విలువలు నశించిపోతూ, నిజాయతీ కృశించి పోతూ డబ్బుకు, సంపదకూ తప్ప, మానవీయ విలువలకు చోటు లేకుండాపోతున్న ఈ తరుణంలో జ్ఞానపదానికి దారులు వేసే భారతీయ జానపద కధా ప్రతిబింబాలు ఈ సంపుటిలో అందిస్తున్నారు. ఇవి ఈ తరం బాలబాలికలకు, యువకులకు సరైన దిశానిర్దేశం చేయగలవన్న ప్రగాఢవిశ్వాసంతో 'ఎమెస్కో' వీటిని వెలువరిస్తోంది.
- డా. దేవరాజు మహారాజు.
ప్రఖ్యాతి కవి, కధారచయిత, నాటకకర్త, అనువాదకుడు, కాలమిస్ట్, పాపులర్ సైన్స్ రచయిత డాక్టర్ దేవరాజు మహారాజు. కవిగా అర్ధశతాబ్ది (1960 - 2010) పూర్తి చేసుకున్న నిత్య కృషీవలుడు. తెలంగాణా ప్రజల భాషలో కవిత, కధ, చెప్పి, మెప్పించారు. తెలుగు అకాడమీ పుస్తకాలకు రచయితగా, సంపాదకులుగా వ్యవహరించారు. నేషనల్ బుక్ ట్రస్ట్ - న్యూడిల్లీ వారికి దశాబ్ద కాలంపాటు సలహా సంఘసభ్యులు. ప్రాంతీయ స్థాయి దాకా ఎన్నోసార్లు ఎన్నో సాహిత్య అవార్డులకు జ్యూరీ మెంబర్ గా వ్యవహరించారు. వివిధ ప్రక్రియల్లో ఇప్పటివరకు నలబైకీ పైగా పుస్తకాలు ప్రకటించారు. మంచి ముత్యం (జాన్ స్టెయిన్ బెక్ నవల) మధుశాల (హరివంశ్ రాయ్ బచ్చన్ కావ్యం) ఆరుబయట ఆకాశం కోసం (భారతీయ భాషల్లో స్త్రీవాద కధలు) కవితాభారతి (భారతీయ కవిత్వం) మట్టి గుండె చప్పుళ్ళు(మరాఠీ దళిత కవిత్వం) నీకూ నాకూ మధ్య ఒక రంగులనది (ప్రపంచ కవిత్వం) తెలుగులో వెలువరించి తెలుగు సాహితీ లోకానికి ఎనలేని సేవా చేశారు.
- రచయిత గురించి
విలువలు నశించిపోతూ, నిజాయతీ కృశించి పోతూ డబ్బుకు, సంపదకూ తప్ప, మానవీయ విలువలకు చోటు లేకుండాపోతున్న ఈ తరుణంలో జ్ఞానపదానికి దారులు వేసే భారతీయ జానపద కధా ప్రతిబింబాలు ఈ సంపుటిలో అందిస్తున్నారు. ఇవి ఈ తరం బాలబాలికలకు, యువకులకు సరైన దిశానిర్దేశం చేయగలవన్న ప్రగాఢవిశ్వాసంతో 'ఎమెస్కో' వీటిని వెలువరిస్తోంది. - డా. దేవరాజు మహారాజు. ప్రఖ్యాతి కవి, కధారచయిత, నాటకకర్త, అనువాదకుడు, కాలమిస్ట్, పాపులర్ సైన్స్ రచయిత డాక్టర్ దేవరాజు మహారాజు. కవిగా అర్ధశతాబ్ది (1960 - 2010) పూర్తి చేసుకున్న నిత్య కృషీవలుడు. తెలంగాణా ప్రజల భాషలో కవిత, కధ, చెప్పి, మెప్పించారు. తెలుగు అకాడమీ పుస్తకాలకు రచయితగా, సంపాదకులుగా వ్యవహరించారు. నేషనల్ బుక్ ట్రస్ట్ - న్యూడిల్లీ వారికి దశాబ్ద కాలంపాటు సలహా సంఘసభ్యులు. ప్రాంతీయ స్థాయి దాకా ఎన్నోసార్లు ఎన్నో సాహిత్య అవార్డులకు జ్యూరీ మెంబర్ గా వ్యవహరించారు. వివిధ ప్రక్రియల్లో ఇప్పటివరకు నలబైకీ పైగా పుస్తకాలు ప్రకటించారు. మంచి ముత్యం (జాన్ స్టెయిన్ బెక్ నవల) మధుశాల (హరివంశ్ రాయ్ బచ్చన్ కావ్యం) ఆరుబయట ఆకాశం కోసం (భారతీయ భాషల్లో స్త్రీవాద కధలు) కవితాభారతి (భారతీయ కవిత్వం) మట్టి గుండె చప్పుళ్ళు(మరాఠీ దళిత కవిత్వం) నీకూ నాకూ మధ్య ఒక రంగులనది (ప్రపంచ కవిత్వం) తెలుగులో వెలువరించి తెలుగు సాహితీ లోకానికి ఎనలేని సేవా చేశారు. - రచయిత గురించి
© 2017,www.logili.com All Rights Reserved.