మీ చేతుల్లో ఉన్న ఈ "అలివేణి ఆణిముత్యమా" నాకెంతో ఆనందాన్నిచ్చింది. అప్పుడే పేగుతెంచుకున్న పసికందును చూసుకుని పచ్చిబాలింత సంబరపడ్డట్టుంది ఇప్పటి నా స్థితి. అమ్మేలేనిక్, ఆడపిల్లలేని, మహిళల ప్రమేయంలేని లోకం అసలు లోకమే కాదు. ఎందరో అడకూతుళ్లు ఈ సమాజం కోసం, దీని క్షేమం కోసం నేల నలుచెరగులా పాటుపడుతున్నారు. వీళ్ళంతా సామాన్యులే. కానీ అసమానమైన సేవలు చేస్తున్నారు.
రెండు కాళ్ళు పోలియో మింగేసినా బెంగపడకుండా తోటివారి ఉన్నతికి తపిస్తున్న సత్యమ్మ ఈ పుస్తకంలో కనిపిస్తుంది. సైకిల్ రిపేర్లు చేస్తూ తల్లిదండ్రులకు కొడుకులేని లోటుతీరుస్తున్న చిన్నారి అగుపడుతుంది. తాగుడుకు జనాన్ని దూరం చేసే ఆలోచనతో శ్రమపడుతున్న ఉమమ్మ దర్శనమిస్తుంది. వీళ్ళంతా రేపటి యుగానికి సారధులు. వీరి జీవితాలు పదుగురికి ప్రేరణనిస్తాయి. సజ్జనుల జీవితాన్ని చదివినా, విన్నా నవోదయమే. అందుకే ఈ పుస్తకం.
..... చింతకింది శ్రీనివాస రావు
మీ చేతుల్లో ఉన్న ఈ "అలివేణి ఆణిముత్యమా" నాకెంతో ఆనందాన్నిచ్చింది. అప్పుడే పేగుతెంచుకున్న పసికందును చూసుకుని పచ్చిబాలింత సంబరపడ్డట్టుంది ఇప్పటి నా స్థితి. అమ్మేలేనిక్, ఆడపిల్లలేని, మహిళల ప్రమేయంలేని లోకం అసలు లోకమే కాదు. ఎందరో అడకూతుళ్లు ఈ సమాజం కోసం, దీని క్షేమం కోసం నేల నలుచెరగులా పాటుపడుతున్నారు. వీళ్ళంతా సామాన్యులే. కానీ అసమానమైన సేవలు చేస్తున్నారు. రెండు కాళ్ళు పోలియో మింగేసినా బెంగపడకుండా తోటివారి ఉన్నతికి తపిస్తున్న సత్యమ్మ ఈ పుస్తకంలో కనిపిస్తుంది. సైకిల్ రిపేర్లు చేస్తూ తల్లిదండ్రులకు కొడుకులేని లోటుతీరుస్తున్న చిన్నారి అగుపడుతుంది. తాగుడుకు జనాన్ని దూరం చేసే ఆలోచనతో శ్రమపడుతున్న ఉమమ్మ దర్శనమిస్తుంది. వీళ్ళంతా రేపటి యుగానికి సారధులు. వీరి జీవితాలు పదుగురికి ప్రేరణనిస్తాయి. సజ్జనుల జీవితాన్ని చదివినా, విన్నా నవోదయమే. అందుకే ఈ పుస్తకం. ..... చింతకింది శ్రీనివాస రావు© 2017,www.logili.com All Rights Reserved.