మంచి టీచర్ల మనసులోని మాటలు
మన పాటశాల పిల్లలకు విద్యాభోధన చేయటంలో ఉపాధ్యాయులు అనేక అనుభవాలను సంపాదించుకుంటారు. వివిధ సామాజిక పరిస్థితుల్లో విద్యాభోదనను ఒక సృజనాత్మక ప్రక్రియగా తీర్చిద్దిదడానికి ఎందరో ఉపాధ్యాయులు తమ జీవితకాలాన్ని అంకితం చేస్తుంటారు. ఈ అనుభవాలు, విద్యభోదనలో ఉపాధ్యాయులు చేసిన ప్రయోగాలు అందరికి తెలియవలసిన అవసరం ఉందనే ఉద్దేశ్యంతో ఉపాద్యాయుల కోసం "బడినేర్పిన పాఠాలు" పోటీని 'ఆంధ్రజ్యోతి-ఎమెస్కో' నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటిలో ఎంపికైన ఉపాధ్యాయుల అనుభవాల మాలిక ఈ పుస్తకం.
ఈ సంక్లిష్ట యుగంలో ఒక సృజనాత్మకరంగాన్ని తన శైలిలో తాను నెట్టుకొస్తున్న టీచరు నుంచి మనం కొంచెం ఏదో విందామని చెవిపెడితే అతని స్పందన ఎలా వుంటుంది?
తలకు మించిన భారాన్ని మోస్తున్న టీచరు అసలు తానేమనుకొంటున్నాడు?
సజీవమూర్తులతో అనునిత్యం సాహచర్యం నెరిపే టీచరు కేవలం పిల్లలకి మాత్రమే పాటాలు చెప్పెవాడా?
పిల్లల్నించి కూడా పాటాలు నేర్చుకునేవాడా ?
సమజమతన్ని ఎలా చూస్తోంది?
సమాజాన్నతనేలా చూస్తున్నాడు?
ఈ సంగతులు టీచర్ల నోటినుంచి మనం ఓపిగ్గా వింటే ఎంత బావుణ్ణూ!
ఏమైనా ఇలాంటి అవసరాన్ని ఈ అనుభవాల ద్వారా ఈ టీచర్లు ప్రపంచం ముందు వుంచారు. ఇలా సగటు టీచరు మనసు విప్పి మాట్లాడ్డానికి విస్తృతావకాసం కల్పించడం, వాటిని రికార్డు చేసి పుస్తకం గా మీ ముందుంచారు.
వి. బాల సుబ్రహ్మణ్యం
జనవిజ్ఞానవేదిక
మంచి టీచర్ల మనసులోని మాటలు మన పాటశాల పిల్లలకు విద్యాభోధన చేయటంలో ఉపాధ్యాయులు అనేక అనుభవాలను సంపాదించుకుంటారు. వివిధ సామాజిక పరిస్థితుల్లో విద్యాభోదనను ఒక సృజనాత్మక ప్రక్రియగా తీర్చిద్దిదడానికి ఎందరో ఉపాధ్యాయులు తమ జీవితకాలాన్ని అంకితం చేస్తుంటారు. ఈ అనుభవాలు, విద్యభోదనలో ఉపాధ్యాయులు చేసిన ప్రయోగాలు అందరికి తెలియవలసిన అవసరం ఉందనే ఉద్దేశ్యంతో ఉపాద్యాయుల కోసం "బడినేర్పిన పాఠాలు" పోటీని 'ఆంధ్రజ్యోతి-ఎమెస్కో' నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటిలో ఎంపికైన ఉపాధ్యాయుల అనుభవాల మాలిక ఈ పుస్తకం. ఈ సంక్లిష్ట యుగంలో ఒక సృజనాత్మకరంగాన్ని తన శైలిలో తాను నెట్టుకొస్తున్న టీచరు నుంచి మనం కొంచెం ఏదో విందామని చెవిపెడితే అతని స్పందన ఎలా వుంటుంది? తలకు మించిన భారాన్ని మోస్తున్న టీచరు అసలు తానేమనుకొంటున్నాడు? సజీవమూర్తులతో అనునిత్యం సాహచర్యం నెరిపే టీచరు కేవలం పిల్లలకి మాత్రమే పాటాలు చెప్పెవాడా? పిల్లల్నించి కూడా పాటాలు నేర్చుకునేవాడా ? సమజమతన్ని ఎలా చూస్తోంది? సమాజాన్నతనేలా చూస్తున్నాడు? ఈ సంగతులు టీచర్ల నోటినుంచి మనం ఓపిగ్గా వింటే ఎంత బావుణ్ణూ! ఏమైనా ఇలాంటి అవసరాన్ని ఈ అనుభవాల ద్వారా ఈ టీచర్లు ప్రపంచం ముందు వుంచారు. ఇలా సగటు టీచరు మనసు విప్పి మాట్లాడ్డానికి విస్తృతావకాసం కల్పించడం, వాటిని రికార్డు చేసి పుస్తకం గా మీ ముందుంచారు. వి. బాల సుబ్రహ్మణ్యం జనవిజ్ఞానవేదిక
© 2017,www.logili.com All Rights Reserved.