గత ఐదారేండ్లుగా సంవత్సరంలో సగం రోజులు లండన్లో ఉండటం వలన కాలక్షేపానికి యింటి ఎదురుగానున్న ప్రిస్టన్ కమ్యూనిటీ లైబ్రరీలో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరికంది. అగధాక్రిస్టీ క్రైం ఫిక్షనను, ఆర్టిస్టుల జీవిత చరిత్రలు (చదవడమే కాకుండా) వారవారం లైబ్రరీలో ప్రదర్శించిన సినిమాలుఆస్కార్ అవార్డు పొందినవీ, లండన్ నగరాన్ని గురించి తెలిపేవీ, వాంఝా మీద ఆయిల్ పెయింటింగులతో తీసిన ఏనిమేటెడ్ ఫిల్మ్ 'లవింగ్ విన్సెంట్', వెర్నీర్ కళాఖండం 'గర్ల్ వితె పెరల్ ఇయర్ రింగ్' సినిమా మొదలైనవన్నీ, ఆర్డుపట్ల సహజంగా నాకుగల అభిరుచిని విస్తృత పరుచుకోవడానికి తోడ్పడ్డాయి. వారాంతాల్లో మ్యూజియంలూ, ఆర్డు గాలరీలు, ఆర్డు ఎగ్జిబిషన్లూ, చూడటంతోనూ, వార్తాపత్రికల్లో ఆర్డు క్రిటిక్స్ రాసిన వ్యాసాలు చదవడంతోనూ ఎన్నెన్నో విశేషాలను, కొత్త విషయాలనూ తెలుసుకోగలిగాను. చిమాబ్యూఏ, డోరామాల్, టిషన్ కళాఖండాల వివరాలు అలా తెలుసుకున్నవే!సెంట్ మార్టిన్ థియేటర్లో థర్డు ఫ్లోర్ నుండి (టికెట్ దొరకడమే గగనం!) నాటకం చూడడం, స్ట్రీట్ ఫర్డ్ అపాన్ ఏవలో షేక్ స్పియర్ జన్మస్థలం మ్యూజియం, ఇంటి ఆవరణలో విశ్వకవి రవీంద్రుని కాంస్య విగ్రహం చూడటం, గ్లోబ్ థియేటర్లో మూడు షేక్స్పియర్ నాటకాలు, వాటిలో ఒక నాటకాన్ని నిలబడి చూడటం (కూర్చుని చూసే టికెట్ దొరక్క) అన్నీ గొప్ప అనుభవాలు, ఈ వ్యాసాలకు ప్రేరణ.
టి.వి. ప్రసాద్
గత ఐదారేండ్లుగా సంవత్సరంలో సగం రోజులు లండన్లో ఉండటం వలన కాలక్షేపానికి యింటి ఎదురుగానున్న ప్రిస్టన్ కమ్యూనిటీ లైబ్రరీలో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరికంది. అగధాక్రిస్టీ క్రైం ఫిక్షనను, ఆర్టిస్టుల జీవిత చరిత్రలు (చదవడమే కాకుండా) వారవారం లైబ్రరీలో ప్రదర్శించిన సినిమాలుఆస్కార్ అవార్డు పొందినవీ, లండన్ నగరాన్ని గురించి తెలిపేవీ, వాంఝా మీద ఆయిల్ పెయింటింగులతో తీసిన ఏనిమేటెడ్ ఫిల్మ్ 'లవింగ్ విన్సెంట్', వెర్నీర్ కళాఖండం 'గర్ల్ వితె పెరల్ ఇయర్ రింగ్' సినిమా మొదలైనవన్నీ, ఆర్డుపట్ల సహజంగా నాకుగల అభిరుచిని విస్తృత పరుచుకోవడానికి తోడ్పడ్డాయి. వారాంతాల్లో మ్యూజియంలూ, ఆర్డు గాలరీలు, ఆర్డు ఎగ్జిబిషన్లూ, చూడటంతోనూ, వార్తాపత్రికల్లో ఆర్డు క్రిటిక్స్ రాసిన వ్యాసాలు చదవడంతోనూ ఎన్నెన్నో విశేషాలను, కొత్త విషయాలనూ తెలుసుకోగలిగాను. చిమాబ్యూఏ, డోరామాల్, టిషన్ కళాఖండాల వివరాలు అలా తెలుసుకున్నవే!సెంట్ మార్టిన్ థియేటర్లో థర్డు ఫ్లోర్ నుండి (టికెట్ దొరకడమే గగనం!) నాటకం చూడడం, స్ట్రీట్ ఫర్డ్ అపాన్ ఏవలో షేక్ స్పియర్ జన్మస్థలం మ్యూజియం, ఇంటి ఆవరణలో విశ్వకవి రవీంద్రుని కాంస్య విగ్రహం చూడటం, గ్లోబ్ థియేటర్లో మూడు షేక్స్పియర్ నాటకాలు, వాటిలో ఒక నాటకాన్ని నిలబడి చూడటం (కూర్చుని చూసే టికెట్ దొరక్క) అన్నీ గొప్ప అనుభవాలు, ఈ వ్యాసాలకు ప్రేరణ. టి.వి. ప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.