నవరసాలలో ఆరోగ్యకరమైనది హాస్యరసం మాత్రమే! "నవ్వు, అనేది 'ఎరోబిక్స్' వ్యాయామం వంటిది" అని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. "ఆరోగ్యానికి మూలం నవ్వు" అని నేడు ప్రపంచమంతా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి మూల పు(త్రులు) ఋషులు మన మానసిక శాస్త్రవేత్తలే...!
"నేను ఎందుకు నవ్వుతూ వుంటానో తెలుసా...? ఏడ్వకుండా ఉండటం కోసం" అని చెప్పాడు అబ్రహాం లింకన్.
ఫారన్ లో మనసు బాగోలేకపొతే ఫోన్ ద్వారా జోకులు వినే అవకాశం వుంది. అంతేకాకుండా సంపన్న దేశాలలో నవ్వుల క్లినిక్ లు కూడా ఏర్పాటు చేసారు. "నవ్వు నవ్వించు... తద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందు" అని నొక్కి వక్కాణిస్తున్నారు పరిశోధకులు (మానసిక శాస్త్రవేత్తలు).
మనిషి ఎంత అందంగా ఉన్నా... ఆ అందానికి నవ్వు తోడు కాకపోతే ముఖం జీవశక్తి కోల్పోతుంది నవ్వుతూ ఉండే ముఖం నవనీతం వలె మెరిసిపోతుంది. నవ్వు శరీరంలో కండరాలకు ప్రశాంతతనిస్తుంది. అలసట తగ్గించి శ్వాసక్రియ బాగా పనిచేసేందుకు సహకరిస్తుంది: తద్వారా ఆక్సిజన్ రక్తంలో సమంగా సరఫరా అవుతుంది. తద్వారా మన శరీరం నిరంతరం కొత్త ఉత్సాహాన్ని... నూతన శక్తినీ నింపుకుంటుంది.
వెర్రివానికైన, రోగికైన పరమ యోగికైన, భోగికైన, విరహ బాధకైన హాస్యమే ఒక మందు. హాస్యమే ఒక టానిక్. ఆ టానిక్ సీసాలో ఉండదండి... ఇటువంటి పుస్తకంలో వుంటుంది. కాబట్టి మీరు వెంటనే ఈ టానిక్ త్రాగండి! చదవండి! నవ్వండి! హాయిగా నవ్వండి! ఎక్కువగా నవ్వండి... పగలబడి నవ్వండి... విరగబడి నవ్వండి... వీలయితే వీర నవ్వులు నవ్వండి(దుర్యోధనుడి టైపులో) మీ నరాలన్నీ ఇంజక్షన్ చేసినట్లు జివ్వున లాగుతాయ్: మీ మనసు "కీ" ఇచ్చిన 'వాల్ క్లాక్' వలె కొట్టుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ప్రతిరోజూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటే "అదే మంచి వ్యాయామం..." అంటారు శాస్త్రవేత్తలు.
- డి. శ్రీనివాస్ కృష్ణ
నవరసాలలో ఆరోగ్యకరమైనది హాస్యరసం మాత్రమే! "నవ్వు, అనేది 'ఎరోబిక్స్' వ్యాయామం వంటిది" అని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. "ఆరోగ్యానికి మూలం నవ్వు" అని నేడు ప్రపంచమంతా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి మూల పు(త్రులు) ఋషులు మన మానసిక శాస్త్రవేత్తలే...! "నేను ఎందుకు నవ్వుతూ వుంటానో తెలుసా...? ఏడ్వకుండా ఉండటం కోసం" అని చెప్పాడు అబ్రహాం లింకన్. ఫారన్ లో మనసు బాగోలేకపొతే ఫోన్ ద్వారా జోకులు వినే అవకాశం వుంది. అంతేకాకుండా సంపన్న దేశాలలో నవ్వుల క్లినిక్ లు కూడా ఏర్పాటు చేసారు. "నవ్వు నవ్వించు... తద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందు" అని నొక్కి వక్కాణిస్తున్నారు పరిశోధకులు (మానసిక శాస్త్రవేత్తలు). మనిషి ఎంత అందంగా ఉన్నా... ఆ అందానికి నవ్వు తోడు కాకపోతే ముఖం జీవశక్తి కోల్పోతుంది నవ్వుతూ ఉండే ముఖం నవనీతం వలె మెరిసిపోతుంది. నవ్వు శరీరంలో కండరాలకు ప్రశాంతతనిస్తుంది. అలసట తగ్గించి శ్వాసక్రియ బాగా పనిచేసేందుకు సహకరిస్తుంది: తద్వారా ఆక్సిజన్ రక్తంలో సమంగా సరఫరా అవుతుంది. తద్వారా మన శరీరం నిరంతరం కొత్త ఉత్సాహాన్ని... నూతన శక్తినీ నింపుకుంటుంది. వెర్రివానికైన, రోగికైన పరమ యోగికైన, భోగికైన, విరహ బాధకైన హాస్యమే ఒక మందు. హాస్యమే ఒక టానిక్. ఆ టానిక్ సీసాలో ఉండదండి... ఇటువంటి పుస్తకంలో వుంటుంది. కాబట్టి మీరు వెంటనే ఈ టానిక్ త్రాగండి! చదవండి! నవ్వండి! హాయిగా నవ్వండి! ఎక్కువగా నవ్వండి... పగలబడి నవ్వండి... విరగబడి నవ్వండి... వీలయితే వీర నవ్వులు నవ్వండి(దుర్యోధనుడి టైపులో) మీ నరాలన్నీ ఇంజక్షన్ చేసినట్లు జివ్వున లాగుతాయ్: మీ మనసు "కీ" ఇచ్చిన 'వాల్ క్లాక్' వలె కొట్టుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ప్రతిరోజూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటే "అదే మంచి వ్యాయామం..." అంటారు శాస్త్రవేత్తలు. - డి. శ్రీనివాస్ కృష్ణ
© 2017,www.logili.com All Rights Reserved.