శ్రీ ఆవటపల్లి నారాయణరావు తెలుగు పత్రికారంగం మూలపురుషులలో ఒకరు. జాతీయోద్యమానికి, సంస్కృతికరంగానికి మసూలాబందరు ఆటపట్టుగా ఉన్న రోజులలో అక్కడ వ్యక్తిత్వాన్ని సంతరించుకొనిన మూర్తి. తొలిగా దేశోపకారి పత్రికల ఓనమాలు నేర్చుకొని, కృష్ణాపత్రిక వ్యవస్థాపక ఉపసంపాదకునిగా ఆ పత్రికను తీర్చిదిద్దారు. సంపాదకునిగా పేరు ఎవరిదైనా 1907 వరకు కృష్ణాపత్రిక ఎదుగుదలకు నారాయణరావే కారణం. ఆంధ్రవార పత్రికకు మొట్టమొదటి సంపాదకుడు. సంవత్సరాది సంచికల ఆలోచన, రూపకల్పన నారాయణరావుదే. ఆంద్రమహాసభ కార్యకలాపాలలో కూడా చురుకుగా పాల్గొనేవారు.
బర్మా దేశంలో తెలుగు కార్మికులు పడే కష్టాలు తెలుసుకొని, అక్కడకు వెళ్లి వారి కష్టనిష్ఠూరాలలో పాల్గొని వారికి ఆప్తబంధువయ్యారు. బర్మాలో తెలుగు వారికి గుర్తింపు, శాసనసభలో సభ్యత్వం లభించిందంటే అది నారాయణరావు చలవే. విశాలాంధ్రము గ్రంథము తెలుగువారిని సాంస్కృతికంగా, రాజకీయంగా, సాంఘీకంగా ఉత్తేజపరిచిన 88 మంది మహానుభావుల పదచిత్రాలను తీర్చిదిద్దారు. నారాయణరావు 'జాను తెనుగు' వచనం, రచనాశైలి వర్దిష్టు పాత్రికేయులకు కరదీపిక. మన మరచిపోయిన ఆవటపల్లి నారాయణరావు గారిని విశాలాంధ్రము ప్రచురణ ద్వారా బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ గుర్తు చేస్తున్నది.
శ్రీ ఆవటపల్లి నారాయణరావు తెలుగు పత్రికారంగం మూలపురుషులలో ఒకరు. జాతీయోద్యమానికి, సంస్కృతికరంగానికి మసూలాబందరు ఆటపట్టుగా ఉన్న రోజులలో అక్కడ వ్యక్తిత్వాన్ని సంతరించుకొనిన మూర్తి. తొలిగా దేశోపకారి పత్రికల ఓనమాలు నేర్చుకొని, కృష్ణాపత్రిక వ్యవస్థాపక ఉపసంపాదకునిగా ఆ పత్రికను తీర్చిదిద్దారు. సంపాదకునిగా పేరు ఎవరిదైనా 1907 వరకు కృష్ణాపత్రిక ఎదుగుదలకు నారాయణరావే కారణం. ఆంధ్రవార పత్రికకు మొట్టమొదటి సంపాదకుడు. సంవత్సరాది సంచికల ఆలోచన, రూపకల్పన నారాయణరావుదే. ఆంద్రమహాసభ కార్యకలాపాలలో కూడా చురుకుగా పాల్గొనేవారు. బర్మా దేశంలో తెలుగు కార్మికులు పడే కష్టాలు తెలుసుకొని, అక్కడకు వెళ్లి వారి కష్టనిష్ఠూరాలలో పాల్గొని వారికి ఆప్తబంధువయ్యారు. బర్మాలో తెలుగు వారికి గుర్తింపు, శాసనసభలో సభ్యత్వం లభించిందంటే అది నారాయణరావు చలవే. విశాలాంధ్రము గ్రంథము తెలుగువారిని సాంస్కృతికంగా, రాజకీయంగా, సాంఘీకంగా ఉత్తేజపరిచిన 88 మంది మహానుభావుల పదచిత్రాలను తీర్చిదిద్దారు. నారాయణరావు 'జాను తెనుగు' వచనం, రచనాశైలి వర్దిష్టు పాత్రికేయులకు కరదీపిక. మన మరచిపోయిన ఆవటపల్లి నారాయణరావు గారిని విశాలాంధ్రము ప్రచురణ ద్వారా బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ గుర్తు చేస్తున్నది.© 2017,www.logili.com All Rights Reserved.