స్పెషల్ వార్డులో ఉన్న గది తలుపులు నిశ్శబ్దంగా తెరుచుకున్నాయి. అవంతి లోపలకు అడుగుపెట్టింది! గదిలో మంచం మీద తరుణ్ నిద్రలో ఉన్నాడు. అతని రెండు చేతులు మణికట్టు దగ్గర కట్టు కట్టి ఉన్నాయి. వాటిని చూడగానే, అవంతి కళ్ళనుంచి నీళ్ళు జలజలా రాలినాయి! నిన్న "ఇదేమిటి?" అని తను అడిగినందుకు 'జవాబు'గా అతను మణి కట్ల దగ్గర నరాలు బ్లేడుతో కోసుకుని చచ్చిపోవటానికి సిద్ధం అయ్యాడు. అవంతి పరుగెత్తి మంచం దగ్గర మోకాలి మీద కూలబడి అతని చేతి దగ్గర తల దాచుకుంది. తరుణ్ కి మెలకువ వచ్చింది. "అవంతీ! నీకు... నీకు.. కృష్ణలోహిత... అంటే తెలుసా?" అన్నాడు అస్పష్టంగా.
తెలియదన్నట్టు తల తిప్పింది. "కృష్ణలోహిత.. అంటే నలుపు వర్ణం కలిసిన ఎరుపురంగు. నలుపు అంటే చీకటి. శూన్యం! ఎరుపు అంటే రక్తం! హత్య. నా మనసు ఈ రెండింటిలో ఎటు వెళ్ళాలో తెలియక కొట్టుమిట్టాడుతోంది. నాకు మూడో దోవ లేదు. లేదు అవంతీ.." ఇది వినగానే, నీళ్ళునిండిన అవనతి కళ్ళలో ఆశ్చర్యం. అయోమయం. భయం. ఏమిటి దీని అర్థం. ఆంధ్రుల ఆరాధ్య రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి మరో నవలా రాజం 'కృష్ణలోహిత' తప్పక చదవండి!
స్పెషల్ వార్డులో ఉన్న గది తలుపులు నిశ్శబ్దంగా తెరుచుకున్నాయి. అవంతి లోపలకు అడుగుపెట్టింది! గదిలో మంచం మీద తరుణ్ నిద్రలో ఉన్నాడు. అతని రెండు చేతులు మణికట్టు దగ్గర కట్టు కట్టి ఉన్నాయి. వాటిని చూడగానే, అవంతి కళ్ళనుంచి నీళ్ళు జలజలా రాలినాయి! నిన్న "ఇదేమిటి?" అని తను అడిగినందుకు 'జవాబు'గా అతను మణి కట్ల దగ్గర నరాలు బ్లేడుతో కోసుకుని చచ్చిపోవటానికి సిద్ధం అయ్యాడు. అవంతి పరుగెత్తి మంచం దగ్గర మోకాలి మీద కూలబడి అతని చేతి దగ్గర తల దాచుకుంది. తరుణ్ కి మెలకువ వచ్చింది. "అవంతీ! నీకు... నీకు.. కృష్ణలోహిత... అంటే తెలుసా?" అన్నాడు అస్పష్టంగా. తెలియదన్నట్టు తల తిప్పింది. "కృష్ణలోహిత.. అంటే నలుపు వర్ణం కలిసిన ఎరుపురంగు. నలుపు అంటే చీకటి. శూన్యం! ఎరుపు అంటే రక్తం! హత్య. నా మనసు ఈ రెండింటిలో ఎటు వెళ్ళాలో తెలియక కొట్టుమిట్టాడుతోంది. నాకు మూడో దోవ లేదు. లేదు అవంతీ.." ఇది వినగానే, నీళ్ళునిండిన అవనతి కళ్ళలో ఆశ్చర్యం. అయోమయం. భయం. ఏమిటి దీని అర్థం. ఆంధ్రుల ఆరాధ్య రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి మరో నవలా రాజం 'కృష్ణలోహిత' తప్పక చదవండి!© 2017,www.logili.com All Rights Reserved.