రంగు వెలసిపోతూ వున్న గులాబీ రంగు బేనర్ ఒకటి పైనున్న అడ్డు దూలాలకు వ్రేలాడుతోంది. పై కప్పు నుండి క్రిందికి ఏర్పాటుచేసిన కడ్డీల ఆధారంగా నిర్మితమై ఉన్నాయి. అడ్డు దూలాలు. పై కప్పు మీద అద్దాలు బిగించి ఉన్నాయి. అద్దాలలో ఎక్కువ భాగం చట్రాలు విరిగిపోయో, అద్దాలు బీటలువారో ఉన్నాయి. నిర్లక్ష్యంగా బిగించబడి వుండడం వల్ల కూడా అద్దాలు పగుళ్లు ఇచ్చి ఉండాలి.
అటువంటి పగుళ్ల నుండి ఆకాశం కనిపిస్తోంది. అద్దాల చట్రాల నుండీ, వ్రేలాడే చువ్వలకు అడ్డదిడ్డంగానూ, అడ్డు దూలాల మీదుగానూ సాలెగూళ్లు అల్లుకుపోయాయి. వాటి క్రింద ఒక గడియారం ఉంది. ఆ గడియారం పెద్దది. అంకెలు కూడా పెద్దవి. పసుపు పచ్చ రేకు మీద అంకెలు నలుపుగా కనిపిస్తున్నాయి. గడియారం ముళ్లు మాత్రం లేవు.
గడియారం క్రింద నేల మీద గుంపులు గుంపులుగా ప్రయాణీకులు. వాళ్ల మొహాలు పాలిపోయి ఉన్నాయి. వాళ్లు ధరించిన వోవర్ కోట్లు జిడ్డు జిడ్డుగా ఉన్నాయి. రైలుబండి రాకకోసం వాళ్లు ఎదురుతెన్నులు చూస్తున్నారు. వాళ్ల మొహాల్లో ఆతృత.
ఎలాగైతేనేం, కిరా అఫ్గానోవా తమ గమ్యస్థానం పెట్రోగ్రాడ్ రైల్వే స్టేషన్ చేరుకుంది. ఆమె సౌకర్యవంతంగా ప్రయాణించిందనే చెప్పుకోవాలి. ఇక్కడికి చేరుకొనక ముందే ఆమె తన కూర్చుండే స్థలాన్ని రిజర్వేషన్ చేయించుకుంది... రైలుబండి బయలుదేరే చోటు నుండే తన స్థలం విషయంలో జాగ్రత్త పడింది. కాబట్టే ఆమె నిదానంగా రైల్వే స్టేషన్ భవనంలో
నిలబడింది.
పెట్రోగ్రాడ్ రైల్వేస్టేషన్ విచిత్రంగా ఉంది. ఎటువంటి కదలికా లేకుండా కిరా నిలబడిపోయి ఉంది. విలాసవంతమైన కంపార్ట్ మెంట్లో ప్రయాణించేదాని మాదిరిగా ఆమె కనిపించాలని ప్రయత్నిస్తోంది. కానీ ఆమె ప్రయత్నం ఫలించడంలేదు.
ఆమె ఒంటి మీద రంగు వెలసిపోయిన నీలం రంగు దుస్తులున్నాయి. నన్నపాటి కాళ్లు. స్టాకింగ్స్ ధరించకపోవడం వలన ఎండదెబ్బ తిని ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాళ్లు. మెడ చుట్టూ పాత సిల్కు వస్త్రం చుట్టుకుంది. పొట్టిగా కత్తిరించిన జుత్తు. తల మీద ఎప్పటి టోపీయో! రంగు వెలసిపోయింది. దానికి కాంతివంతమైన రిబ్బన్ పట్టీని అతికించింది............
రంగు వెలసిపోతూ వున్న గులాబీ రంగు బేనర్ ఒకటి పైనున్న అడ్డు దూలాలకు వ్రేలాడుతోంది. పై కప్పు నుండి క్రిందికి ఏర్పాటుచేసిన కడ్డీల ఆధారంగా నిర్మితమై ఉన్నాయి. అడ్డు దూలాలు. పై కప్పు మీద అద్దాలు బిగించి ఉన్నాయి. అద్దాలలో ఎక్కువ భాగం చట్రాలు విరిగిపోయో, అద్దాలు బీటలువారో ఉన్నాయి. నిర్లక్ష్యంగా బిగించబడి వుండడం వల్ల కూడా అద్దాలు పగుళ్లు ఇచ్చి ఉండాలి. అటువంటి పగుళ్ల నుండి ఆకాశం కనిపిస్తోంది. అద్దాల చట్రాల నుండీ, వ్రేలాడే చువ్వలకు అడ్డదిడ్డంగానూ, అడ్డు దూలాల మీదుగానూ సాలెగూళ్లు అల్లుకుపోయాయి. వాటి క్రింద ఒక గడియారం ఉంది. ఆ గడియారం పెద్దది. అంకెలు కూడా పెద్దవి. పసుపు పచ్చ రేకు మీద అంకెలు నలుపుగా కనిపిస్తున్నాయి. గడియారం ముళ్లు మాత్రం లేవు. గడియారం క్రింద నేల మీద గుంపులు గుంపులుగా ప్రయాణీకులు. వాళ్ల మొహాలు పాలిపోయి ఉన్నాయి. వాళ్లు ధరించిన వోవర్ కోట్లు జిడ్డు జిడ్డుగా ఉన్నాయి. రైలుబండి రాకకోసం వాళ్లు ఎదురుతెన్నులు చూస్తున్నారు. వాళ్ల మొహాల్లో ఆతృత. ఎలాగైతేనేం, కిరా అఫ్గానోవా తమ గమ్యస్థానం పెట్రోగ్రాడ్ రైల్వే స్టేషన్ చేరుకుంది. ఆమె సౌకర్యవంతంగా ప్రయాణించిందనే చెప్పుకోవాలి. ఇక్కడికి చేరుకొనక ముందే ఆమె తన కూర్చుండే స్థలాన్ని రిజర్వేషన్ చేయించుకుంది... రైలుబండి బయలుదేరే చోటు నుండే తన స్థలం విషయంలో జాగ్రత్త పడింది. కాబట్టే ఆమె నిదానంగా రైల్వే స్టేషన్ భవనంలో నిలబడింది. పెట్రోగ్రాడ్ రైల్వేస్టేషన్ విచిత్రంగా ఉంది. ఎటువంటి కదలికా లేకుండా కిరా నిలబడిపోయి ఉంది. విలాసవంతమైన కంపార్ట్ మెంట్లో ప్రయాణించేదాని మాదిరిగా ఆమె కనిపించాలని ప్రయత్నిస్తోంది. కానీ ఆమె ప్రయత్నం ఫలించడంలేదు. ఆమె ఒంటి మీద రంగు వెలసిపోయిన నీలం రంగు దుస్తులున్నాయి. నన్నపాటి కాళ్లు. స్టాకింగ్స్ ధరించకపోవడం వలన ఎండదెబ్బ తిని ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాళ్లు. మెడ చుట్టూ పాత సిల్కు వస్త్రం చుట్టుకుంది. పొట్టిగా కత్తిరించిన జుత్తు. తల మీద ఎప్పటి టోపీయో! రంగు వెలసిపోయింది. దానికి కాంతివంతమైన రిబ్బన్ పట్టీని అతికించింది............© 2017,www.logili.com All Rights Reserved.