ఎప్పటి నుంచో నాకు ఓ తీరని కోరిక...
ఓ అయిదు తరాల నవల రాయాలి....
ఓ మాగ్నం ఓపస్!
బుచ్చిబాబు గారి 'చివరకు మిగిలేది' లాగా..
రావిశాస్త్రి గారి 'రత్తాలు-రాంబాబు' లాగా..
ఎలా ప్రారంభించాలి?
అన్ని తరాలు ఎలా ఊహించాలి?
ఆ అయిదు తరాలు మేమే ఎందుక్కాకూడదు!
ఊహ, కల్పన అవసరం లేదు.
మా అమ్మమ్మ మొదలు, మా మనవల వరకూ
అన్నీ తెలిసిన జీవితాలే!
మేము పెరిగిన వాతావరణం, ఉమ్మడి
కుటుంబాలు, ఆప్యాయతలు, విలువలు
ఇప్పుడు ఎలా ఏట్లో కలిసిపోయేయో,
డబ్బు మనిషిని ఎలా విషంగా
మార్చేసిందో ఈ తరానికి చెప్పాలి.
అవసరం కూడా!
అదే
బీనాదేవీయం
ఎప్పటి నుంచో నాకు ఓ తీరని కోరిక... ఓ అయిదు తరాల నవల రాయాలి.... ఓ మాగ్నం ఓపస్! బుచ్చిబాబు గారి 'చివరకు మిగిలేది' లాగా.. రావిశాస్త్రి గారి 'రత్తాలు-రాంబాబు' లాగా.. ఎలా ప్రారంభించాలి? అన్ని తరాలు ఎలా ఊహించాలి? ఆ అయిదు తరాలు మేమే ఎందుక్కాకూడదు! ఊహ, కల్పన అవసరం లేదు. మా అమ్మమ్మ మొదలు, మా మనవల వరకూ అన్నీ తెలిసిన జీవితాలే! మేము పెరిగిన వాతావరణం, ఉమ్మడి కుటుంబాలు, ఆప్యాయతలు, విలువలు ఇప్పుడు ఎలా ఏట్లో కలిసిపోయేయో, డబ్బు మనిషిని ఎలా విషంగా మార్చేసిందో ఈ తరానికి చెప్పాలి. అవసరం కూడా! అదే బీనాదేవీయం© 2017,www.logili.com All Rights Reserved.