ప్రకృతి మోసులెత్తి నప్పుడల్లా
కళ్ళు కుంచెలై కాలాన్ని లిఖించుకుంటాయి
తూలికలెవరు తిప్పుతారోగాని
ఈ సజీవాద్భుత కాన్వాస్ మీద
ఎప్పటికీ చెరిగిపోని చిత్రం ముద్రితమౌతుంది
లియోనార్డో డావిన్సీ పాబ్లో పికాసో రవివర్మ...
ఎవరికీ అందని పటాన్ని
రెటీనా చిత్రించుకొని దాచుకుంటుంది
ఒక్కొక్కసారి చూపులు శరాలై దృశ్యాన్ని కబళిస్తాయి
పొడకట్టిన బొమ్మకు కళ్ళే పోడుములద్ది
చక్షు చారువుల్ని చేసుకుంటాయి
నేల మోయలేని బరువునైనా
నేత్రం మోయగలుగుతుంది.
అందమైన ప్రకృతినుంచి
అపార సంక్షుభిత కల్లోలం వరకూ
సకలదృశ్యాలకూ సచిత్రసాక్ష్యం నేత్రం
నిజానకి నిర్బంధానికి నడుమ
సత్యానికి సమయానుకూలానికి మధ్య
జ్ఞాపకానికి జ్ఞానానికి చేరువ
జరిగే అసాధ్య సంధానక్రియలో
కంటిబుగ్గ మరిగి ఆవిరై మేఘమై మెరుపై
అనివార్య కాకధ్వజమై
కాశ్యపీ గోళాన్ని దహిస్తుంది
నేత్రం సత్యాసక్తితో అశక్తమై
రెప్పల మధ్య తలదాచుకొని రోదిస్తుంది.
ప్రకృతి మోసులెత్తి నప్పుడల్లా కళ్ళు కుంచెలై కాలాన్ని లిఖించుకుంటాయి తూలికలెవరు తిప్పుతారోగాని ఈ సజీవాద్భుత కాన్వాస్ మీద ఎప్పటికీ చెరిగిపోని చిత్రం ముద్రితమౌతుంది లియోనార్డో డావిన్సీ పాబ్లో పికాసో రవివర్మ... ఎవరికీ అందని పటాన్ని రెటీనా చిత్రించుకొని దాచుకుంటుంది ఒక్కొక్కసారి చూపులు శరాలై దృశ్యాన్ని కబళిస్తాయి పొడకట్టిన బొమ్మకు కళ్ళే పోడుములద్ది చక్షు చారువుల్ని చేసుకుంటాయి నేల మోయలేని బరువునైనా నేత్రం మోయగలుగుతుంది. అందమైన ప్రకృతినుంచి అపార సంక్షుభిత కల్లోలం వరకూ సకలదృశ్యాలకూ సచిత్రసాక్ష్యం నేత్రం నిజానకి నిర్బంధానికి నడుమ సత్యానికి సమయానుకూలానికి మధ్య జ్ఞాపకానికి జ్ఞానానికి చేరువ జరిగే అసాధ్య సంధానక్రియలో కంటిబుగ్గ మరిగి ఆవిరై మేఘమై మెరుపై అనివార్య కాకధ్వజమై కాశ్యపీ గోళాన్ని దహిస్తుంది నేత్రం సత్యాసక్తితో అశక్తమై రెప్పల మధ్య తలదాచుకొని రోదిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.