వెల్చేరు నారాయణరావు
2015 డిసెంబరులో ఆచార్య వెల్చేరు నారాయణరావుగారు కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యాన జరిగిన సభలో మండలి వెంకట కృష్ణారావు స్మారకోపన్యాసం చేశారు. ఆనాటి ప్రసంగ వ్యాసాన్ని “ఒక తెలుగు కథ” పేరిట మా కందించారు.
వెల్చేరు నారాయణరావు, పరుచూరి శ్రీనివాస్ ఆనాటి ప్రసంగవ్యాసాన్ని ఆ తరవాత ఒక పరిశోధనా వ్యాసంగా రూపొందించారు. దానిని ఇప్పుడు పుస్తకరూపంలో అందిస్తున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాము.
ఒక సాహిత్య విమర్శకుడు, ఒక పరిశోధకుడు, ఒక అనువాదకుడు, ఒక భాషా పండితుడు. ఒక భాషా సంస్కర్త, ఒక సృజనాత్మక సాహితీవేత్త ఇందరు కలిస్తే ఒక వెల్చేరు నారాయణరావు అవుతారు.
అనాదిగా మనది మౌఖిక సాహిత్యం. పాశ్చాత్య సాహిత్య విమర్శనా కొలమానాలు, విధానాలు భారతీయ సాహిత్యానికి వర్తించేవి కావని గట్టిగా విశ్వసించిన వారు నారాయణరావు. మనసాహిత్య విమర్శకు మనవైన పనిముట్లు, మనవైన కొలమానాలు, విధానాలూ కావాలనేది ఆయన మతం. మన సాహిత్య సంప్రదాయాన్ని పునరుద్ధరించుకోవాలని ఆయన కోరిక.
ఆలోచింపచేసే వచనం తెలుగులో నానాటికీ తగ్గిపోతోందని, దాన్ని నిలబెట్టుకోవలసిన అవసరం ఉందని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. వారిని అభినందించటానికి వారింటికి వెళ్లి కలిసినప్పుడు వారి ఈ వ్యాఖ్య గురించి అడిగాము. "మనం రోజూ అందరి తోనూ అనేక వాక్యాలు మాట్లాడుతుంటాం. వార్తాపత్రికలు అనేక వాక్యాలతో వార్తలు వ్రాసి ప్రచురిస్తుంటాయి. వాక్యం మనకు బాగానే ఉంది......................
వెల్చేరు నారాయణరావు 2015 డిసెంబరులో ఆచార్య వెల్చేరు నారాయణరావుగారు కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యాన జరిగిన సభలో మండలి వెంకట కృష్ణారావు స్మారకోపన్యాసం చేశారు. ఆనాటి ప్రసంగ వ్యాసాన్ని “ఒక తెలుగు కథ” పేరిట మా కందించారు. వెల్చేరు నారాయణరావు, పరుచూరి శ్రీనివాస్ ఆనాటి ప్రసంగవ్యాసాన్ని ఆ తరవాత ఒక పరిశోధనా వ్యాసంగా రూపొందించారు. దానిని ఇప్పుడు పుస్తకరూపంలో అందిస్తున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాము. ఒక సాహిత్య విమర్శకుడు, ఒక పరిశోధకుడు, ఒక అనువాదకుడు, ఒక భాషా పండితుడు. ఒక భాషా సంస్కర్త, ఒక సృజనాత్మక సాహితీవేత్త ఇందరు కలిస్తే ఒక వెల్చేరు నారాయణరావు అవుతారు. అనాదిగా మనది మౌఖిక సాహిత్యం. పాశ్చాత్య సాహిత్య విమర్శనా కొలమానాలు, విధానాలు భారతీయ సాహిత్యానికి వర్తించేవి కావని గట్టిగా విశ్వసించిన వారు నారాయణరావు. మనసాహిత్య విమర్శకు మనవైన పనిముట్లు, మనవైన కొలమానాలు, విధానాలూ కావాలనేది ఆయన మతం. మన సాహిత్య సంప్రదాయాన్ని పునరుద్ధరించుకోవాలని ఆయన కోరిక. ఆలోచింపచేసే వచనం తెలుగులో నానాటికీ తగ్గిపోతోందని, దాన్ని నిలబెట్టుకోవలసిన అవసరం ఉందని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. వారిని అభినందించటానికి వారింటికి వెళ్లి కలిసినప్పుడు వారి ఈ వ్యాఖ్య గురించి అడిగాము. "మనం రోజూ అందరి తోనూ అనేక వాక్యాలు మాట్లాడుతుంటాం. వార్తాపత్రికలు అనేక వాక్యాలతో వార్తలు వ్రాసి ప్రచురిస్తుంటాయి. వాక్యం మనకు బాగానే ఉంది......................© 2017,www.logili.com All Rights Reserved.