శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అగ్రేసర రంగస్థల నటులు. ఎంతటి నటులో అంతటి విద్వాంసులు. ప్రాచీన కావ్య పరిజ్ఞానం కలవారు. అంతేకాక ఇప్పుడు ఈ " అష్టవిధ శృంగార నాయికలు" కృతి ద్వారా ఒక ప్రౌడ కవిగా మరోసారి సాహితీ జగత్తులో సాక్షాత్కరిస్తున్నారు.
అవస్థా భేదాలను బట్టి శృంగార రసంలో అష్టవిధ నాయికలుంటారు. భర్త పరస్త్రీ కాంక్షారహితుడై తనపైనే ప్రగాడమైన అనురాగంతో తనకు అధీనుడై వున్న నాయిక 'స్వాధీన పతిక'. తన ప్రియుడు వచ్చే సమయానికి ఇంటిని, గదిని, తననూ అలంకరించుకొని నిలిచేది 'వాసక సజ్జిక'. విభుడు పరకాంతలోలుడై రాత్రంతా గడిపి, తెల్లవారుజామున తన ఇంటికి రాగా ఈసడించి కసరి కొట్టేది 'ఖండిత'. ఆ తరువాత పశ్చాతాప అయ్యేది 'కలహాంతరిత'. ప్రియుని రాక కోసం ఉత్కంటతో ఉండేది 'విరహోత్కంటిత'. పరదేశాగతుడైన ప్రియుని విరహంలో కృషించేది 'ప్రోషిత భార్త్రుక'. మరి మదనపీడితయై, ప్రియుణ్ణి అన్వేషిస్తూ పోయేది 'అభిసారిక'. సంకేత స్థలానికి వెళ్లి ప్రియుడు కనిపించక ఆర్త అయ్యేది 'విప్రలబ్ద'.
అభిసారిక ప్రియునికై సంకేత స్థలానికి పోతు పొందే మానసిక మధనాన్ని ఇలా అక్షర రూపంలో మన ముందుంచుతారు శాస్త్రి గారు ....
"అతని గన పొంగు వయసుల అణచుతటేట్లు
అతని గనకున్న తమి పొంగులడగుటెట్లు
చెలునికై చను నా సిగ్గు చితక దింత
ఎంత తెంపరినైతి నే నింత తెగువ ?"
శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అగ్రేసర రంగస్థల నటులు. ఎంతటి నటులో అంతటి విద్వాంసులు. ప్రాచీన కావ్య పరిజ్ఞానం కలవారు. అంతేకాక ఇప్పుడు ఈ " అష్టవిధ శృంగార నాయికలు" కృతి ద్వారా ఒక ప్రౌడ కవిగా మరోసారి సాహితీ జగత్తులో సాక్షాత్కరిస్తున్నారు. అవస్థా భేదాలను బట్టి శృంగార రసంలో అష్టవిధ నాయికలుంటారు. భర్త పరస్త్రీ కాంక్షారహితుడై తనపైనే ప్రగాడమైన అనురాగంతో తనకు అధీనుడై వున్న నాయిక 'స్వాధీన పతిక'. తన ప్రియుడు వచ్చే సమయానికి ఇంటిని, గదిని, తననూ అలంకరించుకొని నిలిచేది 'వాసక సజ్జిక'. విభుడు పరకాంతలోలుడై రాత్రంతా గడిపి, తెల్లవారుజామున తన ఇంటికి రాగా ఈసడించి కసరి కొట్టేది 'ఖండిత'. ఆ తరువాత పశ్చాతాప అయ్యేది 'కలహాంతరిత'. ప్రియుని రాక కోసం ఉత్కంటతో ఉండేది 'విరహోత్కంటిత'. పరదేశాగతుడైన ప్రియుని విరహంలో కృషించేది 'ప్రోషిత భార్త్రుక'. మరి మదనపీడితయై, ప్రియుణ్ణి అన్వేషిస్తూ పోయేది 'అభిసారిక'. సంకేత స్థలానికి వెళ్లి ప్రియుడు కనిపించక ఆర్త అయ్యేది 'విప్రలబ్ద'. అభిసారిక ప్రియునికై సంకేత స్థలానికి పోతు పొందే మానసిక మధనాన్ని ఇలా అక్షర రూపంలో మన ముందుంచుతారు శాస్త్రి గారు .... "అతని గన పొంగు వయసుల అణచుతటేట్లు అతని గనకున్న తమి పొంగులడగుటెట్లు చెలునికై చను నా సిగ్గు చితక దింత ఎంత తెంపరినైతి నే నింత తెగువ ?" .... సి నా రె
© 2017,www.logili.com All Rights Reserved.