బాపుగారి బాడే ఇవాళ!
'బాడే' అంటే మరేం లేదు, బర్త్ డే.
మరి బాపు అంటే? హు ఈజ్ హీ?
మరీ అంత అన్యాయమైన ప్రశ్నేం కాదు.
సమాధానాలే... హీనం! విహీనం!
ఫిల్మ్ డైరక్టర్ అంటారు... ఇలస్ట్రెటర్ అంటారు.
కార్టూనిస్ట్ అంటారు... పెయింటర్ అంటారు.
డిజైనర్ అంటారు... పద్మశ్రీ అంటారు.
ఇక - బర్త్ డేని 'బాడే' అంటే తప్ప...
క్యాచ్ చెయ్యలేని జనరేషన్ అయితే
'అమ్మో! బాపుగారి బొమ్మో' అని రాగం తీసి,
ఆయనే కదా అంటారు!
బాపుగారిలో ఎంతుందో అంతా తెలిసిపోయింది లోకానికి.
బాపుగారిలో... ఏం లేదో కూడా తెలుసుకుంటేనే
'బాపుగారంటే ఎవరు' అనే ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది.
ఆన్సర్ ఆల్రెడి శ్రీరమణ దగ్గరుంది.
తారలకు తార అయిన బాపుగారి అంతరంగమూ...
ఆ ఆన్సర్ లోనే ఉంది.
అర్ధశతాబ్దిగా ఆ పేరు తెలుగునాట ఇంటింటి పేరు. సాహిత్య కళా రంగాలలో ప్రజ్ఞ ప్రఖ్యాతి గాంచినవారు. కారం చమత్కారం మమకారం తగుపాళ్లలో పంచినవారు. ఆయన ఒక్కరు కాదు ఇద్దరు. తెలుగువారు బాపుని రమణని విడివిడిగా అభిమానించారు. అందమైన ద్వంద్వ సమానంగా ఆ జంటని సమాదరించారు. బాపు - రమణల స్నేహరాసిక్యతకు నిండుమనసుతో నీరాజనాలెత్తారు. వారిద్దరుకారు ఒక్కరేనని తీర్మానించారు - తెలుగువారు.
బాపుగారి బాడే ఇవాళ! 'బాడే' అంటే మరేం లేదు, బర్త్ డే. మరి బాపు అంటే? హు ఈజ్ హీ? మరీ అంత అన్యాయమైన ప్రశ్నేం కాదు. సమాధానాలే... హీనం! విహీనం! ఫిల్మ్ డైరక్టర్ అంటారు... ఇలస్ట్రెటర్ అంటారు. కార్టూనిస్ట్ అంటారు... పెయింటర్ అంటారు. డిజైనర్ అంటారు... పద్మశ్రీ అంటారు. ఇక - బర్త్ డేని 'బాడే' అంటే తప్ప... క్యాచ్ చెయ్యలేని జనరేషన్ అయితే 'అమ్మో! బాపుగారి బొమ్మో' అని రాగం తీసి, ఆయనే కదా అంటారు! బాపుగారిలో ఎంతుందో అంతా తెలిసిపోయింది లోకానికి. బాపుగారిలో... ఏం లేదో కూడా తెలుసుకుంటేనే 'బాపుగారంటే ఎవరు' అనే ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది. ఆన్సర్ ఆల్రెడి శ్రీరమణ దగ్గరుంది. తారలకు తార అయిన బాపుగారి అంతరంగమూ... ఆ ఆన్సర్ లోనే ఉంది. అర్ధశతాబ్దిగా ఆ పేరు తెలుగునాట ఇంటింటి పేరు. సాహిత్య కళా రంగాలలో ప్రజ్ఞ ప్రఖ్యాతి గాంచినవారు. కారం చమత్కారం మమకారం తగుపాళ్లలో పంచినవారు. ఆయన ఒక్కరు కాదు ఇద్దరు. తెలుగువారు బాపుని రమణని విడివిడిగా అభిమానించారు. అందమైన ద్వంద్వ సమానంగా ఆ జంటని సమాదరించారు. బాపు - రమణల స్నేహరాసిక్యతకు నిండుమనసుతో నీరాజనాలెత్తారు. వారిద్దరుకారు ఒక్కరేనని తీర్మానించారు - తెలుగువారు.© 2017,www.logili.com All Rights Reserved.