అనంతం
నేను ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చానో నాకు తెలియదు.
తర్వాత కాలంలో చూశాను గుడ్లను పగలగొట్టుకుని బయటకు వస్తున్న నా జాతి సోదర, సోదరీమణులు ఎందర్ని.
ఒకప్పుడు మా పుట్టలో మేం చాలా మందిని కలిసి బతికాం. ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళం. మా పుట్టలో చాలా కన్నాలుండేవి. ఓసారి మేమందరం కలిసి అన్ని కన్నాల పొండి ఒకేసారి తలలు బయట పెట్టి ఆకాశాన్ని చూడాలనుకున్నాం. అప్పటి కింకా మా
చాపల్యం తీరలేదు. మాతో పాటు యువపాములు, వృద్ధపాములు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఎన్ని కన్నాలున్నాయో నాకు ఇప్పుడు గుర్తులేదు. మేమందరం ఒకేసారి అలా మా తలల్ని బయట పెట్టి ప్రకృతిని చూడటం అనేది నా జీవితంలో మరపురాని జ్ఞాపకం. అదో అద్భుతమైన రోజు.
సంవత్సరాలు గడిచిపోయాయి. మళ్లీ అలా ఉమ్మడిగా ప్రకృతిని చూడాలనుకున్న మా కోర్కె మాత్రం తీరలేదు. ఇక ముందు తీరుతుందనే నమ్మకం లేదు. నాకు సర్ప ప్రపంచం గురించి అవగాహన వస్తున్న తొలి రోజుల్లో నా జ్ఞానం చాలా ప్రాథమికంగా వుండేది. తర్వాతి కాలంలో ఆ దశలోనే వుండిపోతే ఎంత బాగుండేది అనిపించేది.
సర్పాలన్నీ ఒకే జాతి అని నేను అనుకునేదాన్ని. తర్వాత తెలిసింది. మాలో రకరకాల తెగలు వున్నాయని. ఒక్కో రకం పాములకి ఒక్కో రంగు, రూపం, కొన్ని ప్రత్యేక లక్షణాలు వుండేవి. వేటికవి తమను తాము ప్రత్యేక జాతిగానే భావించేవి.
మమ్మల్ని త్రాచుపాములు అంటారని అప్పుడే తెలిసింది. మాలోనూ విభిన్న వర్ణాలున్నాయి. గోధుమ వర్ణం, నలుపు యింకా రకరకాల ఛాయలు వుండేవి. మా జాతి సర్పాల్లో కొన్నింటి తలల మీద మణులు కూడా వుండేవని చెప్పుకునేవారు. అయితే | అలాంటి వాటిని నేనెప్పుడూ చూడలేదు. ఏమైనా మాకో ప్రత్యేకత వుండేది. మేం |..........................
అనంతం నేను ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చానో నాకు తెలియదు. తర్వాత కాలంలో చూశాను గుడ్లను పగలగొట్టుకుని బయటకు వస్తున్న నా జాతి సోదర, సోదరీమణులు ఎందర్ని. ఒకప్పుడు మా పుట్టలో మేం చాలా మందిని కలిసి బతికాం. ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళం. మా పుట్టలో చాలా కన్నాలుండేవి. ఓసారి మేమందరం కలిసి అన్ని కన్నాల పొండి ఒకేసారి తలలు బయట పెట్టి ఆకాశాన్ని చూడాలనుకున్నాం. అప్పటి కింకా మా చాపల్యం తీరలేదు. మాతో పాటు యువపాములు, వృద్ధపాములు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఎన్ని కన్నాలున్నాయో నాకు ఇప్పుడు గుర్తులేదు. మేమందరం ఒకేసారి అలా మా తలల్ని బయట పెట్టి ప్రకృతిని చూడటం అనేది నా జీవితంలో మరపురాని జ్ఞాపకం. అదో అద్భుతమైన రోజు. సంవత్సరాలు గడిచిపోయాయి. మళ్లీ అలా ఉమ్మడిగా ప్రకృతిని చూడాలనుకున్న మా కోర్కె మాత్రం తీరలేదు. ఇక ముందు తీరుతుందనే నమ్మకం లేదు. నాకు సర్ప ప్రపంచం గురించి అవగాహన వస్తున్న తొలి రోజుల్లో నా జ్ఞానం చాలా ప్రాథమికంగా వుండేది. తర్వాతి కాలంలో ఆ దశలోనే వుండిపోతే ఎంత బాగుండేది అనిపించేది. సర్పాలన్నీ ఒకే జాతి అని నేను అనుకునేదాన్ని. తర్వాత తెలిసింది. మాలో రకరకాల తెగలు వున్నాయని. ఒక్కో రకం పాములకి ఒక్కో రంగు, రూపం, కొన్ని ప్రత్యేక లక్షణాలు వుండేవి. వేటికవి తమను తాము ప్రత్యేక జాతిగానే భావించేవి. మమ్మల్ని త్రాచుపాములు అంటారని అప్పుడే తెలిసింది. మాలోనూ విభిన్న వర్ణాలున్నాయి. గోధుమ వర్ణం, నలుపు యింకా రకరకాల ఛాయలు వుండేవి. మా జాతి సర్పాల్లో కొన్నింటి తలల మీద మణులు కూడా వుండేవని చెప్పుకునేవారు. అయితే | అలాంటి వాటిని నేనెప్పుడూ చూడలేదు. ఏమైనా మాకో ప్రత్యేకత వుండేది. మేం |..........................© 2017,www.logili.com All Rights Reserved.