మన తెలుగు వాళ్ళలో అత్యధికులు ఆపస్తంబసుత్రజులే. వారి షోడశ సంస్కారాలు ఈ పద్దతిలోనే జరుగుతున్నాయి. కేవలము వేడుకలు - విందులు - వినోదాలతోనే కాక ఆయా సంస్కారాల ప్రాధాన్యాన్ని తెలుగు తాత్పర్యంతో అందించాలనుకున్నాము. మా ప్రార్ధనను అంగీకరించి, అపస్తంబ గృహ్య, ధర్మసూత్రములకు తాత్పర్యమును సులభమైన భాషలో అందించిన డా.నల్లంతిఘల్ లక్ష్మి నరసింహాచార్యస్వామి వారికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.
అప్తసంబ గృహ్యసూత్రమంటే.....
ఈ దేశంలో మానవునికి సంబంధించిన ఏ కర్మయైనా మంత్రపూతంగా చేయబడుతుంది. మంత్రాల వల్ల శరీరానికి మనస్సుకు సంస్కరామేర్పడుతుంది. అందువలననే తల్లి కడుపులో ప్రవేశించిననాటి నుండి మానవుడు చనిపోయే వరకూ చేసే పదునారు కర్మలను షోడశ సంస్కరాలంటూ మనవారు పిలిచినారు. కాలక్రమంగా అవి వేడుకలుగా మారినాయి.
మన పూర్వ ఋషులు సంస్కారాన్ని(అది సీమంతమైనా, నామకరణమైనా, పుట్టు వెంట్రుకలైనా, గురువు దగ్గరకు పంపించే ఉపనయనమైనా, వివాహమైనా) ఏవిధంగా చేయాలి. ఏ ఏ వేద మంత్రాలనుచ్చరిస్తూ చేయాలి అనే విధానాన్ని సంక్షేపంగా(సూత్రాల రూపేణా) తెలియజేసినారు. వేదాల పట్ల, ఋషుల పట్ల గౌరవభావంతో నేటికినీ కొన్నిటిని మనం అనుసరిస్తున్నాం. ఈ విధంగా తప్పక ఆచరింపవలసిన షోడశ సంస్కరాణలను తాత్పర్యముతో వివరణగా ఇచ్చియున్నారు.
- కె.వి.సుందరాచార్యులు
మన తెలుగు వాళ్ళలో అత్యధికులు ఆపస్తంబసుత్రజులే. వారి షోడశ సంస్కారాలు ఈ పద్దతిలోనే జరుగుతున్నాయి. కేవలము వేడుకలు - విందులు - వినోదాలతోనే కాక ఆయా సంస్కారాల ప్రాధాన్యాన్ని తెలుగు తాత్పర్యంతో అందించాలనుకున్నాము. మా ప్రార్ధనను అంగీకరించి, అపస్తంబ గృహ్య, ధర్మసూత్రములకు తాత్పర్యమును సులభమైన భాషలో అందించిన డా.నల్లంతిఘల్ లక్ష్మి నరసింహాచార్యస్వామి వారికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అప్తసంబ గృహ్యసూత్రమంటే..... ఈ దేశంలో మానవునికి సంబంధించిన ఏ కర్మయైనా మంత్రపూతంగా చేయబడుతుంది. మంత్రాల వల్ల శరీరానికి మనస్సుకు సంస్కరామేర్పడుతుంది. అందువలననే తల్లి కడుపులో ప్రవేశించిననాటి నుండి మానవుడు చనిపోయే వరకూ చేసే పదునారు కర్మలను షోడశ సంస్కరాలంటూ మనవారు పిలిచినారు. కాలక్రమంగా అవి వేడుకలుగా మారినాయి. మన పూర్వ ఋషులు సంస్కారాన్ని(అది సీమంతమైనా, నామకరణమైనా, పుట్టు వెంట్రుకలైనా, గురువు దగ్గరకు పంపించే ఉపనయనమైనా, వివాహమైనా) ఏవిధంగా చేయాలి. ఏ ఏ వేద మంత్రాలనుచ్చరిస్తూ చేయాలి అనే విధానాన్ని సంక్షేపంగా(సూత్రాల రూపేణా) తెలియజేసినారు. వేదాల పట్ల, ఋషుల పట్ల గౌరవభావంతో నేటికినీ కొన్నిటిని మనం అనుసరిస్తున్నాం. ఈ విధంగా తప్పక ఆచరింపవలసిన షోడశ సంస్కరాణలను తాత్పర్యముతో వివరణగా ఇచ్చియున్నారు. - కె.వి.సుందరాచార్యులు© 2017,www.logili.com All Rights Reserved.