టాలుస్టాయి కధలు గతంలో నేను కొన్ని చదివాను గానీ, ఆ రచయిత మీద స్పష్టంగా ఏ అభిప్రాయమూ ఏర్పడినది లేదు నిన్నటి వరకూ. మహీధర రామమోహనరావు గారు రాసిన "టాలుస్టాయి జీవితం" పుస్తకం, మా దగ్గర ఏ నాటి నుంచో వుంది. ఆ నాడే చదివి, దాన్ని ప్రత్యేకంగా జాగ్రత్త చేసి ఉంచాను. అదే ఇప్పుడు బయటపడింది. దాన్ని వెంటనే చదివితే, ఈ రచయిత గురించి ఇంకా చూడాలనిపించింది. టాలుస్టాయి నవల 'నవ జీవనం' ఏ నాడో చదివి, చదవగానే రాసి, ఒక మూల పెట్టిన వ్యాసం ఒకటి ఇప్పుడు దొరికింది. ఇప్పుడు అందులో కొత్త పేరాలు కొన్ని చేర్చాను.
"అనా కేరినినా" నవలని చాలా సంవత్సరాల కిందట చదివినప్పుడు, అప్పుడు ఆ పాత్ర చిత్రణ నాకు బొత్తిగా నచ్చలేదు. కానీ, టాలుస్టాయి మీద కనపడ్డ ఏ వ్యాసంలో అయినా, 'అనా' పాత్ర గురించి కుప్ప తెప్పల పొగడ్తలు కనపడతాయి. ఆ నవల గురించి నేనే పొరబడ్డానేమో అని, ఆ నవల చదివే పని మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నాను. ఆ నవలకి తెలుగులో, తాపీ ధర్మారావు గారి చిన్న అనువాదం ఒకటీ, ఆర్వీయార్ గారి వెయ్యి పేజీల అనువాదం ఒకటీ, దొరికాయి. అవి రెండూ ఇప్పుడు మళ్ళీ చదివాను. 'అనా' పాత్ర మీద నా వ్యతిరేకాభిప్రాయం, గతంలో కన్నా గట్టి పడింది. టాలుస్టాయి సాహిత్యం మీద కొంచెం చూడాలనిపించింది. దాన్ని 5 భాగాలుగా చేశాను. అవి ఈ పుస్తకంలో స్పష్టంగా ఉన్నాయి.
- రంగనాయకమ్మ
టాలుస్టాయి కధలు గతంలో నేను కొన్ని చదివాను గానీ, ఆ రచయిత మీద స్పష్టంగా ఏ అభిప్రాయమూ ఏర్పడినది లేదు నిన్నటి వరకూ. మహీధర రామమోహనరావు గారు రాసిన "టాలుస్టాయి జీవితం" పుస్తకం, మా దగ్గర ఏ నాటి నుంచో వుంది. ఆ నాడే చదివి, దాన్ని ప్రత్యేకంగా జాగ్రత్త చేసి ఉంచాను. అదే ఇప్పుడు బయటపడింది. దాన్ని వెంటనే చదివితే, ఈ రచయిత గురించి ఇంకా చూడాలనిపించింది. టాలుస్టాయి నవల 'నవ జీవనం' ఏ నాడో చదివి, చదవగానే రాసి, ఒక మూల పెట్టిన వ్యాసం ఒకటి ఇప్పుడు దొరికింది. ఇప్పుడు అందులో కొత్త పేరాలు కొన్ని చేర్చాను. "అనా కేరినినా" నవలని చాలా సంవత్సరాల కిందట చదివినప్పుడు, అప్పుడు ఆ పాత్ర చిత్రణ నాకు బొత్తిగా నచ్చలేదు. కానీ, టాలుస్టాయి మీద కనపడ్డ ఏ వ్యాసంలో అయినా, 'అనా' పాత్ర గురించి కుప్ప తెప్పల పొగడ్తలు కనపడతాయి. ఆ నవల గురించి నేనే పొరబడ్డానేమో అని, ఆ నవల చదివే పని మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నాను. ఆ నవలకి తెలుగులో, తాపీ ధర్మారావు గారి చిన్న అనువాదం ఒకటీ, ఆర్వీయార్ గారి వెయ్యి పేజీల అనువాదం ఒకటీ, దొరికాయి. అవి రెండూ ఇప్పుడు మళ్ళీ చదివాను. 'అనా' పాత్ర మీద నా వ్యతిరేకాభిప్రాయం, గతంలో కన్నా గట్టి పడింది. టాలుస్టాయి సాహిత్యం మీద కొంచెం చూడాలనిపించింది. దాన్ని 5 భాగాలుగా చేశాను. అవి ఈ పుస్తకంలో స్పష్టంగా ఉన్నాయి. - రంగనాయకమ్మ© 2017,www.logili.com All Rights Reserved.