జీవితంలో తారసపడే మనుష్యులను, సంఘటనలను ఎన్నుకుని కథలుగా మలిచే సీనియర్ రచయిత శ్రీ రావిపల్లి నారాయణరావు గారు ఇంతవరకూ వ్రాసిన నూట ఇరవైకి పైగా కథల నుండి పద్దెనిమిది కథలను ఎన్నుకుని మూడో కథా సంపుటాన్ని తీసుకు వస్తున్నారు. వృక్షాలకు వ్రేళ్ళు ఎలా బలం చేకూరుస్తాయో, కథలకు ప్రారంభాలూ అంత బలాన్ని చేకూరుస్తాయి. పాఠకుడిని తన గుప్పిటిలోకి తీసుకోగలిగేది ప్రారంభమే. ఆ పైన బలమైన ముగింపే పాఠకుడి మదిలో దాన్ని చిరకాలం నిలబెట్టగలిగేది. నారాయణరావు గారి కలానికి ఆ రెండు లక్షణాలూ ఉన్నాయి.
సహజత్వంతో కూడిన మానసిక విశ్లేషణయినా, హాస్యంతో కూడిన వ్యంగ్యం అయినా కథలకు ప్రాణాన్ని పోస్తాయి. పాఠకుల్ని తన వెంట నిస్సందేహంగా తీసుకెళ్లగలుగుతాయి. ఈ సంపుటిలోని కథలన్నీ ఇంతకు ముందు వివిధ పత్రికల్లో ప్రచురించబడి పాఠకుల ప్రశంసలు అందుకున్నవే.
జీవితంలో తారసపడే మనుష్యులను, సంఘటనలను ఎన్నుకుని కథలుగా మలిచే సీనియర్ రచయిత శ్రీ రావిపల్లి నారాయణరావు గారు ఇంతవరకూ వ్రాసిన నూట ఇరవైకి పైగా కథల నుండి పద్దెనిమిది కథలను ఎన్నుకుని మూడో కథా సంపుటాన్ని తీసుకు వస్తున్నారు. వృక్షాలకు వ్రేళ్ళు ఎలా బలం చేకూరుస్తాయో, కథలకు ప్రారంభాలూ అంత బలాన్ని చేకూరుస్తాయి. పాఠకుడిని తన గుప్పిటిలోకి తీసుకోగలిగేది ప్రారంభమే. ఆ పైన బలమైన ముగింపే పాఠకుడి మదిలో దాన్ని చిరకాలం నిలబెట్టగలిగేది. నారాయణరావు గారి కలానికి ఆ రెండు లక్షణాలూ ఉన్నాయి. సహజత్వంతో కూడిన మానసిక విశ్లేషణయినా, హాస్యంతో కూడిన వ్యంగ్యం అయినా కథలకు ప్రాణాన్ని పోస్తాయి. పాఠకుల్ని తన వెంట నిస్సందేహంగా తీసుకెళ్లగలుగుతాయి. ఈ సంపుటిలోని కథలన్నీ ఇంతకు ముందు వివిధ పత్రికల్లో ప్రచురించబడి పాఠకుల ప్రశంసలు అందుకున్నవే.© 2017,www.logili.com All Rights Reserved.