డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జీవితం, ఆశయాలు, చేసిన ఉద్యమాలు భారతదేశ ఆర్దిక, సామాజిక, రాజకీయ అస్తిత్వం పై ఎంతో ప్రభావం చూపాయి. ఒక సామాజిక దార్శనికుడు, మేధావి తన అనుభవసారం నుండి భవిష్యత్ తరాలకు ఎలా మార్గదర్శనం చేయగలడో చెప్పటానికి గల అతి కొద్దిమందిలో బాబా సాహెబ్ ఒకరు. తరువాత చాలా విశ్లేషణాత్మక, పరిశోధన పూర్వక గ్రంధాలు వచ్చాయి. ఇంకా వస్తూనే వుంటాయి. అయితే అయన సమకాలీన జీవితం, పరిస్థితులు, నాయకులు, చారిత్రక ఘటనలు, ఆనాటి పత్రికల విశ్లేషణలు అరుదుగా లభిస్తాయి. ముఖ్యంగా అయన బాల్యం, తారసపడ్డ వ్యక్తులు, వారితో జరిపిన ప్రత్య్తుతరాలు, వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువు, పరిశోదన చేసేటప్పటి విశేషాలు, సర్టిఫికేట్లు, బరోడా మహారాజు - అంబేద్కర్ చదువు విషయంలో రాసిన ఉత్తరాలు, అరుదైన ఫోటోలు, అంబేద్కర్ పరిశోధన గ్రంధాల వివరాలు వంటివి సాధారణ పాటకులకు అందుబాటులో లేవు. ఆ లోటునూ పూరిస్తూ శ్రీ వసంత్ అబాజి దహకే, శ్రీ విజయ్ సుర్వాడే ఎన్నో ఏళ్ళుగా పరిశోధించి సేకరించి ఫోటోలు, పత్రికలు, ఉత్తరాలు మిగతా వివరాలతో బాటు ఒక చక్కటి విశ్లేషణతోను మరాటిలో రూపొందించిన అపురూపమైన గ్రంధాన్ని ఇంగ్లీష్లో "డా. బాబా సాహెబ్ అంబేద్కర్" గా లోక్ వాజ్మయ గృహ, బొంబాయి వారు 2008లో ప్రచురించారు. ఫోటో పేపర్ పై 288 పేజీల "కాఫీ టేబుల్ బుక్ " గా అతి సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటి వరకు ఇంగ్లీష్, గుజరాతీ, మరాటి భాషలలోనే అందుబాటులో ఉన్న ఈ పుస్తకాన్ని తెలుగు భాషలో కూడా ప్రచురించి విశాలాంద్ర బుక్ హౌస్ వారు మనముందుకు తీసుకువచ్చారు.
డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జీవితం, ఆశయాలు, చేసిన ఉద్యమాలు భారతదేశ ఆర్దిక, సామాజిక, రాజకీయ అస్తిత్వం పై ఎంతో ప్రభావం చూపాయి. ఒక సామాజిక దార్శనికుడు, మేధావి తన అనుభవసారం నుండి భవిష్యత్ తరాలకు ఎలా మార్గదర్శనం చేయగలడో చెప్పటానికి గల అతి కొద్దిమందిలో బాబా సాహెబ్ ఒకరు. తరువాత చాలా విశ్లేషణాత్మక, పరిశోధన పూర్వక గ్రంధాలు వచ్చాయి. ఇంకా వస్తూనే వుంటాయి. అయితే అయన సమకాలీన జీవితం, పరిస్థితులు, నాయకులు, చారిత్రక ఘటనలు, ఆనాటి పత్రికల విశ్లేషణలు అరుదుగా లభిస్తాయి. ముఖ్యంగా అయన బాల్యం, తారసపడ్డ వ్యక్తులు, వారితో జరిపిన ప్రత్య్తుతరాలు, వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువు, పరిశోదన చేసేటప్పటి విశేషాలు, సర్టిఫికేట్లు, బరోడా మహారాజు - అంబేద్కర్ చదువు విషయంలో రాసిన ఉత్తరాలు, అరుదైన ఫోటోలు, అంబేద్కర్ పరిశోధన గ్రంధాల వివరాలు వంటివి సాధారణ పాటకులకు అందుబాటులో లేవు. ఆ లోటునూ పూరిస్తూ శ్రీ వసంత్ అబాజి దహకే, శ్రీ విజయ్ సుర్వాడే ఎన్నో ఏళ్ళుగా పరిశోధించి సేకరించి ఫోటోలు, పత్రికలు, ఉత్తరాలు మిగతా వివరాలతో బాటు ఒక చక్కటి విశ్లేషణతోను మరాటిలో రూపొందించిన అపురూపమైన గ్రంధాన్ని ఇంగ్లీష్లో "డా. బాబా సాహెబ్ అంబేద్కర్" గా లోక్ వాజ్మయ గృహ, బొంబాయి వారు 2008లో ప్రచురించారు. ఫోటో పేపర్ పై 288 పేజీల "కాఫీ టేబుల్ బుక్ " గా అతి సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటి వరకు ఇంగ్లీష్, గుజరాతీ, మరాటి భాషలలోనే అందుబాటులో ఉన్న ఈ పుస్తకాన్ని తెలుగు భాషలో కూడా ప్రచురించి విశాలాంద్ర బుక్ హౌస్ వారు మనముందుకు తీసుకువచ్చారు.© 2017,www.logili.com All Rights Reserved.