ళపాక అన్నమాచార్యులు, మొవ్వెపురి క్షేత్రయ్య, కంచర్ల గోపన్న, కాకర్ల త్యాగరాజు, మునిపల్లె సుబ్రహ్మణ్య కవి ఇలా ఎందరో వాగ్గేయకారులు వేలాది కీర్తనలు రాసి దానికి ధాతు సౌభాగ్యాన్ని చేకూర్చి, వారు గానం చేసి, వేలాది విద్వాంసుల చేత గానం చేయించి ప్రపంచాన్ని నాదమయం చేశారు. ఆధునికులలో కూడా దాసు శ్రీరాములు, ఆదిభట్ల నారాయణదాసు, హరినాగభూషణం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం వంటి గొప్ప తెలుగు వాగ్గేయకారులున్నారు.
ఇలా వాగ్గేయ రచనలు చేసిన గొప్పవారిని తెలుగు విద్యార్థి లోకానికి పరిచయం చేయడానికి చేసిన చిన్న ప్రయత్నమే ఈ పుస్తకం.
వాగ్గేయకారుల కీర్తనా వాజ్మయంతో తెలుగు భాషకు ప్రపంచ వ్యాప్తి లభించింది. వీరి సాహిత్యంలోని గొప్పతనం వల్లనే ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతమైన కర్నాటక సంగీతానికి తెలుగు ప్రధాన భాష కాగలిగింది. తాళ్ళపాక అన్నమాచార్యులు, మొవ్వెపురి క్షేత్రయ్య, కంచర్ల గోపన్న, కాకర్ల త్యాగరాజు, మునిపల్లె సుబ్రహ్మణ్య కవి ఇలా ఎందరో వాగ్గేయకారులు వేలాది కీర్తనలు రాసి దానికి ధాతు సౌభాగ్యాన్ని చేకూర్చి, వారు గానం చేసి, వేలాది విద్వాంసుల చేత గానం చేయించి ప్రపంచాన్ని నాదమయం చేశారు. ఆధునికులలో కూడా దాసు శ్రీరాములు, ఆదిభట్ల నారాయణదాసు, హరినాగభూషణం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం వంటి గొప్ప తెలుగు వాగ్గేయకారులున్నారు. ఇలా వాగ్గేయ రచనలు చేసిన గొప్పవారిని తెలుగు విద్యార్థి లోకానికి పరిచయం చేయడానికి చేసిన చిన్న ప్రయత్నమే ఈ పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.