ముందుమాట
మాటే మంత్రమై ఉన్నత శిఖరాన్ని అందుకున్న శ్రీనివాసరావు
- అంపశయ్య నవీన్
(కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత) ఇది బారు శ్రీనివాసరావు రాసిన ఆత్మకథ.
"1983 జూలైలో ప్రారంభించిన ఐటీ ప్రయాణం మూడున్నర దశాబ్దాలు పూర్తి చేసుకుంది. కాస్త అటూ ఇటూగా వచ్చే రెండు - అయిదు ఏళ్ళ వ్యవధిలో తిల్లానా పాడి ఈ ప్రయాణాన్ని ముగిస్తానని నా నమ్మకం. దేశంలోని ఓ మూల ఉన్న వరంగల్ లాంటి పట్టణంలో, తెలుగు మీడియంలో, చెట్ల క్రింద కూర్చుని సాగించిన చదువుతో ఒక బహుళజాతి కంపెనీలో ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం నుంచి నా విరమణ జరుగుతుందని నేను ఊహించని విషయం. స్కూటర్ కొనుక్కొని, హైదరాబాదులో ఉద్యోగం చెయ్యాలని కలలుగన్న నేను, అమెరికాలో ఉద్యోగపర్వం ముగించటం నిజంగా ఆశ్చర్యకరం. మన రాష్ట్రం, మనదేశం, ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా అభిరుచి ఉన్నంతవరకు ఉన్నత విద్యను ప్రోత్సహించడం దీనికి ప్రప్రథమ కారణం” అంటాడు శ్రీనివాసరావు తన ఆత్మకథను మొదలెడ్తూ.
ఐటీ రంగంలో చిన్న ఉద్యోగంతో ప్రారంభమైన శ్రీనివాసరావు జీవితం అంచెలంచెలుగా ఎదిగి చాలా పెద్ద ఉద్యోగిగా మారి, ప్రారంభంలో సంపాదించిన దానికంటే కొన్ని వెయ్యిరెట్లు ఎక్కువగా సంపాదించటం సామాన్య విషయం కాదు.
మనదేశంలో 1980 నుంచి మొదలైన ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) రంగం ఇవ్వాళ్ళ ఎవరూ ఊహించనంత వేగంగా విస్తరించింది. 1980లో దాదాపు 4 వేల మంది మాత్రమే పనిచేసే ఐటీ రంగంలో నేడు ప్రత్యక్షంగా 40 లక్షల మంది, పరోక్షంగా 1.5 కోట మంది పనిచేస్తున్నారని శ్రీనివాసరావు చెబుతున్నాడు.............
ముందుమాట మాటే మంత్రమై ఉన్నత శిఖరాన్ని అందుకున్న శ్రీనివాసరావు - అంపశయ్య నవీన్ (కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత) ఇది బారు శ్రీనివాసరావు రాసిన ఆత్మకథ. "1983 జూలైలో ప్రారంభించిన ఐటీ ప్రయాణం మూడున్నర దశాబ్దాలు పూర్తి చేసుకుంది. కాస్త అటూ ఇటూగా వచ్చే రెండు - అయిదు ఏళ్ళ వ్యవధిలో తిల్లానా పాడి ఈ ప్రయాణాన్ని ముగిస్తానని నా నమ్మకం. దేశంలోని ఓ మూల ఉన్న వరంగల్ లాంటి పట్టణంలో, తెలుగు మీడియంలో, చెట్ల క్రింద కూర్చుని సాగించిన చదువుతో ఒక బహుళజాతి కంపెనీలో ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం నుంచి నా విరమణ జరుగుతుందని నేను ఊహించని విషయం. స్కూటర్ కొనుక్కొని, హైదరాబాదులో ఉద్యోగం చెయ్యాలని కలలుగన్న నేను, అమెరికాలో ఉద్యోగపర్వం ముగించటం నిజంగా ఆశ్చర్యకరం. మన రాష్ట్రం, మనదేశం, ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా అభిరుచి ఉన్నంతవరకు ఉన్నత విద్యను ప్రోత్సహించడం దీనికి ప్రప్రథమ కారణం” అంటాడు శ్రీనివాసరావు తన ఆత్మకథను మొదలెడ్తూ. ఐటీ రంగంలో చిన్న ఉద్యోగంతో ప్రారంభమైన శ్రీనివాసరావు జీవితం అంచెలంచెలుగా ఎదిగి చాలా పెద్ద ఉద్యోగిగా మారి, ప్రారంభంలో సంపాదించిన దానికంటే కొన్ని వెయ్యిరెట్లు ఎక్కువగా సంపాదించటం సామాన్య విషయం కాదు. మనదేశంలో 1980 నుంచి మొదలైన ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) రంగం ఇవ్వాళ్ళ ఎవరూ ఊహించనంత వేగంగా విస్తరించింది. 1980లో దాదాపు 4 వేల మంది మాత్రమే పనిచేసే ఐటీ రంగంలో నేడు ప్రత్యక్షంగా 40 లక్షల మంది, పరోక్షంగా 1.5 కోట మంది పనిచేస్తున్నారని శ్రీనివాసరావు చెబుతున్నాడు.............© 2017,www.logili.com All Rights Reserved.