అందమైన పాలరాతి బొమ్మకి ప్రాణం వచ్చినట్టుగా, పాల నురగ లాంటి తెల్లటి దుస్తులతో, మెల్లగా మెట్లుదిగి వస్తున్న ప్రీతి చేతిలో నవనవలాడుతున్న పసుపు పచ్చటి గులాబి పువ్వు ఉంది. క్రింద హాలులో పార్టీకి వచ్చిన ఆహుతులందరి కళ్ళూ ఆ అమ్మాయి మీదనే నిలిచినా, తన కళ్ళు మాత్రం ఎవరికోసమో వెతుకుతున్నట్టుగా చూస్తున్నాయి. ప్రీతి పాదం ఆఖరి మెట్టుమీదకు రాగానే శరత్ చంద్ర అక్కడికి వచ్చాడు. ప్రీతి క్షణం సేపు తదేకంగా అతన్ని చూసింది. ఆ తర్వాత చేతిలో గులాబి అతనికి అందిస్తూ తగ్గు స్వరంతో "మీ ఉత్తరానికి జవాబు ఇదే!" అంది. మగసిరి నిండిన అతని చేతివేలు ఆ పువ్వుని అందుకున్నాయి. "థ్యాంక్ యూ" అతను అస్పష్టంగా అన్నాడు. ప్రీతి ఆ పువ్వుని వదలలేదు. అతనివైపే చూస్తోంది. అతను కూడా ప్రీతి వైపే చూస్తున్నాడు.
"మీరు వచ్చిన తర్వాత నాకీ ప్రపంచం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది." ఆమె కళ్ళు మూగగా చెబుతున్నాయి. "నువ్వు వచ్చిన తర్వాత నాకు జీవితం మీద మమకారం పెరిగింది. వేయి సంవత్సరాలు బ్రతికినా తనివి తీరదేమో అనిపిస్తోంది." అతని కళ్ళు మౌనంగా, ఆర్తిగా వెల్లడి చేస్తున్నాయి. దూరం నుండి ఒక వయసుమళ్ళిన వ్యక్తి వీళ్ళిద్దరినీ రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అతని ముఖం నిండా దెబ్బలు తగిలి మానినట్లుగా గాట్లు, మచ్చలు ఉన్నాయి. మొరటుగా ఉన్న అతని పెదవులమీద క్రూరమైన చిరునవ్వు మెదిలింది. ఆ నవ్వు అతని ముఖంలో ఉన్న భీకరత్వాన్ని రెట్టింపు చేసింది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
అందమైన పాలరాతి బొమ్మకి ప్రాణం వచ్చినట్టుగా, పాల నురగ లాంటి తెల్లటి దుస్తులతో, మెల్లగా మెట్లుదిగి వస్తున్న ప్రీతి చేతిలో నవనవలాడుతున్న పసుపు పచ్చటి గులాబి పువ్వు ఉంది. క్రింద హాలులో పార్టీకి వచ్చిన ఆహుతులందరి కళ్ళూ ఆ అమ్మాయి మీదనే నిలిచినా, తన కళ్ళు మాత్రం ఎవరికోసమో వెతుకుతున్నట్టుగా చూస్తున్నాయి. ప్రీతి పాదం ఆఖరి మెట్టుమీదకు రాగానే శరత్ చంద్ర అక్కడికి వచ్చాడు. ప్రీతి క్షణం సేపు తదేకంగా అతన్ని చూసింది. ఆ తర్వాత చేతిలో గులాబి అతనికి అందిస్తూ తగ్గు స్వరంతో "మీ ఉత్తరానికి జవాబు ఇదే!" అంది. మగసిరి నిండిన అతని చేతివేలు ఆ పువ్వుని అందుకున్నాయి. "థ్యాంక్ యూ" అతను అస్పష్టంగా అన్నాడు. ప్రీతి ఆ పువ్వుని వదలలేదు. అతనివైపే చూస్తోంది. అతను కూడా ప్రీతి వైపే చూస్తున్నాడు. "మీరు వచ్చిన తర్వాత నాకీ ప్రపంచం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది." ఆమె కళ్ళు మూగగా చెబుతున్నాయి. "నువ్వు వచ్చిన తర్వాత నాకు జీవితం మీద మమకారం పెరిగింది. వేయి సంవత్సరాలు బ్రతికినా తనివి తీరదేమో అనిపిస్తోంది." అతని కళ్ళు మౌనంగా, ఆర్తిగా వెల్లడి చేస్తున్నాయి. దూరం నుండి ఒక వయసుమళ్ళిన వ్యక్తి వీళ్ళిద్దరినీ రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అతని ముఖం నిండా దెబ్బలు తగిలి మానినట్లుగా గాట్లు, మచ్చలు ఉన్నాయి. మొరటుగా ఉన్న అతని పెదవులమీద క్రూరమైన చిరునవ్వు మెదిలింది. ఆ నవ్వు అతని ముఖంలో ఉన్న భీకరత్వాన్ని రెట్టింపు చేసింది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.