సమాజాన్ని ముందుండి నడిపిస్తున్న
మహిళా అధికారుల అంతరంగం
‘ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దారనేర్పించినన్’ అన్నాడు ఒక కవి. ఇది ఒకప్పటిమాట. ఇప్పుడు ఎవ్వరూ
నేర్పించవలసిన అవసరం లేదు. తమంత తాముగానే మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు.
అన్ని రకాల వృతి విద్యలలోను, రాజకీయాల్లోనూ , ప్రభుత్వోద్యోగాల్లోను , వ్యాపార నిర్వహణ ల్లోనూ, సంస్థల యాజమాన్యం లొనూ తమ స్వీయ వ్యక్తిత్వాన్ని , ప్రావీణ్యాన్ని చూపిస్తున్నారు .
'ఆకాశంలో సగం ' అన్న ఉక్తిని సార్ధకం చేస్తున్నారు . తలుచుకుంటే తాము అందుకోలేనిదేమి లేదని నిరూపిస్తున్నారు .
ఆకాశమే తమకు హద్దని ఘోషిస్తున్నారు. ముందుండి సమాజాన్ని నడిపిస్తూ , యువతరానికి ఆదర్శంగా నిలుస్తూ , విజయపధంలో నడుస్తూ స్పూర్తి దాయినులయిన మహిళా శిరోమణుల విజయగాధలివి . చదవండి . చదివించండి .