భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలోని అత్యంత క్లిష్టమైన దశ గురించీ, ఆ సమయంలో సుభాష్ చంద్రబోస్ నిర్వహించిన పాత్ర గురించీ, యువకులు, విద్యార్థులు, సాధారణ పాఠకులు చక్కగా అవగాహన చేసుకోవడానికి ఈ పుస్తకం దోహదపడుతుంది. సుభాష్ చంద్రబోస్ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు మరెన్నో ఈ పుస్తకంలో లభిస్తాయి.
ప్రొ.గౌతమ్ కేవలం విద్యావేత్త. మేధావి మాత్రమే గాక నాడు వంగ దేశంలో స్వాతంత్రం కోసం జరిగిన విద్యార్ధి నిరసనోధ్యమాలలో పాలు పంచుకున్న వ్యక్తి. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరశీల విద్యార్ధి ఉద్యమం కోల్కతాలో ఎంత ఉదృత రూపం దాల్చిందో ఆయన ప్రత్యక్షంగా చూశారు. నడిపించారు. నేతాజీ స్థాపించిన ఐఎన్ఎ సైనికుల విచారణ నిలిపేసి విడుదల చేయాలంటూ ఉద్యమించారు. కనుక ఈ పుస్తకాన్ని ఆయన కేవలం చారిత్రక విశేషాలతోనే నింపేయకుండా సజీవ సాక్షిలా కళ్ళకు కట్టేట్టు రచించారు. నేతాజీ కుటుంబ నేపధ్యం, బాల్యం, చదువు, రంగ ప్రవేశం, వంటివి కూడా ఆసక్తికరమైన వివరాలతో పొందుపర్చారు. స్వాతంత్ర పోరాట క్రమంలో తలెత్తిన భిన్నాభిప్రాయాల ప్రాతిపదిక ఏమిటో ఎవరు ఏమన్నారో కూడా అందించే ప్రయత్నం చేస్తాం.
భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలోని అత్యంత క్లిష్టమైన దశ గురించీ, ఆ సమయంలో సుభాష్ చంద్రబోస్ నిర్వహించిన పాత్ర గురించీ, యువకులు, విద్యార్థులు, సాధారణ పాఠకులు చక్కగా అవగాహన చేసుకోవడానికి ఈ పుస్తకం దోహదపడుతుంది. సుభాష్ చంద్రబోస్ జీవితం, రచనలు, ఉపన్యాసాలు, లేఖలు మరెన్నో ఈ పుస్తకంలో లభిస్తాయి. ప్రొ.గౌతమ్ కేవలం విద్యావేత్త. మేధావి మాత్రమే గాక నాడు వంగ దేశంలో స్వాతంత్రం కోసం జరిగిన విద్యార్ధి నిరసనోధ్యమాలలో పాలు పంచుకున్న వ్యక్తి. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరశీల విద్యార్ధి ఉద్యమం కోల్కతాలో ఎంత ఉదృత రూపం దాల్చిందో ఆయన ప్రత్యక్షంగా చూశారు. నడిపించారు. నేతాజీ స్థాపించిన ఐఎన్ఎ సైనికుల విచారణ నిలిపేసి విడుదల చేయాలంటూ ఉద్యమించారు. కనుక ఈ పుస్తకాన్ని ఆయన కేవలం చారిత్రక విశేషాలతోనే నింపేయకుండా సజీవ సాక్షిలా కళ్ళకు కట్టేట్టు రచించారు. నేతాజీ కుటుంబ నేపధ్యం, బాల్యం, చదువు, రంగ ప్రవేశం, వంటివి కూడా ఆసక్తికరమైన వివరాలతో పొందుపర్చారు. స్వాతంత్ర పోరాట క్రమంలో తలెత్తిన భిన్నాభిప్రాయాల ప్రాతిపదిక ఏమిటో ఎవరు ఏమన్నారో కూడా అందించే ప్రయత్నం చేస్తాం.© 2017,www.logili.com All Rights Reserved.